ఒకరు ఎదుగుతుంటే సహజంగా పక్క వారికి కాస్త కడుపు మంటగా ఉండడం సహజం. ఎదుటివాడు మనల్ని మించి ఎదగకూడదు అనే భావం ఎక్కువమందిలో ఉంటుంది. ఇక ఇది రాజకీయాల్లో అయితే చెప్పనక్కర్లేదు. రాజకీయాల్లో ఉన్నవారు ఎవరికీ వారు తామే గొప్ప అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. గెలిచినా ఓడినా తమదే పై చేయి అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. తమ డాబు, దర్పం ఎక్కడా తగ్గకుండా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. రాజకీయాల్లోనూ, రాజకీయ నాయకుల్లోనూ ఇది సర్వ సాధారణంగా ఉండే లక్షణమే. అది కొంతవరకు ఉంటే ఫర్వాలేదు కానీ మితిమీరితేనే ప్రజలకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. నాయకుల కడుపు మంట ఎక్కువ అయితే ఎక్కువ నష్టపోయేది సదరు నాయకులే కాదు ప్రజలు కూడా.


ఏపీ విషయానికి వస్తే ఈ కడుపు మంట రాజకీయం మితి మీరిపోయినట్టుగా కనిపిస్తోంది. తాము అధికారంలో ఉండగా ప్రజలకు ఏమి చేసాము అన్న సంగతి మరిచిపోయి మరీ ఇప్పుడు చిత్తశుద్ధితో ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న ప్రతి పథకాన్ని అడుగడుగా అడ్డుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు పడుతున్న పాట్లు చూసి జనాల్లో సానుభూతి వస్తుందని వారు భావిస్తున్నా ప్రజల్లో మాత్రం తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. వాళ్ళు ఎలాగూ చేయలేదు చేసేవాడిని చెడగొట్టడం ఎందుకు అనే భావన వారిలో కనిపిస్తోంది. అసలు ఏపీ ప్రభుత్వం ఏదైనా కొత్త పథకం కానీ, నిర్ణయం కానీ తీసుకుంటే అది ప్రజలకు ఎంత వరకు ఉపయోగపడుతుంది అని తెలుసుకోకుండా బురద చల్లేందుకు ప్రయత్నించడమే విమర్శలపాలవుతోంది.


కేవలం రాజకీయమే కావలి. ప్రజలు ఎలా పోతే మాకేంటి అన్నట్టుగా నేడు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నించడం విమర్శలపాలవుతోంది. తెలుగుదేశం నాయకులు వ్యవహరిస్తున్నట్టుగానే జనసేన అధినేత పవన్ కూడా ఇదే రకంగా నడుచుకోవడం విడ్డూరంగా కనిపిస్తోంది. నిజంగా తప్పు జరిగినప్పుడు తప్పు అని ఖండించడంలో తప్పు లేదు కానీ ప్రజలకు ఉపయోగపడే విషయాలపైన కూడా అదే రకంగా బురద చల్లేందుకు ప్రయత్నించడమే ఇక్కడ చర్చకు వస్తోంది.
 
 
అసలు తాము తప్ప ప్రజలను ఇంకెవరు సక్రమంగా పరిపాలించలేరు అన్నట్టుగా అటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ విమర్శలు చేస్తుండటమే విమర్శలపాలవుతోంది. ఈ కడుపు మంట రాజకీయాల కారణంగా అన్ని విషయాల్లో ముందుకు వెళ్లాల్సిన ఏపీని వెనక్కి లాగుతుండడమే కాకుండా దేశ వ్యాప్తంగా ఏపీ పరువుని బజారున పడేసిందుకు కూడా వీరు వెనకాడడంలేదు.


 నిజంగా తప్పు జరిగినప్పుడు తప్పు అని మంచి చేస్తున్నప్పుడు మంచి అని మాట్లాడితే ప్రజల్లో కూడా ప్రతిపక్ష పార్టీల మీద గౌరవం పెరుగుతుంది అలా కాకుండా తాము అధికారంలో ఉండగా చేయలేని మంచి పనులు ఇప్పుడు ప్రభుత్వం చేస్తుందనే కోపంతో విమర్శలు చేస్తుండడంతో ఉన్న గౌరవం కూడా వారు కోల్పోతున్నారు.
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: