కేసీఆర్ నిజంగానే పోటుగాడు రో.. పోటుగాడే కాదు, మొండివాడు, గుండె ధైర్యం ఉన్నవాడు లేకపోతే ప్రత్యక రాష్ట్రం కావాలని పార్టీ పెట్టడమేంటి ...? దానికోసం పోరాడడం ఏంటి..? దాన్ని సాధించడం అసాధ్యం అని ఎంతమంది చెప్పినా అల్లరి చేసి, భయపెట్టి, బెదిరించి మొత్తానికి ఏదో ఒక రకంగా తెలంగాణ సాధించేసిన వీరుడు రో కేసీఆర్. సీఎంగా అధికారం చేపట్టిన తరువాత కేసీఆర్ ఆషామాషీ సీఎం అందరిలాగే వణికిపోయే రకం అనుకున్నా... కేసీఆర్ ఎంత మొండి రాజో కొద్ది ర్రోజుల్లోనే తెలిసేసుకున్నారు జనాలు. మొండి పట్టుదలే కాదు, జగమొండి నిర్ణయాలు తీసుకోవడంలోనూ కేసీఆర్ వ్యవహారం ఇలాగే ఉంటుంది. పోన్లే తెలంగాణ తెచ్చాడు కదా అని ఒకసారి జనాలు గెలిపించారు... రెండోసారి అంత సీన్ లేదు అని చాలామంది రాజకీయ పండితులు తేల్చేసినా ఓరి పిచ్చోళ్ళరా ఇక్కడ ఉంది ఎవరనుకున్నారు కేసీఆర్ అంటూ తనను ఓడించడానికి రాజకీయ ప్రత్యర్థులంతా కల్సి కట్టుగా ఏర్పాటు చేసుకున్న మహా కూటమిని కూడా కూకటి వేళ్లతో పీకి అవతలపడేసి రెండో సారి సింహాసనం సింహాసనం ఎక్కిసిన మహా ముదురు ఈ కేసీఆర్ దొర.

 

IHG

 

అంతెందుకు పార్టీలో ఈ దొర గారి మాట తప్ప ఇంకెవరైనా నోరెత్తితే వాళ్ళపని శంకరగిరి మాన్యాలే అయిపోతుంది. అందుకే ఎస్ బాస్ అనడం తప్ప ఒక్కరు కూడా నోరెత్తి మాట్లాడేందుకు సాహసం చేయలేకపోతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా కేసీఆర్ ఎంత మొండిగా ప్రవర్తించాడో ఎవరూ మర్చిపోరు. ఇదిగిదిగో కేసీఆర్ అనవసరంగా కార్మికులతో పెట్టుకున్నాడు, ఇక అతడిపని అయిపోయింది అనుకున్నారు. కానీ సమ్మెను ఆపేందుకు ఉద్యోగాల బర్తరఫ్ చేస్తామంటూ ప్రకటన చేసి సంచలనం సృష్టించడంతో పాటు అన్నట్టుగా ఆ నిర్ణయాన్ని అమలు చేయడంతో కుర్రో మొర్రో అంటూ అందరూ వచ్చి చేరిపోయేలా చేసేసిన ధీరుడు రో కేసీఆర్ దొర. 

 

ఇక కేసీఆర్ చెవిలో జోరీగలా ఆయన్ను ఎప్పుడూ తిట్టిపోసే కాంగ్రెస్ నాయకుడు రేవంత్ ను జైలుపాలు చేసేదాకా నిద్రపోని మొండివాడు. అసలు తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని నామరూపాల్లేకుండా చేయడం లో సక్సెస్ అయిపోయాడు. ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా వైరస్ విషయంలోనూ తెలంగాణాలో చేస్తున్న హడావుడి అంతా ఇంత కాదు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పట్లు చేసేస్తూనే ... రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చేసేసి నువ్వు దేవుడు సామి అనిపించేసుకున్నాడు. ఇక మీడియా విషయానికి వచ్చేసరికి ఎవరి దగ్గరైనా పప్పులు ఉడుకుతాయేమో కానీ నా దగ్గర కాదమ్మా అనేలా కేసీఆర్ మీడియాకు భయపడడం మానేసి తనను చూసే మీడియా భయపడాలే అన్నట్టుగా పూర్తిగా అదుపులో పెట్టేసుకున్నారు. 

 

అనవసరంగా తనను నిందించే కొన్ని కొన్ని మీడియా సంస్థలపై గట్టిగా తన ప్రభావం చూపించేయడంతో అంతా కేసీఆర్ కి సరెండర్ అయిపోయారు. అంతే కాదు, కేసీఆర్ మీడియా సమావేశంలో తిక్క తిక్క ప్రశ్నలు వేసి చికాకు పెట్టే జర్నలిస్టులకు గట్టిగానే వాతలు పెట్టి నోరు మూయించేస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే కేసీఆర్ ఒక ఎదురులేని నాయకుడుగానే చెప్పుకోవాలి. ఇక పార్టీ, ప్రభుత్వం, విషయానికి వస్తే ఇక్కడ కేసీఆర్ మాట తప్ప ఇంకెవ్వరి మాటా చెల్లుబాటు కాదు. ఆయన తీసుకుందే నిర్ణయం, ఆయన చేసిందే శిలా శాసనం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: