జియో రాకతో  టెలికాం రంగంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి . అదే విదంగా నెట్వర్క్ విషయం లో చాలామార్పులే చోటు చేసుకున్నాయి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 4జీ స్తానం లోకి   త్వరలో 5జీ రానుంది . దానికి సంబంధించిన సన్నాహాలు కూడా చేస్తున్నారు .

 

అయితే అంతకుముందే కాలింగ్ విషయంలో ఓ అసాధారణ ఫీచర్ అందుబాటులోకి తీసుకోని రానుంది . అదే వైఫై కాలింగ్. ఈ ఫీచర్ ను ఇప్పటికే కొన్ని కంపెనీలు  కొన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురాగా ఇప్పుడు  జియో కూడా పూర్తి స్థాయిలో తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తోంది. అయితే ఈ సేవలను జియో  ఉచితంగా అందించనుండటం విశేషం.

 

ఈ ఫీచర్ ద్వారా కలిగే ప్రధాన ఉపయోగం ఏంటంటే.. కొంతమంది ఇళ్లలో నెట్ వర్క్ సరిగ్గా పనిచేయదు. వారు కాల్స్ మాట్లాడలంటే తప్పనిసరిగా ఇంటి బయటకు వచ్చో, లేకపోతే మేడ మీదకు వెళ్లో ఫోన్ మాట్లాడాల్సి ఉంటుంది. కానీ ఈ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకుంటే.. మీ ఇంట్లో సిగ్నల్ లేకపోయినా వైఫైకు కనెక్ట్ చేసుకుంటే చాలు.. మరింత స్పష్టంగా ఫోన్ కాల్స్ మాట్లాడవచ్చు.

 

సాధారణ మొబైల్ నెట్ వర్క్ కాలింగ్ కంటే మరింత నాణ్యతతో ఈ వైఫై కాలింగ్ పని చేయనుంది. దీని ద్వారా కాల్స్ మాట్లాడుకున్నప్పుడు 5 నిమిషాలకు కేవలం 5 ఎంబీ డేటా మాత్రమే ఖర్చయింది.ప్రస్తుతానికి అయితే ఎయిర్ టెల్, జియో రెండు నెట్ వర్క్ లూ దీని కోసం అదనంగా ఎటువంటి రుసుమునూ వసూలు చేయడం లేదు. కాబట్టి వినియోగదారులు ఈ వైఫై కాలింగ్ సేవలను ఉచితంగా ఎంజాయ్ చేయవచ్చు.

 

మహారాష్ట్రలోని నాసిక్ సర్కిల్ లో రిలయన్స్ జియో వాయిస్ ఓవర్ వైఫై సేవలు ప్రారంభమయ్యాయి. అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే.. ఈ ఫీచర్ మాకు అందుబాటులోకి వచ్చింది అని చెబుతోన్న వినియోగదారులందరూ ఐఫోన్ వినియోగదారులే. మరి జియో ముందుగా ఐఫోన్ వినియోగదారులపైనే ఈ ఫీచర్ ను పరీక్షిస్తోందా లేదా మిగతా నెట్ వర్క్ లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొని రానుందా అనే విషయంపై  ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: