ఎవడు ఎన్ని జాగ్రరత్తలు చెప్పినా ఈ ఎర్రి జనాలు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నతారు. ఒరేయ్ బాబు ఆ కరోనా వైరస్ కి మందు ఇంకా కనిపెట్టి సావాలేదు... కూసింత జాగ్రత్తగా ఎవడి కొంపలో వాడు ఉండండి... మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటామని గవర్మెంటోళ్లు నెత్తీ నోరూ బాదుకుంటూ ఊదరగొడుతున్నా ఎవడూ వినిసావడంలేదేంట్రా బాబు. ఆ కరోనా వైరస్ మామూలుది కాదురా బాబు. ఒకడికి అంటుకుంటే ఆడి నుంచి వందల మందికి, ఆ తరువాత వేలమందికి అలా దేశమంతా  అంటుకుంటుంది. అందుకే ఒకడికి దూరంగా మరొకరు ఉండేందుకు లాక్ డౌన్ అంటూ పెట్టేసి ఎవడి కొంపలో వాడు ఉండండ్రా బాబూ అంటే ఎగేసుకుంటూ రోడ్లమీదకు వచ్చేస్తున్నారు. 

 

IHG


మరి ఆ పోలీసు బాబాయిలు ఊరుకుంటారా ? ఊరుకోరు కదా బడిత పూజ చేస్తూ లాఠీలతో వాయించేస్తున్నారు. అయినా జనాలు మరరేంట్రా బాబు పోలీసులు కనిపిస్తే చాలు తుప్పలంటా.. సందులంటా.. పరుగులు పెట్టెయ్యడం బాగా అలవాటు చేసుకున్నారు. అంతేగాని అసలు గుంపులు గుంపులుగా ఎందుకు తిరగొద్దంటున్నారో ఒక్కడికీ ఇవరం లేదు కదా ! ఇప్పుడు ఆఫీసులు, షాపులు, సమస్తం బంద్ అయిపోవడంతో   పతివోడు ఖాళీగా ఉంటున్నాడు. చక్కగా కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేయకుండా సీక్రెట్ గా ఓ పది ఇరవైమంది ఒక చోట చేరి పేకాట వాడేస్తున్నారు. పార్టీలు చేసుకుంటున్నారు. ఎవరికంటా పడకుండా గుంపులుగా ఒకచోట చేరి పార్టీలు చేసుకుంటున్నారు.

 

IHG

 అసలు ఈ లాక్ డౌన్ మనకి సంబంధం లేదు అన్నట్టుగా ఎవరికి వారు ఎంజాయ్ చేస్తూ ఒక చోట చేరిపోతున్నారు. ఇదేదో జనాలను ఇబ్బంది పెట్టేందుకు  లాక్ డౌన్ చేసినట్టుగా కొంతమంది జనాలు బాధపడిపోతున్నారు. పోలీసులతో వాదనలకు దిగుతున్నారు. హీరోయిజం చూపిస్తూ ప్రభుత్వాలను, పోలీసులను తిట్టిపోస్తున్నారు. ఇక మందు బాబుల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మందు షాపులు మూసేసి ఉండడంతో కిక్కు లేక తిక్క తిక్కగా వాగేస్తున్నారు. ఓరి బాబు ఇప్పుడు ఇంతగా కట్టడి చేసింది నీ కోసం నా కోసేమే కాదురా నాయనా యావత్ ప్రపంచం కోసం అంటే ఎవడూ వినిపించుకోరేంట్రా ..? సరి సర్లే వాళ్లు ఎన్నెన్నో రూల్స్ పెట్టుకుంటారు ... మేము ఇలాగే ఉంటాం అంటారా మీ ఇష్టం రా బాబు... అందరం కలిసే నాశనం అయిపోవడానికి సిద్ధం అయిపోదాం ! 

మరింత సమాచారం తెలుసుకోండి: