అయ్యో నా ఆధునిక భారత దేశం ఇలా అయిపోయింటి ? ఏమిటి ఈ కరోనా కలకలకాలం ? కలికాలం కాపోతే ? ప్రపంచాన్నే ఇప్పుడు గడగడలాడిస్తున్న కరోనా బూచి జనాలను గుక్క తిప్పుకోకుండా చేసేస్తోందే ? అసలు ఇటువంటి పరిస్థితి వస్తుందని ఎవరైనా ఊహించగలిగారా ? లేదు కదా ? ఇప్పుడు గడప దాటాలంటే గజగజలాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విజలయతాండాన్ని ఆపేవారు ప్రస్తుతానికి ఎవరూ కనిపించడంలేదు. జనాలను రోడ్డు మీదకు రాకుండా కట్టడి చేయడమే పనిగా ఉంది. ఎప్పుడో 1975 లో అనుకుంటా ఈ పరిస్తితి, ఇలా వుంటుందని ,అసలు రాజ్యాంగంలో, ఇలాంటి నిబంధన ఒకటి ఉందని ఆనాటి తరానికి తెలియదు, తీవ్ర నిర్భంధంలోకి దేశాన్ని నెట్టేసింది. ఇందిరమ్మ ఎమర్జెన్సీ పేరుతో ఆనాటి సంగతుల్ని పుస్తకాలలో చదవటమేకాని, చవి చూసింది లేదు. 

 

IHG


ఇప్పుడు ప్రత్యక్షంగా కంటి ముందు ఆంక్షల కరోనా కనిపిస్తోంది. ఒక్క రోజు జనతా కర్ఫ్యూకే విలవిలలాడిన జనం ఆ ఒక్క రోజేగా అని దేశభక్తిని, చాటి ఛప్పట్లు కొట్టి మరి, సంఘీభావం తెలిపారు. కాని ఎవరూ ఉహించలేదు. పరిస్థితి విషమించుతోందని, కరోనా విజృంభిస్తుందని, ఆంక్షలు పొడిగిస్తారని, స్వేచ్చగా తిరిగిన ప్రాణాలు, యధేచ్చగా, విచ్చలవిడిగా సంచరించినా  మానవ గణాలు ఒక్కసారిగా అంక్షల సంకెళ్లతో బందీలయిపోయారు ఎటూ కాలు కదపలేని స్థితి. ఎవరిని కలవలేని పరిస్థితి. ఉన్నవాడు సరే, లేనివాడి పరిస్థితి ఉరే, ఏదో అరా కొరా ప్రభుత్వ సహాయం, ఆకలి మంటలు, అన్ని కాలాలు రుచి చూసిన మనిషికి, ఇది ఏదో కొత్తకాలంలా ఉంది. 

 

IHG


మూతికి గుడ్డ పిలికలతో, భయం, భయంతో మనుషులు ఏదో కొత్త గ్రహంలోకి నివాసానికి వచ్చిన ఏలియన్స్ లా జీవిస్తున్నారు. ఆలోచన మారింది. జీవన విధానంలో, కొత్త విధానం మొదలయ్యింది. జంక్ ఫుడ్ మాటమర్చిపోయారు. బిర్యానీలు, పలావులు లేవు. బేకరి ఫుడ్ జాడలేదు. మటన్,చికెన్,మాటలేదు,సంపాదన  అనేవేటలేదు. కలో,గెంజో త్రాగటం, ఓమూలన, ముసుగుతన్ని ఓమూలన పండటం, సరదాలు లేవు, సంతోషాలు లేవు. సాయంత్రమయితే ఓ పబ్బూలేదు, ఓపార్టీ లేదు. అంతా ఏదో నిరాశ నిండిన నైరాశ్యంలో, కరోనా అనే రక్కసి భుతానికి భయపడి క్షణ, క్షణం బ్రతుకీడుస్తుంది. నా వర్తమాన ఆధునిక భారతం.

మరింత సమాచారం తెలుసుకోండి: