అప్పుడప్పుడు వాతావరణంలో మార్పులు ఏర్పడుతుంటాయి. వాయుగుండాలు కాస్తా తుఫానుగా మారి ప్రజలను అల్లకల్లోలానికి గురిచేస్తుంటాయి. తుఫాను కానీ వాయుగుండం కానీ వెలిసిపోయిన తరువాత అది చేసిన నష్టం ఎంత ఏంటి అనేది లెక్క తేలినా... అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కానీ రాజకీయాల్లో వాయుగుండాలు లేకపోయినా నాయకులకు అడుగడుగునా గండాలు ఉంటాయి. అధికారంలో ఉన్న సమయంలో అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా అవినీతికి పాల్పడడం, ప్రోత్సహించడం చేస్తే ఆ తరువాత రాజకీయ జీవితం అంతా గడి గడి గండంగా ఉంటుంది. ఇప్పుడు అదే పరిస్థితి ఏపీ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కి వచ్చినట్టు కనిపిస్తోంది.


 పార్టీ అధికారంలో ఉండగా నాయకులు అవినీతికి పాల్పడకుండా అడ్డుకట్ట వేయాల్సిన ఆ పార్టీ అధినేత వాటి గురించి పట్టించుకోకుండా మరింతగా వాటిని ప్రోత్సహించడం... తాను అందులో భాగస్వామ్యం అవ్వడం ఇవన్నీ ఇప్పుడు పీకల్లోతు కష్టాలను తీసుకొస్తున్నాయి. అవినీతి వ్యవహారాల్లో పాలుపంచుకున్న నాయకులు ఒక్కొక్కరుగా బయటకి వస్తున్నారు. దానికి సంబంధించి సాక్షాలు కూడా బయటపడుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాసరావు ఇంట్లో భారీగా అవినీతికి సంబంధించి ఆధారాలు బయటపడడం,దాని ఆధారంగా ఏకంగా కాంగ్రెస్ పార్టీ కోశాధికారి అహ్మద్ పటేల్ సైతం ఇరుక్కోవడం జరిగాయి. 


ఈ వ్యవహారంలో మరికొద్ది రోజుల్లో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాకుండా చేసేందుకు చంద్రబాబు భారీగా కాంగ్రెస్ కు ఆర్ధిక సహాయం చేసినట్టుగా బీజేపీ నమ్ముతూ ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపింది. ఇక ఇప్పుడు ఈ ఎస్ ఐ వ్యవహారంలో అప్పటి కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేరు సాక్షాలతో సహా బయటపడింది. దీనికి సంబంధించి అచ్చెన్న లెటర్ హైడ్ ద్వారా సిపార్సు చేయడం ఇవన్నీ బయటకి వచ్చాయి.

 

 ఏకంగా దీనిపై వైసీపీ ప్రభుత్వం సిట్ ను కూడా ఏర్పాటు చేసింది. ఇందులో మరికొందరు పేర్లు కూడా బయటపడబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తం ఈ వ్యవహారంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. దీంతో చంద్రబాబు ఆయన పార్టీ నాయకుల్లో ఎక్కడలేని భయాందోళనలు నెలకొన్నాయి. ఇవే కాకుండా టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్ని వ్యవహారాలను వైసీపీ బయటకి లాగాలని చూస్తోంది. 


ఒకవైపు పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఇటువంటి సమయంలో ఇలా ఒక్కొక్కటిగా అవినీతి వ్యవహారాలు బయటపడడం ... పార్టీలో కీలక నాయకులు అనుకున్న వారందరికీ ఝలక్ లు తగులుతుండడంతో టీడీపీ ఉనికే ప్రశ్నర్ధకంగా కనిపిస్తోంది. అన్ని సమస్యలు ఇలా ఒక్కసారిగా చుట్టుముట్టేయడంతో ఆ సమస్యల సుడిగుండంలో పడి బాబు విలవిలలాడుతున్నట్టుగా కనిపిస్తున్నాడు. ముందు చూస్తే నుయ్యి ... వెనుక చూస్తే గొయ్యి అన్నట్టుగా బాబు ప్రస్తుత పరిస్థితి కనిపిస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: