కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో పెద్ద పెద్ద దేశాలైన అమెరికా, బ్రిటన్ వంటి పెద్ద పెద్ద దేశాలే చేతులెత్తేసిన పరిస్థితి. ఇప్పటికి ఓ పది దేశాల్లో అత్యంత తీవ్రంగా ఈ కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. కనీసం కరోనా టెస్ట్స్ చేసే కిట్స్ కూడా అందుబాటులో లేకపోవడం అమెరికా వంటి అగ్ర రాజ్యాల వెనుకబాటుతనాన్ని తెలియజేస్తోంది. ఇప్పటికే అక్కడ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. అమెరికాలో ఓ నాలు రాష్ట్రాల్లో తప్ప మిగతా అన్ని చోట్ల కరోనా విలయతాండవం చేస్తోంది. ఇక బ్రిటన్ సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కడ బ్రిటన్ ప్రధానితో సహా కీలకమైన పదవుల్లో ఉన్నవారంతా అక్కడ కరోనా బాధితులే. దాదాపు 190 దేశాల్లో కరోనా విలయతాండవం చేస్తున్నా ఇప్పటివరకు ఆ వైరస్ ను అంతమొందించే మందులు కనుక్కోలేకపోయారు. పక్క దేశాలతో యుద్ధం చేసేందుకు తహ తహలాడిపోయిన దేశాలన్నీ ఈ కరోనా విపత్తు కారణంగా దీనంగా పక్క దేశాల సహాయం కోసం ఎదురుచూపులు చూస్తున్నాయి. 

 

IHG

ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ తమ వైరాన్ని మర్చిపోయి ఒక దేశం మరో దేశం కరోనాను ఎదుర్కునే  విషయంలో కలసి ముందుకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాయి. అయితే ఇప్పుడు కరోనా విలయతాండవం చేస్తున్న దేశాలన్నిటిని పరిగణలోకి తీసుకుంటే ... వాటిని భారత దేశంతో పోల్చుకుని చూస్తే జనాభా పరంగా స్వల్పమే. అయినా కరోనా ను విస్తరించకుండా చేయడం లో మిగతా దేశాలతో పోల్చుకుని చూస్తే భారత దేశం సక్సెస్ అయినట్టుగానే చెప్పుకోవాలి. ఎందుకంటే కరోనా 130  కోట్ల జనాభా ఉన్న భారత దేశంలో విభిన్న మతాలు, విభిన్న కులాల వ్యక్తుల సర్వమత సమ్మేళనం. వ్యక్తి స్వేచ్ఛ కూడా ఎక్కువ.ఇటువంటి పరిస్థితుల్లో వీరందరిని క్రమశిక్షణలో పెట్టడం అంటే ఆషామాషీ విషయం కాదు. 

 

IHG

అసలు అది సాధ్యమయ్యే పని కాదు. ఇదే విషయాన్ని అందరూ అనుమానించారు. కానీ భారత్ లో కరోనా మిగతా దేశాలతో పోల్చి చూస్తే అదుపులోనే ఉందని చెప్పాలి. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రధాని సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలు చేశారు. ముందు ఒక్కరోజు అని ప్రకటించి ఆ తరువాత దానిని ఏప్రిల్ 14 వరకు పొడిగించారు. ఆ కీలక నిర్ణయమే ఇప్పుడు భారత్ కు రక్షణగా మారింది. ప్రజలంతా లాక్ డౌన్ విధించడం వెనుక పరిస్థితులను అర్ధం చేసుకున్నారు. ఇదే సమయంలో మోదీని బద్ద శత్రువులుగా చూసే కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆయన నిర్ణయాన్ని శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం కరోనా భారత్ లో రెండవ స్టేజ్ లో ఉంది. 

 

IHG

కరోనా కేసులు కొత్తగా నమోదు అవుతున్నా అది అంత ఆందోళనకర స్థాయిలో అయితే లేదు. మిగతా దేశాలతో పోల్చుకుంటే భారత్ ఈ వైరస్ మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కుంటోంది. కరోనా ను నిర్ధారించే కిట్ లు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. అలాగే వైరస్ సోకే ప్రమాదం ఉందని అనుమానం ఉన్న వారి కోసం క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటు, రాష్ట్రాల సరిహద్దులను పూర్తిగా మూసి వెయ్యడం, అదే సమయంలో ఎవరూ ఆకలి కేకలతో అలమటించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు సూచనలు, సలహాలు ఇస్తూ పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ప్రధాని మోదీ అందరితోనూ శభాష్ అనిపించుకుంటున్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్నీ భారత్ లో భారత్ పాటిస్తున్న చర్యలను మెచ్చుకుంటూనే తమ దేశాల్లో పాటించేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే కరోనా యుద్ధం లో ప్రధాని మోదీ వ్యవహరిస్తున్న తీరు ప్రశంసలు కురిపిస్తున్నాయి.

  

మరింత సమాచారం తెలుసుకోండి: