సాధారణంగా అధికారం ఎటువైపు ఉంటే నాయకులు అటువైపుగా మొగ్గు చూపిస్తూ ఉంటారు. అప్పటి వరకు తాము ఉన్న పార్టీలో ఎదురైన అవమానాలు, ఇబ్బందులు అన్నిటినీ ఒక్కసారిగా గుర్తుకు తెచ్చుకుని పార్టీ మారిపోతుంటారు. పనిలో పనిగా తమతో పాటు తమ అనుచరగణం మొత్తం తమ వెంట తీసుకుపోతున్నారు. అయితే ఇదంతా ఎన్నికల ఫలితాలు వెలువడిన మొదటి నెల, రెండు నెలల్లో చోటు చేసుకుంటాయి. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరుతుండటంతో తెలుగుదేశం పార్టీలో ఎక్కడలేని టెన్షన్ కనిపిస్తోంది. 

 

IHG


ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈ చేరికలు మొదలవ్వడం, మొదటి నుంచి టీడీపీని నమ్ముకుని ఉన్నవారు, తనకు అత్యంత సన్నిహితులైన వారు కావడంతో చంద్రబాబు కి తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. అసలు ఏ నాయకుడు ఎప్పుడు పార్టీ మారతాడో తెలియని పరిస్థితి నెలకొంది. మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందడాన్ని జీర్ణించుకోలేకపోతున్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఈ వలసలు మరింతగా కుంగదీస్తున్నాయి. అధికార పార్టీ వైసీపీ తన రాజకీయ ఎత్తుగడలతో టిడిపిలో ఉన్న కీలక నేతలను తమ వపు తిప్పుకోవడమే లక్ష్యంగా చేసుకుని కొద్దిరోజులుగా చేరికలపై ఎక్కువ దృష్టి పెట్టింది.

 

IHG

 

గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున విశాఖ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఈ నలుగురి పైన ఇప్పుడు వైసీపీ దృష్టి పెట్టింది. దీనిలో భాగంగానే మాజీ ఎమ్మెల్యే విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు ను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయించింది. ఆయన అతి త్వరలోనే వైసీపీ కండువా కప్పు కునేందుకు సిద్ధమవుతున్నాడు. 
.

IHG

అలాగే రెహమాన్, బాలరాజు, చింతలపూడి వెంకటరామయ్య తదితరులు ఇప్పటికే వైసిపి లో చేరిపోయారు. ఇక ప్రకాశం జిల్లాకు చెందిన కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. చంద్రబాబు మోసగాడు అంటూ ఈ సందర్భంగా కదిరి బాబురావు విమర్శలు కూడా చేశారు. ఇదే జిల్లాలో తెలుగుదేశం మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు కూడా వైసీపీ లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు ఇన్తో్ తో పాటు పెద్ద ఎత్తున నాయకులను కూడా వైసీపీీలోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అలాగే ఎమ్మెల్సీ పోతుల సునీత, మాజీ ఎమ్మెల్యే  కరణం బంగారం , కరణం వెంకటేష్ వంటి నాయకులు వైసీపీలో చేరారు. మరికొంతమంది చేరేందుకు సిద్ధమవుతున్నారు. 

 

IHG


ఇక కడప జిల్లాలో పులివెందుల సతీష్ రెడ్డి ,జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీని వీడారు. కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి రామసబ్బారెడ్డి,మైనార్టీ నాయకుడు సుభాన్ భాష తో తెలుగుదేశానికి రాజీనామా చేయించారు. ఇప్పటికే వైసిపి లో చేరిపోయారు. కర్నూలు జిల్లాలో కేఈ ప్రభాకర్ వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మున్సిపాలిటీ పరిధిలో ఆపరేషన్ ఆకర్ష చేపట్టి పెద్దఎత్తున టిడిపి నాయకులను చేర్చుకుని పనిలో ఉన్నారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిపినిపే విశ్వరూప్. ఈ మేరకు ఆయన టిడిపి నాయకులు ఇళ్లకు వెళ్లి మరి వారిని పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నారు. దీంతో అమలాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ సతీష్ తదితరులు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.

 

IHG


 అనంతపురం జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే వైసీపీ లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇలా చెప్పుకుంటూ వెళితే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే నాటికి వైసీపీలోకి టీడీపీ నాయకులు వలస వచ్చేలా  కనిపిస్తోంది.మొత్తం ఎన్నికల తంతు ముగిసే నాటికి తెలుగుదేశం పార్టీలో జిల్లాల వారీగా కీలక నాయకులు ఎవరూ లేకుండా చేయాలన్నదే జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది. దీని ద్వారా తెలుగుదేశం పార్టీ ని కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టాలని సీఎం జగన్ భావిస్తుండటంతో చంద్రబాబులో మరింత ఆందోళన పెరిగిపోతుంది.

 

IHG


 ఇప్పటికే పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో పార్టీకి చెందిన సీనియర్ నాయకులంతా పార్టీని వీడి వెళ్లిపోతుండడంతో టీడీపీ పార్టీ పరిస్థితి ఏమవుతుందో అన్న ఆందోళన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక వైసీపీ లో అయితే నాయకుల చేరికలతో సందడి వాతావరణం నెలకొంది. ఈ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపించబోతున్నట్టు అర్థమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: