ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా వైరస్ కు సంబందించిన వార్తలే. ఈ దేశం, ఆ దేశం అనే తేడా లేదు. ప్రతి దేశంలోనూ ఇదే పరిస్థితి. అసలు కరోనా ఈ రేంజ్ లో వ్యాప్తి చెందుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. అసలు ఈ రేంజ్ లో ప్రపంచాన్ని గడగడలాడించిన వ్యాధి ఇదేనేమో. ఇప్పడూ నలుగురు కలిసి వెళ్తుంటే వారిని నేరస్థులుగా చూస్తున్నారు. విదేశాల నుంచి ఎవరైనా వచ్చారో వారిని నేరస్థులుగానే చూస్తున్నారు. వారిని తీసుకెళ్లి క్వారంటైన్ సెంటర్స్ లో పడేస్తున్నారు. చుట్టాలు వస్తామంటే వద్దు వద్దు అంటూ మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు.

 

ఇంతగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పుట్టింది మాత్రం చైనాలో. అయితే చైనాలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేసింది. అక్కడ కరోనాను జయించేసింది ఆ దేశం. కరోనా గురించి ప్రపంచ దేశాలు వణికిపోతున్న అసలు వైరస్ పుట్టిన చైనా మాత్రం రిలాక్స్ అవుతోంది. అసలు కరోనా ను చైనా ఎలా జయించింది ..? ఇదే అందరికి తలెత్తుతున్న సందేహం. అవును కరొనను చైనా ఎలా ఇంత స్పీడ్ గా అదుపులోకి తెచ్చింది ? అంటే చాలా కఠినమైన నియమ నిబంధనలు పాటించడంతోనే చైనా కరోనాను అదుపులోకి తెచ్చింది. 

 

అసలు మూడున్నర నెలల క్రితమే చైనాలోని వుహాన్‌లో తొలి కరోనా పాజిటివ్ కేసును గుర్తించారు. అయితే మూడు రోజులుగా అసలు వుహాన్‌లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ మేరకు ఆ దేశం అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేసింది. శనివారం కొత్తగా 46 కేసులు నమోదయినట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. గత నాలుగు రోజులతో పోల్చి చూస్తే చైనాలో కేసులు సంఖ్య పెరిగినా, బాధితుల్లో విదేశాల నుంచి వచ్చినవారే ఎక్కువగా ఉన్నారు. కొత్తగా వైరస్ బారిన పడిన వారి సంఖ్య బాగా తగ్గినట్టుగా చైనా మూడు రోజులుగా విడుదల చేసిన నివేదిక లో తేల్చి చెప్పింది. శుక్రవారం మొత్తం 41  కేసులు నమోదు కాగా మొత్తం విదేశాల నుంచి వచ్చిన చైనా పౌరులే. 


వుహాన్‌లో ఎటువంటి కొత్త కేసులు నమోదు కాలేదని, ఇప్పటికే పాజిటివ్‌ ఉన్న వారిలో కూడా కొంత మంది పూర్తిగా కోలుకోవడంతో ఇంటికి వెళ్లిపోతున్నట్టు నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ప్రకటించింది. చైనా అత్యంత కఠినమైన నిర్ణయాలతో ప్రజల కదలికలను కట్టడి చేస్తూ హుబై ప్రావిన్స్‌లో ఆర్థిక కార్యకలాపాలన్నింటికి చెక్‌ పెట్టి చైనా పాలకులు ఇంతటి ఘన విజయాన్ని సాధించారు. ఉదాహరణకు, సామాజిక భద్రతా ఫీజులను, వినిమయ ఫీజులను రద్దు చేయడం, ఫిన్‌టెక్‌ సంస్థల ద్వారా వారికి రుణాలు అందించడం వంటి చర్యల ద్వారా...  చైనా ప్రభుత్వం పగడ్బంది చర్యలు తీసుకుంది. 

 

చైనాలో కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు మృతి చేయండిన వారి 3,270కు చేరిందని కమిషన్ పేర్కొంది. మొత్తం 81 వేల మందికి పైగా దీనిబారిన పడ్డారు. 72,703 మందికి నయం కాగా,  ప్రస్తుతం 6,013 మందికి చికిత్స కొనసాగుతోందని పేర్కొంది. చైనాలో కరోనా చికిత్సలు అందించిన హాస్పిటల్స్ ను ఇప్పడు మూసివేశారు. ఈ నెల 10న వూహాన్‌లో స్వయంగా పర్యటించిన అధ్యక్షుడు జిన్ పింగ్, వైరస్‌ను తాము పూర్తిగా జయించాము అంటూ ప్రకటించారు. ఆపై హుబేయ్, వూహాన్ ప్రాంతాల్లో ఆంక్షలను సడలించారు. ప్రస్తుతం అక్కడ యధావిధిగా రాకపోకలు జరుగుతున్నాయి. ప్రజలంతా యధావిధిగా పనులు చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. 


ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు చైనాను మరో భయం వెంటాడుతోంది. రెండోసారి కరోనా వ్యాప్తి చెందుతుందా అనేది అందిలోనూ సందేహాలను కలిగిస్తున్నాయి.అసలు ఈ అనుమానం రావడం వెనుక కారణాలు లేకపోలేదు. చైనాకు సరాసరిన రోజుకు 20 వేల మంది వివిధ దేశాల నుంచి వస్తుంటారు. ఇదే భయం కలిగిస్తోంది. బీజింగ్ సహా అన్ని విమానాశ్రయాలకు వస్తున్న అంతర్జాతీయ ప్రయాణికులంతా తప్పనిసరిగా 14 రోజుల క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాలన్న ఆదేశాలు జారీ చేసి, అందుకోసం కొన్ని హోటల్స్‌ను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చింది. కరోనా బాధితులు మూడు లక్షలు దాటిపోగా దాదాపు 171 దేశాలు భయాందోళనలో ఉన్నాయి. అయితే అందరికి వైరస్  అంటించిన చైనా మాత్రం రిలాక్స్ అయిపోయింది. దీనికి చైనా విధించిన కఠిన నిబంధనలే కారణం. ఇప్పడు మిగతా దేశాలు కూడా చైనా విధించిన కఠిన నిర్ణయాలనే ఫాలో అయిపోతున్నాయి. 

 

IHG


ఇక భారత్ లో ఈ వైరస్ వ్యాప్తి వేగంగానే ఉన్నా... అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నియమ నిబంధనలు తీసుకొచ్చి ప్రజలు ఎవరూ రోడ్ల మీదకు రాకుండా జాగ్రత్త పడుతోంది.అంతే కాదు రెండు రోజుల క్రితం జనతా కర్ఫ్యూ పేరుతో దేశవ్యాప్తంగా ప్రజలు ఎవరూ బయటకి రాకుండా కట్టడి చేసింది. అంతే కాదు ఈ నెలాఖరు వరకు నిర్బంధ కర్ఫ్యూ విధించారు. విదేశాల నుంచి ఎవరు ఇండియాలో అడుగుపెట్టినా వారిని క్వారంటైన్ సెంటర్స్ కి తరలిస్తున్నారు. ఇలా ఎన్నో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. విదేశాలతో పోల్చుకుంటే కరోనా వైరస్ వ్యాప్తి పెద్దగా లేదనే చెప్పాలి. అంతే కాదు ఏవైనా వైరస్ బారిన పడినా వారికి వ్యాధి నిర్ధారణ నాలుగు గంటల్లోగా చేస్తున్నారు. ఒకరకంగా చెప్పుకుంటే అమెరికాతో పోల్చుకుంటే ఇండియా లో వైద్య సదుపాయాలు, వ్యాధి నిర్దారణ కేంద్రాలు ఎక్కువగానే ఉన్నట్టుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: