చాలా మంది దంపతులు పిల్లలు లేక సతమతమవుతూ ఉంటారు. ఎన్ని రోజులకి కూడా పిల్లలు పుట్టకపోతే వాళ్లకు కలిగే బాధ అంతా ఇంతా ఉండదు. దాని కోసం ఎన్నో గుడి లు, గోపురాలు తిరుగుతూ ఉంటారు. మెడికల్ టెస్ట్ లకి లక్షల లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఇప్పుడు విషయం, ఏమంటే మన తమిళనాడు దేవాలయాలకు పెట్టింది పేరు. కాంచీపురం కంచి పట్టు చీరలకు ఎంత ఫేమస్ అలాగే దేవాలయంలో కూడా పెట్టింది పేరు. కానీ ఇక్కడ ఒక బలమైన నమ్మకం కూడా ఉంది.

 

పంచభూత లింగాల్లో ఒక వాయులింగం మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉంది మిగతా అన్ని లింగాలు కూడా తమిళనాడులోనే ఉన్నాయి. కంచి లో మనకు కనిపించేది పృథ్విలింగం. ఇక్కడ పృథ్విలింగం ఏకాంబరేశ్వరుడు అని కూడా అంటారు ఏ గ్రామం అంటే ఒక మామిడి చెట్టు ఏకాంబరేశ్వర స్వామి అంటారు. ఆలా ఎందుకంటే ఒక మామిడి చెట్టు కింద వెలసిన స్వామి అని అర్థం.

 

ఈ ఆలయాన్ని విజయనగర రాజులు నిర్మించారు. ఇక్కడ ఆలయం విగ్రహం రాయి తో కాకుండా మట్టితో చేసింది కావడంతో విశేషంగా అందరిని ఆకట్టుకుంటుంది. మూల విరాట్ విగ్రహం అలాగే ఉత్సవ విగ్రహం రెండు కూడా మట్టితో చేసినవే. దేవాలయం ప్రత్యేకత ఏమిటి అంటే ఈ దేవాలయంలో దాదాపు 3,500 సంవత్సరాల వయస్సు గ్గల మామిడి చెట్టు ఉంది.

 

 ఆలయంలో మొత్తం 1,008 శివలింగాలు ప్రతిష్టించబడి ఉంటాయి. ఇంకో విశేషమేమంటే ఈ చెట్టుకు నాలుగు కొమ్మలు నాలుగు రకాల రుచులు కలిగిన మామిడి పండ్లు కాస్తాయి. సంతానం లేని దంపతులు ఈ చెట్టు నుంచి వచ్చే పండ్లు తింటే కచ్చితంగా సంతానం కలుగుతుందని నమ్ముతారు. కానీ ఆలయ అధికారులు కేవలం ఆ చెట్టు కాండాన్ని మాత్రమే చూసేందుకు దాన్ని భద్రపరిచారు. పురాతన మామిడి చెట్టు స్థానంలో కొత్త మామిడి చెట్టును అధికారులు నాటారు. ఎక్కడా లేని విధంగా ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు వధూవరులుగా దర్శనమిస్తారు, అలాగే పార్వతీదేవి ఒడిలో కుమారస్వామి ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: