కరోనా.. కరోనా అంటూ ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. ప్రపంచ దేశాలను ఈ కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. ఏ ప్రాంతాలకు వెళదామన్నా, వేరే ప్రాంతాల నుంచి  బంధువులు వచ్చినా ... భయంతో ఇప్పుడు జనాలు అల్లాడిపోతున్నారు. చైనాలో పుట్టి పెరిగిన ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది మరణించారు. లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నారు. కోట్లాది మంది భయంతో వణికి పోతున్నారు. ఇప్పటికే ఇండియాలో కరోనా మరణాలు సంభవించాయి. అన్ని రాష్ట్రాలకు ఈ కరోనా వైరస్ పాకింది.ఈ వైరస్ భయంతో చాలా చోట్ల, చాలా రాష్ట్రాల్లో  పాఠశాలలకు, ఆఫీసులకు సెలవు ప్రకటించారు.

 

IHG


 ఇక ఏపీలో అయితే స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు నెలలపాటు వాయిదా వేశారు. ఇదంతా కరోనా వైరస్ భయంతోనే. దీంతో అసలు కరోనా వైరస్ ఎలా పుట్టింది ? ఎందుకు పుట్టింది ? అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతోంది. వాస్తవంగా కరోనా వైరస్ చైనాలో పుట్టింది ప్రస్తుతం అక్కడ కరోనా మరణాలు తగ్గాయి. ఈ వ్యాధి నివారణకు చైనా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. కానీ మిగతా దేశాల్లో మాత్రం కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తోంది. 

IHG


కరోనా వైరస్ మిగతా దేశాల్లో విజృంభించడం,  చైనాలో తగ్గుముఖం పట్టడంతో ఈ వైరస్ కావాలనే చైనా  ప్రపంచ దేశాలకు విస్తరించేలా చేసిందనే వాదనలు బయలుదేరాయి. ఎప్పటి నుంచో చైనా తమ శత్రు దేశాల మీద బయో వార్ కు దిగాలని చూస్తోంది. ఈ క్రమంలోనే చైనా ఆయుధ కర్మాగారం ఉన్న వుహన్ నగరంలో ఈ కరోనా వైరస్ మొదటగా వ్యాప్తిచెందింది. అయితే ఇది చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న బయలజికల్ ల్యాబ్ నుంచి లీక్ అయినట్టుగా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. తమ శత్రు దేశాల మీద చైనా బయో వెపన్ ప్రయోగించాలని చూస్తోందని, అందుకే ఈ కారణంగా తమ శత్రు దేశాల మీద ప్రయోగించేందుకు రకరకాల వైరస్ లను అభివృద్ధి చేస్తుందనే వార్తలు బయటకు వచ్చాయి. దీంతో అసలు బయో వెపన్ అంటే ఏమిటి అనే చర్చ తెర మీదకు వచ్చింది. 

 

IHG


ఇజ్రాయిల్ కు చెందిన బయోలాజికల్ వార్ ఫర్ ఎక్స్పర్ట్ డేని సోహన్ చెప్పిన వివరాల ప్రకారం చైనాలోని వుహాన్ నగరం లో చైనా బయో వెపన్స్ తయారు చేస్తోందని, ఇక్కడే చైనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంస్థ ఉందని ఇక్కడ అనేక వైరస్ లకు సంబంధించి పరిశోధనలు జరుగుతూ ఉంటాయి  అని ఆయన ప్రకటించారు. సార్స్ వంటి ప్రమాదకర వైరస్ లను కూడా ఈ ల్యాబ్ లోనే భద్రపరిచారు. ఈ వైరాలజీ ల్యాబ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ కోసం పనిచేస్తూ ఉంటుంది. అయితే దీనిని చైనా ప్రభుత్వం తమ శత్రు దేశాల మీద ప్రతీకారం తీసుకునే దిశగా ఇక్కడ అనేక బయో వెపన్స్ తయారు చేస్తున్నట్లు చాలాకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

 

కరోనా వైరస్ ను శత్రు దేశాల మీద ప్రయోగించేందుకు చైనా అభివృద్ధి చేసిందని, అయితే అది పొరపాటున బయటకు వచ్చి చైనా  మీద కాటు వేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ సందర్భంగా బయో వెపన్ అంటే ఏమిటి అనే చర్చ మొదలైంది. బయో వెపన్ అంటే తమ శత్రు దేశాల మీద ప్రతీకారం తీర్చుకునేందుకు ఇలా ఒక వైరస్ ను అభివృద్ధి చేసి ఒక వ్యక్తిలో దానిని ప్రవేశపెట్టి వారిని తమ శత్రువు దేశంలోకి పంపించి అక్కడ ఆ వైరస్ వ్యాప్తి చేయడం ద్వారా... శత్రుదేశాల సామాజికంగా, ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా బయో వెపన్ ఉపయోగిస్తూ ఉంటారు. ఆ దిశగానే ఇప్పుడు చైనా బయో వెపన్ ఉపయోగించే దశలో భాగంగా ఇది ఆ లాబ్ నుంచి లీకయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


చైనా బయో వెపన్ తయారు చేస్తుందని చాలా కాలంగా ప్రపంచ దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు కరోనా వైరస్ రూపంలో అది బయటకు రావడంతో ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు చైనా పై ఆగ్రహంగా ఉన్నాయి . ప్రస్తుతం కరోనా వైరస్ చైనాలో తగ్గుముఖం పట్టడం, ప్రపంచ దేశాలలో విస్తరించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రపంచ దేశాలన్ని చైనా పై విమర్శలు చేస్తూనే, చైనాను దోషిగా అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: