మొన్నటి వరకు అధికార దర్పం ప్రదర్శించిన తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు నిజంగా కష్టకాలమే ఎదురయింది. ఎప్పుడూ లేనంతగా పార్టీ నాయకులంతా భవిష్యత్తు పై ఆందోళనతో ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందిన ప్రభావానికి ఎన్నికలంటేనే భయపడే పరిస్థితి వచ్చేసింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకులు అందరిలోనూ ఒకటే ఉత్కంఠ నెలకొంది. అదే స్థానిక సంస్థల ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలనే టెన్షన్ పట్టుకుంది. అంతేకాకుండా ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా, జరగకపోయినా ఇప్పుడు ఖర్చు ఎవరు భరిస్తారు అనే ప్రశ్నలు నేరుగా అధినేత కే వేస్తున్నారు.

IHG


 ఇటీవల జరిగిన ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టిన ఎమ్మెల్యే అభ్యర్థులు చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతూ, తమ వ్యాపారాలను చూసుకుంటూ, పార్టీ వ్యవహారాలను అంతగా పట్టించుకోవడం మానేశారు. ఇప్పటి నుంచే పార్టీ వ్యవహారాల్లో తలదూర్చితే అనవసర ఖర్చు తప్ప ఫలితం ఉండదని, శాసనసభ ఎన్నికల సమయానికి మళ్ళీ యాక్టివ్ అయితే చాలు అన్నట్టుగా వారి వ్యవహార శైలి ఉంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా గట్టెక్కాలి అనే టెన్షన్ టిడిపిలో ఎక్కువైంది. అలాగే టిడిపి నేతలు కూడా పార్టీ అధిష్టానం తీరుపై సంతృప్తిగా లేరు. ఇక టిడిపి ప్రభుత్వ హయాంలో నాయకులు ఉపాధి హామీ పనుల కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. అయితే కొత్తగా ఏపీలో అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం ఆ బిల్లు మొత్తం నిలిపివేసింది. దీంతో లక్షలు, కోట్ల రూపాయల వరకు బిల్లులు పెండింగ్ లో పడడంతో అప్పుడు కాంట్రాక్టుకు తీసుకున్నవారు లబోదిబోమంటున్నారు.

IHG


 సరిగ్గా ఈ బాధలో ఉన్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆర్థిక సహాయం అందించాలని సమావేశాలు నిర్వహించి మరీ చెబుతుండడంతో వీరు ఇదో సున్నమా మాకు అంటూ నిట్టూరుస్తూ ఉన్నారు. అందుకే అంటీ ముట్టనట్టు గా పార్టీ వ్యవహారాల్లో ఉంటూ, ఖర్చును భరించేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీకి మరో టెన్షన్ పట్టుకుంది. ఓటమిని క్షేత్రస్థాయిలో నాయకులు ముందే ఒప్పేసుకుంటున్నారని, ఇలా అయితే ఎలా అంటూ అధినేత నియోజకవర్గ స్థాయి నేతలను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: