ఈ ప్రపంచానికి ఏమైంది ? ఇప్పటికే కరోనా కరోనా అంటూ కలవరిస్తూ ప్రపంచమంతా వణికిపోతోంది. ఎక్కడ చూసిన కరోనా మాటలే తప్ప మరో మాట లేదు. అసలు ఈ ప్రపంచం ఎక్కడికి వెళ్లిపోతుందో తెలియడంలేదు. కలికాలం అని ఒకడు... ఆ వీర బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు కాలజ్ఞానంలో అంటూ మరొకరు. మన చుట్టూ ఎప్పుడో ఉండేవాడు కనిపించినా చూడనట్టు వెళ్ళిపోతున్నాం. ఆ మాయదారి కరోనా మనకెక్కడ వస్తుందో తెలియక చస్తున్నాం. అదిగో ఆ ఊరిలో ఫలానా వాడికి కారోనా వచ్చింది అంటే అయ్యో రామా అంటూ వణికి చస్తున్నాం. ఇప్పుడు దేశమంతా కర్ఫ్యూ పెట్టేసారు. ఎవడైనా రోడ్డు మీదకు వస్తే పోలీసులు లాటీలు పట్టుకుని చావగొడుతున్నారు. అసలు ఈ కరోనా ను అందరికి అంటించించ చైనా వాడి మీద పీకల్లోతు కోపం పెట్టేసుకుని, శాపనార్ధాలు పెట్టేస్తున్నారు. ఇది ఇలా ఉంటే మళ్ళీ చైనా లో మరో వైరస్ వచ్చింది అని చావు కబురు ఈ రోజు వచ్చింది.  ఆ వైరస్ గారి పేరు హంట.

 

IHG

 

 ఇదేంట్రా బాబు కరోనాతోనే చస్తున్నాం అంటే ఈ హంట పెంటా... ఏంట్రా బాబు అనుకోకండి. ఎందుకంటే ఇది చైనా కు కొత్తేమో కానీ మనకి కాదు. అబ్బే అలాంటిది ఏమి లేదు. అదంతా పుకారు అంటారా ? చెప్పింది ఎవడో కాదు ... చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ లో వచ్చిన వార్త. ఈ హంట వైరస్ కారణంగా ఇప్పటికే ఒకరు చనిపోగా... 32 మందిని పరీక్షిస్తున్నారు. వారిలో కొంతమందికి వచ్చిందనే వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో మరోసారి ఆ చైనా వాడి మీద అన్ని దేశాలు విరుచుకుపడుతున్నాయి.ఈ చైనా ఎప్పుడో ఇంతే పెంట పెంట చేస్తుంది అని హంట గురించి తిట్టుకుంటున్నారు.

 

IHG


ఈ వార్త తెలిసిన ప్రతి వాడు చైనా ను తిట్టిపోస్తున్నారు. అయితే ఇప్పుడు హంట వైరస్ చైనా కు కొత్తేమో కానీ మనకు మాత్రం పాతదే. ఎందుకంటే 2011 లో తెలంగాణలోని కరీంనగర్ లో ఓ కేసు బయటపడింది. అయితే ఇది కరోనాలా తుమ్ములు, దగ్గుల ద్వారా మనిషికి సోకదు. హంట వైరస్ వాహకం ఎలుక మలం, ఎలుకల మలం, మూత్రం, చొంగ, మనిషికి తాకినా, ఎలుక కోరినా, ఆ ఎలుకలోని వైరస్ సోకుతుంది. కరోనాలా నీరసం, జ్వరం, కండరాల నొప్పులు,శ్వాస ఇబ్బందులు ఇలా అన్నీ వచ్చేస్తాయి.

 

IHG


కరోనా వైరస్ సోకితే మరణాల శాతం తక్కువ. కానీ హంట వైరస్ మాత్రం వెరీ డేంజర్. అయితే ఎలుకలను నిర్మూలిస్తే ఈ వ్యాధిని అరికట్టే అవకాశం ఉంటుంది. దీనికి కమర్షియల్ మందులు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటి వల్ల పూర్తి స్థాయిలో ఈ వ్యాధి అదుపులోకి వస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేము. ఇంకా ఎన్నెన్ని వైరస్ లు మనం చూడాల్సి వస్తుందో... ఎటువంటి వైరస్ లు అయినా తట్టుకునేలా ఈ ప్రపంచం ఎప్పుడు మారుతుందో ఏంటో ..? 

మరింత సమాచారం తెలుసుకోండి: