ఎలా ఉండేవోడు ఎలా అయిపోయాడ్రా నాయనా అనిపిస్తోంది టీడీపీ అధినేత చంద్రబాబును చూస్తుంటే..!  ఉంగరాలు పెట్టుకుని ఢిల్లీలో రాజకీయాలను బొంగరాలు  తిప్పిన చంద్రబాబును ఇప్పుడు పట్టించుకునేవారే కరువయ్యారు. ఎక్కడో ఢిల్లీ వరకు ఎందుకు ఇప్పుడు సొంత పార్టీలోనే బాబా అయితే మాకు లెక్కా అన్నట్టుగా కొంతమంది సీనియర్ నాయకులు మరికొంతమంది యువ నాయకులు వ్యవహరిస్తున్నారు. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఎవరు ఎన్ని అన్నా దిగమింగుకుని సైలెంట్ గా కూర్చుని చూస్తున్నారు.


అసలు చంద్రబాబుకు గొంతుక్కి అడ్డం పడ్డ విషయం ఏదైనా ఉందా అంటే..?  అది ఆ జగన్ పార్టీకి 151 సీట్లు రావడం. ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ అయిన ఆయన పార్టీకి 23 సీట్లు రావడం.  అంత తప్పు నేనేం చేసానబ్బా అనుకుంటూ జరిగింది ఏదో జరిగిపోయింది... ఇక జరగాల్సింది చూద్దాం అంటూ తనకు తానే సర్ది చెప్పేసుకుంటున్నాడు. జగన్ దూకుడు కి ఇక పార్టీ పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో చంద్రబాబు మాస్టర్ బ్రెయిన్ లో పాదరసం బాగా పనిచేసిందేమో కానీ ఏపీలో అనేక ఉద్యమాలను లేవదీశాడు. కానీ ఆ జగన్ ఏమో ప్రజలకు ఉపయోగపడే పథకాలు, నిర్ణయాలు తీసుకోవడంతో బాబు ఉద్యమాలను చూసి ప్రజలు కూడ పో పో వయ్య బాబు అంటూ చీదరించేసారు.


 ఇప్పుడేమో కమలం పార్టీ వాళ్ళు అప్పుడెప్పుడో తిరుపతిలో అమిత్ షా మీద వేసిన రాళ్ల పోగు చేసి మరి చంద్రబాబు మీద విసిరేస్తున్నారు. ఒకపక్క మరోపక్క ఈ డి ఇంకోపక్క ఐటి మరో పక్క సీబీఐ ఇలా అందరిని రంగంలోకి దించేశారు. తన బాధను చెప్పుకోలేక దాడుల్లో బయటపడుతున్న నిజాలను ఒప్పుకోలేక ...  హైదరాబాదులో ముచ్చటపడి కట్టించుకుని ఇంట్లోనే తలదాచుకుంటున్నాడు. ఢిల్లీ పెద్దలను కలిసి శరణు శరణు మహాప్రభో అని వేడుకుందాం అంటే ఆ అవకాశం ఇవ్వడంలేదు. బతిమాలాడుకోవడానికి తన ముఖం కూడా చెల్లడంలేదు.


పోనీ తన పుత్రరత్నం లోకేష్ ని అయినా ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల కాళ్ళు.. వేళ్ళు పట్టుకుని బతిమిలాడమందామా అంటే వారు కూడా సో సారి అపాయింట్మెంట్ ఇవ్వకుండా నో.. నో అని చెప్పేశారు. గతంలో ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నాడు కాబట్టి ఢిల్లీలో చక్రాలు, బొంగరాలు తిప్పిన అనుభవం ఉండడంతో ఎవరైనా గుర్తుంచుకుని ఇప్పుడు తనను ఆదుకుంటారా  అంటే వారు కూడా నీ పని అయిపోయింది అన్నట్టుగా వెక్కిరింపుగా  చూస్తుండడంతో బాబు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు.


2014లో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న బాబు ఆ తర్వాత దాని వల్ల ఉపయోగం లేదని తెలిసి బయటికి వచ్చేశారు. వచ్చిన వాడు కుదురుగా ఏమైనా కూర్చున్నాడా అంటే అది లేదు. మోడీ హటావో అంటూ గట్టిగా మైకు పట్టుకుని దేశమంతా వినిపించేలా అరిచేసాడు. దీంతో ఆ కాషాయ పెద్దలకు మండిపోయింది. చంద్రబాబు ఎప్పటికైనా డేంజర్ అని ఎన్నికలకు ముందే జగన్ కు అన్ని రకాలుగా సహాయపడిపోయి ఇప్పుడు కూడా జగన్ కు జై జై చెప్పేస్తున్నారు. దీంతో బాబు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా అయిపొయింది. ఢిల్లీలో కథ నాయకుడిగా పేరు ఉన్న చంద్రబాబును ఇప్పుడు అందరూ పక్కన పెట్టడం తో తన భవిష్యత్తు తన కుమారుడు భవిష్యత్తు ఏంటో తెలియక బాబు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. ( అని ప్రజలంతా చర్చించుకుంటున్నారన్నమాట. ఇందులో మాకేమి సంబంధం లేదు బాబోయ్ ) 

మరింత సమాచారం తెలుసుకోండి: