ధనవంతుల ఇంటవివాహం జరగడం అంటే మామూలుగా ఉండదు. ఆకాశమంత పందిరి వేయుట, లైటింగ్, పూలతో కళకల్లాడే పెళ్లి మండపం, ఎంత తిన్నా తరగని రకరకాల వంటకాలతో విందు భోజనాలు. ఎన్నో ఉంటాయి. ఒకటేమిటీ ఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంటాయి. ఇక ఊరేగింపు విషయానికోస్తే. రాజకుమారునిరాచరికం అంతా ఉట్టిపడుతునట్లు కనిపిస్తుంది. అయితే, ఈ పెళ్లి అలా కాదు, మనము ఊహించిన దానికి విరుద్ధంగా ఉన్నది. అంతకు మించిగుజరాత్‌లోని జామ్‌నగర్‌కు జడేజా గ్రూప్ సంస్థ అధినేత రుషిరాజ్ సిన్హా.. వాణిజ్యవేత్తగా పేరుపొందాడు. అంతే కాకుండా సోషల్ మీడియా ఇన్‌ఫ్యూయెన్సర్‌గానే ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు.

 

అతను అను ఖరీదైన కార్లు, గుర్రపు స్వారీలతో ఎంతోమంది అభిమానులను తన సొంతం చేసుకున్నాడు. గతవారం అతడి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. స్వర్గంలో కూడా ఇలాంటి పెళ్లి జరగదేమో అనే విధంగా ఉంది ఇక అతడి అభిమానుల ఆనందానికైతే అవధుల్లేవు. అతని పెళ్లి ఊరేగింపులో ఎంతో మంది జనాలు పాల్గొన్నారు. అలా లా పాల్గొన్న జనాలపైకి నోట్ల వర్షం కురిపించారు. అందులో కేవలము  రూ.500, రూ.2000 నోట్లను మాత్రమే చిత్తు కాగితాల్లా విసిరారు. ఈ వింతను చూసి అక్కడి జనులు విస్తుపోవడం జరిగినది. రూ.కోటికి పైగా నోట్లను గాల్లోకి విసురుతూ చాలా సందడి చేశారు వీటిని ఏరుకోవడం ప్రజల వంతు అయినది.. వీరు దాదాపు  ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వీరు డబ్బులు విసురుతూనే ఉన్నారు.

 

ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి.టిక్‌టాక్ క్రేజ్‌తోనే వీరు ఇలా చేశారని అందరూ అంటున్నారు. డబ్బులను అలా గాల్లోకి విసరడం చూసిన ప్రజలులేని వాళ్లకు ఇస్తే ఎంత బాగుండును అనుకున్నారు. ఇంకొందరు నోరు వెళ్లబెడుతున్నారు. కొంతమంది జనులు ఏడాది అంతా కష్టపడినా కూడా లభించనంత సొమ్మును వారు క్షణాల్లో గాల్లోకి విసిరేసి సంబరాలు చేసుకుంటున్నారని, విస్తుపోయారు. మరికొందరు డబ్బులు ఎక్కువైతే జనాలు ఇలాగే ఉంటారేమో అని కామెంట్లు చేస్తున్నారు.

 

ఇదిలా ఉండగా ఈ పెళ్లి కోసం జామ్‌నగర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెల్లా గ్రామంలో భరాత్ నిర్వహించారు. వధువరులు ఈ వేడుక కోసం రోడ్డు మార్గంలో కాకుండా ఏకంగా గాలిలో 20 కిలోమీటర్లు హెలికాప్టర్లో ప్రయాణించి వెళ్లడం ఆశ్చర్యకరమైన విషయము. ప్రస్తుతం ఈ వీడియో కూడా టిక్‌టాక్‌లో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. దీనిని బట్టి వెంట్రుకలు ఉన్న అమ్మ ఏ కొప్పు అయినా  కడుతుంది. వెంట్రుకలు లేని బోడెమ్మ ఏమి కడుతుంది అని కామెంట్లు విసురుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: