ఇది నా సొంత అనుభవంతో రాస్తున్న కథ నాకు 15ఏళ్ల వయసప్పుడు నా జుట్టు తెల్లబడటం మొదలైంది. దానివల్ల నాకూ, మా నాన్నకూ ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. కానీ మా అమ్మ మాత్రం నా జుట్టు చూసి చాలా కంగారు పడి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. కాల్షియం సప్లిమెంట్లు తీసుకోమని డాక్టర్ సలహా ఇచ్చారు. కానీ జుట్టు తెల్లబడటం ఆగలేదు. ఇది దాదాపు 15ఏళ్ల కిందటి మాట.’ ఇప్పుడు నా జుట్టు సగం తెల్లగా, సగం నల్లగా ఉంటుంది. ఇలా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం ఈ మధ్య మామూలైపోయింది. గూగుల్ ట్రెండ్స్‌ని గమనించినా గత పదేళ్లలో తెల్ల జుట్టు గురించి వెతికే వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది.

 

గూగుల్‌లో ఈ అంశం గురించి వెతికే వాళ్లలో ఒకరు.  ‘తెల్ల వెంట్రుకల్ని చూడగానే ఇబ్బందిగా అనిపించింది. వెంటనే గూగుల్‌లో దానికి పరిష్కారం వెతకడం మొదలుపెట్టా. మా నాన్న కార్డియాలజిస్ట్. ఆయన సలహాపై వైద్యుడి దగ్గరకు వెళ్లా. నా ఆహార అలవాట్లతో పాటు రకరకాల హెయిర్ ప్రొడక్ట్‌లను వాడటం కూడా జుట్టు తెల్లబడటానికి కారణమని తెలిసింది’ అని తెలిసింది. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం ఓ జబ్బు అని డాక్టర్లు చెబుతున్నారు. వైద్య పరిభాషలో దాని పేరు కెనాయిటిస్.

 

ఇండియన్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీలో 2016లో ప్రచురించిన ఓ పరిశోధన ఫలితాల ప్రకారం భారత్‌లో సగటున 20 ఏళ్ల వయసులోనే జుట్టు తెల్లబడటం మొదలవుతోంది. 20 ఏళ్లు, లేదా అంత కంటే ముందు జుట్టు తెల్లబడితే దాన్ని కెనాయిటిస్‌గానే గుర్తించాలి. కెనాయిటిస్ సమస్య ఉన్న వాళ్లలో జుట్టుకి రంగుని కల్పించే పిగ్మెంట్‌ కణాలలో సమస్య నెలకొంటుంది. ఈ సమస్య వెనక చాలా కారణాలుంటాయి. జన్యుపరమైన సమస్యలతో పాటు, ఆహారంలో ప్రొటీన్, కాపర్‌ లోపం, హార్మోన్లలో అసమతుల్యత లాంటివీ ఈ పరిణామానికి దారితీయొచ్చు. హెమోగ్లోబిన్ లోపం, ఎనీమియా, థైరాయిడ్ సమస్యల కారణంగా కూడా జుట్టు తెల్లబడే అవకాశం ఉంది.

 

‘పుట్టుకతో సంక్రమించే జన్యువులే మనిషి రంగు, రూపు లాంటి చాలా అంశాలను నిర్ణయిస్తాయి. మనుషుల జాతి, ప్రాంతాన్ని బట్టి కూడా జుట్టు రంగు మారే వయసులో తేడాలుంటాయి’ అని బ్రిటన్‌లోని బ్రాడ్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ టోబిన్ అంటున్నారు. అయినా ఈ అంశం పైన చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు.

 

భారత్‌లో 40 ఏళ్లు దాటిన వాళ్లలో జుట్టు తెల్లబడితే దాన్ని జబ్బుగా పరిగణించాల్సిన అవసరం లేదని ఆయన చెబుతున్నారు. చిన్న వయసులో జుట్టు తెల్లబడటాన్ని ఒక్కొక్కరూ ఒక్కోలా స్వీకరిస్తారు. కొంతమంది తమ సమస్యను దాచిపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇంకొందరు మాత్రం దాన్నే తమ స్టయిల్ స్టేట్‌మెంట్‌గా భావించి జుట్టును అలానే రంగు వేయకుండా వదిలేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: