మ‌నం ఏం చేయ‌గ‌లం.. మ‌నం ఎందులో విజ‌యాలు సాధించ‌గ‌లం.. అని మ‌న‌ల్ని మ‌నం బేరేజ్ వేసుకుని వంద‌శాతం న‌మ్మితే ఖ‌చ్చితంగా విజ‌యం చేకూరుతుంద‌నే సిద్ధాంతాన్ని న‌మ్మి మిడిల్ క్లాస్ అబ్బాయి అయినా స‌రే అవ‌కాశాల కోసం రైడ్ చేస్తూ స్నేహితుల్ని ఏర్ప‌ర్చి జ‌ట్టుగా ఏర్ప‌డి. క‌థ‌ల ఎంపిక‌లో జంటిల్‌మేన్ అనిపించుకుని అంద‌రూ కోరుకునే మ‌న ప‌క్కింటి అబ్బాయిలాగా స‌హ‌జంగా న‌టిస్తూ... ప్రేక్ష‌కుల చేత నేచ‌ర‌ల్ స్టార్ బిరుదును పొందాన నాని గురించి ఈ రోజు ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఓసారి ఆయ‌న కెరియ‌ర్ మీద ఓ లుక్కేద్దాం...

 

1984 ఫిబ్ర‌వ‌రి 24న ఘంటారాంబాబు, విజ‌య‌ల‌క్ష్మీల‌కు న‌వీన్‌బాబు అలియాస్ నాని. వీరి సొంత ఊరు కృష్ణాజిల్లా చ‌ర్ల‌ప‌ల్లి. అయితే త‌ల్లిదండ్రులు ఉద్యోగ‌రిత్యా హైద‌రాబాద్ వ‌చ్చేయ‌డంతో...ఇక్క‌డే స్థిర‌ప‌డ్డారు. నానికి ఒక అక్క పేరు దీప్తి. త‌ల్లి సెంట్ర‌ల్‌గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగం చేస్తున్నారు. వారి నాన్న‌గారు స్వ‌శ‌క్తితో పైకి వ‌చ్చి ఉద్యోగం చేసుకుంటున్నారు. నాని ముస్లింలో స్కూల్లో చ‌దివేవారు. దాంతో నాని బొట్టుపెట్టుకున్నా.. గుండు చేయించుకున్నా న‌వ్వేవారు. నాని స్వ‌త‌హాగా భ‌య‌స్తుడు కావ‌డంతో ఎవ్వ‌రినీ ఏమీ అనేవాడు కాదు. ఇంట‌ర్ బీటెక్ ఎస్సార్ న‌గ‌ర్‌లో ఉన్న నారాయ‌ణ కాలేజ్‌లో చదువుకున్నాడు. టీనేజ్‌లో నాని ఫ్రెండ్స్‌తో క‌లిసి ఆక‌తాయి త‌నంగాఉండేవాడు. వాళ్ళ అమ్మానాన్న‌ల‌కి నాని ఓ రోజు పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు. వారి పెళ్ళిరోజు గిఫ్ట్ ఇప్ప‌టికీ వారు మ‌రిచిపోలేదు. నాని ప్ర‌తి వారం స‌త్యం థియేట‌ర్‌లో వ‌చ్చే సినిమాల‌ను చూసేవాడు. సినిమాలు చూస్తున్న స‌మ‌యంలోనే త‌న‌కు సినిమాల్లోకి వెళ్ళాల‌న్న పిచ్చి పెరిగింది. దాంతో ఆయ‌న అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. రాధాగోపాలం సినిమాకి క్లాప్ అసిస్టెంట్‌గా అవ‌కాశం వ‌చ్చింది.  మొత్తానిక బాపు వంటి గొప్ప ద‌ర్శ‌కుల వ‌ద్ద ప‌నిచెయ్య‌డంతో గ‌ర్వంగా ఫీల‌య్యేవాడు. 

 

త‌ర్వాత కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌గ్గ‌ర చేశాడు. ఆ త‌ర్వాత హ‌స్తం సినిమాకి మెయిన్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా జాయిన్ అయ్యాడు. శ్రీ‌నువైట్ల ద‌గ్గ‌ర డి సినిమాకి జాయిన్ అయ్యాడు. ఆ త‌ర్వాత అల్లుఅర్జున్‌కి క‌థ చెప్ప‌గా త‌ను ఓకే మొత్తం స్టోరీ కంప్లీట్ చెయ్య‌మ‌న్నాడు.కానీ క‌థ ముందుకు సాగ‌లేదు. ఆ త‌ర్వాత రేడియో జాకీగా వ‌ర్క్ చేస్తున్నాడు. త‌న ఫ్రెండ్ నందిని రెడ్డి ర‌మ్య‌కృష్ణ‌తో టాక్ షో చెయ్యాల్సి ఉంది. నాని అందులో సింగిల్ టేక్‌లో అనుకోకుండా న‌టించాల్సి వ‌చ్చింది. దాంతో ఇంద్ర‌గంటి మోహ‌న్‌కృష్ణ‌గారు ఆ వీడియోని చూసి నందినిగారిని అడిగారు. అలా అనుకోకుండా నిధానం ప‌రిశ్ర‌మ‌ని ఒక్క‌సారిగాత‌న వైపు తిప్పుకున్నాడు నాని. 

 

ఇక భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీరప్రేమ గాథ, జెంటిల్ మేన్, మజ్ను, నేను లోకల్, నిన్ను కోరి, `ఎంసిఎ` లాంటి చిత్రాలతో వరుస హిట్లను సొంతం చేసుకున్నాడు. గత గత ఏడాది వచ్చిన జెర్సీ సినిమాతో నాని స్థాయి మరింతగా పెరిగింది. ఆ సినిమాలో నాని నటనకి ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు. నాని హీరోగానే కాకుండా నిర్మాతగా మారి అ! అనే చిత్రాన్ని నిర్మిస్తూ కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇప్పుడు అదే బాటలో `హిట్‌` అనే సినిమాని తెరకేక్కిస్తున్నాడు నాని.. ప్ర‌స్తుతం వి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది నానికి 25 వ చిత్రం కావడం విశేషం.. దీనికి కూడా తన మొదటి సినిమా దర్శకుడు krishna INDRAGANTI' target='_blank' title='ఇంద్రగంటి మోహనకృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తుండడం విశేషం.. అయితే ఇందులో నాని విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: