ఏదైనా అనుకోని సంఘటన కానీ ఏదైనా , అనుకోని విపత్తు కానీ ఎదురైనప్పుడు శవాల మీద పేలాలు  ఏరుకోవడానికి, దానిని ఏదో ఒకరకంగా క్యాష్ చేసుకోవడానికి చాలామంది తయారై పోతుంటారు. ఎవడు ఎలా పోతే మాకేంట్రా బాబు.. మా యాపారం బాగుంటే చాల్లే అన్నట్టుగా వింత వింత గా ప్రవర్తిస్తుంటారు. ఎవడి పైత్యం వారిదే. కానీ  మిగతా వొళ్ళు  ఎలా పోతే నాకేంటి అన్నట్టుగా ప్రవర్తించే వాళ్లకు కొదవేమీ లేదు. ప్రస్తుతం ప్రజలందరూ కరోనా భయంతో కొట్టుమిట్టడుతున్నారు. బయటకెళ్తే ఎవడి నుంచి వైరస్ అంటుకుంటుందో అన్న భయంతో ఎవరికివారు ఇళ్లలోనే ఉంటూ బోర్ కొట్టేసి ఏం చేయాలో తెలియక నలభీముడి అవతారం ఎత్తి తాము చేసే వంటలను, పిల్ల చేష్టలను సోషల్ మీడియాలో పెట్టుకుంటూ అల్లరి చేష్టలు చేస్తున్నారు. 

IHG


ఇక గొప్ప గొప్ప అలవాటు ఉన్న జనాల అయితే కొద్దిరోజులుగా మందు దొరక్క, కిక్కు లేక, షాపులు తీయకపోవడంతో అల్లాడిపోతున్నారు. మాకు కరోనా వస్తే రానివ్వండ్రా బాబు, కాస్త మందు గొంతులో పోసి పుణ్యం కట్టుకోండి రా నాయనా అంటూ వేడుకుంటున్నారు. మరికొంతమంది పేకాట రాయుళ్లు తమ ప్రావీణ్యం చూపించేందుకు అవకాశం లేక పిచ్చెక్కి పోతున్నారు. పోనీ ఇంట్లో వాళ్లకి పేకాట నేర్పి తమ టెన్షన్ తగ్గించుకుందామా అంటే...?  ఇంట్లో వాళ్ళతో ఆడితే మజా ఏమి రాదనే విషయం వారికి తెలుసు. ఇటువంటి పిచ్చిమారాజులను క్యాష్ చేసుకునేందుకు ఇప్పుడు ఆన్లైన్ రమ్మీ అంటూ పెద్ద ఎత్తున వాణిజ్య ప్రకటనలు సోషల్ మీడియా, వెబ్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చేస్తున్నాయి. బయటికెళ్ళి ఎవరు పడితే వాళ్లతో ఇష్టం వచ్చినట్లుగా పేకాట ఆడుతూ కరోనా డేంజర్ లో అంటించుకోకండ్రా... మీ ఇంట్లో కూకునే ఆన్లైన్ లో ఆడేసుకొంటుంటే మీకు ఎన్ని లాభాలో తెలుసా అంటూ సావదొబ్బుతున్నారు.

IHG

 బయటకెళ్ళి ఆడితే  ఆట ఆడే టప్పుడు ఎవడైనా తుమ్మినా, చేతులు మీద చేతులు మీద వేసినా, కరోనా భయం మీకు వెంటాడుతుంది కాబట్టి ఎందుకు వచ్చిన సొంత ఇంట్లోనే కూర్చుని ఆన్లైన్ లో సుబ్బరంగా పేకాట ఆడుకుంటే ఇంట్లోనే సక్కగా లక్షాధికారి, కోటీశ్వరుడు అయిపోతారు అంటూ ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తున్నారు. ఇక మీరు ఎలాగూ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి మా కంపెనీ తిండి తింటే మీకు కరోనాని ఎదుర్కునే బలం వస్తుందని, మీరు మరింత శక్తివంతమైన మనిషి అయిపోతారు, అప్పుడు కరోనా కి మీ దగ్గరకు వచ్చేందుకు కంగారుపడిపోద్ది అంటూ ఊదరగొడుతున్నారు. ఇంతేనా..? ఎవడికి వాడు కరోనా పేరు చెప్పి జనాల దగ్గర అయినకాడికి దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

 

 

 మందు అంటే కష్టం కానీ, పేకాట రాయుళ్ళ కి మాత్రం ఆన్లైన్ లో పేకాట  గొప్ప సదవకాశంగా కనిపిస్తోంది. ఇవేనా మా కంపెనీ ఓషధం తాగండ్రా నాయన మీకు కరోనా గిరోనా జాంతా నై అంటూ హడావుడి చేసేస్తున్నారు. ఇప్పుడు చెప్పినవన్నీ కొన్ని కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇంకా అనేక ప్రకటన ల ద్వారా జనాల దగ్గర నుంచి ఏదో ఒక రకంగా లబ్ధి పొందేందుకు ఆయా కంపెనీలు పడుతున్న ఆరాటం అంతా ఇంతా కాదు. సందట్లో సడేమియా అంటే ఇదేనేమో ..? 

మరింత సమాచారం తెలుసుకోండి: