టిడిపి అధినేత చంద్రబాబు వైకిరిలో మార్పు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో కంటే ఆయన చాలా భిన్నంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొంటోంది. దీని నుంచి బయటపడేసి పార్టీని ముందుకు నడిపించే క్రమంలో చంద్రబాబు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ఏపీ అధికార పార్టీగా ఉన్న టిడిపి, ప్రధాన రాజకీయ ప్రత్యర్థి వైసీపీ జోరు ఎక్కువగా  ఉండడంతో ఆ పార్టీలోకి తెలుగుదేశం పార్టీ నాయకుల వలసలు తీవ్ర తరం అయ్యాయి. తెలుగుదేశం పార్టీలో కీలక నాయకులు అనుకున్న వారంతా ఇప్పటికే వలసబాట పట్టారు. పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉన్నా, చంద్రబాబులో ఆందోళన ఎక్కడా పైకి కనిపించకుండా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు.

 

IHG's fall?

 

 వైసిపి హవాను అడ్డుకోవడంతో పాటు పార్టీ పరిస్థితిని మెరుగు పరచాలి అంటే కేంద్ర అధికార పార్టీ బిజెపి సహకారం ఉండి తీరాల్సిందే అన్న అంచనాకు వచ్చిన ఆయన చాలా రోజులుగా బీజేపీతో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే కేంద్రం తీసుకున్న నిర్ణయాలను సమర్థిస్తున్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. అవసరం ఉన్నా ,లేకపోయినా ప్రధాని మోదీ, అమిత్ షాలను అదేపనిగా పొగుడుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  నిర్వహించిన నేపథ్యంలో ప్రజలకు 1.70 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. అయితే ఈ ప్యాకేజీ మూడు నెలలకు ఏమాత్రం సరిపోదు. బిజెపి లో ఉన్న ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట కూడా ఇదే. ఇక బిజెపి వ్యతిరేక పార్టీలు కూడా కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై పెదవి విరుస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ విషయంలో వైసిపి కూడా సైలెంట్ గానే ఉంది. 

 


గతేడాది ఎన్నికలకు ముందు బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం కేంద్రాన్ని ప్రశంసిస్తున్నారు. బిజెపి రాష్ట్రాలపై మానవతా దృక్పథంతో ప్రత్యేక ప్యాకేజీ అందించిందని, ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అంటూ ప్రశంసిస్తూ ఉంది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు ఒక లేఖ కూడా రాశారు. దాంట్లో కేంద్ర నిర్ణయాలను, విధానాలను చంద్రబాబు అభినందించారు. వైద్య సిబ్బంది, రైతులు పేదల కోసం కేంద్రం 1.70 లక్షల కోట్ల అత్యవసర నిధిని ఏర్పాటు చేయడం అభినందనీయమని, కరోనా మహమ్మారిని అణిచివేసేందుకు నరేంద్ర మోదీ అమలుచేస్తున్న లాక్ డౌన్, జనతా కర్ఫ్యూ ఎంతో మేలు చేస్తుందని, అలాగే డాక్టర్లు, వైద్య సిబ్బంది కోసం 50 లక్షల ఇన్సూరెన్స్ చేయించడం అభినందించదగ్గ విషయం అంటూ చంద్రబాబు అదే పనిగా బీజేపీని పొగడ్తలతో ముంచెత్తారు. 

 

IHG': Naidu's MLAs, MLCs vote for exit, say ...


అలాగే పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ లు, పేద మహిళలకు ఆర్ధిక ప్యాకేజ్ ప్రకటించడం వంటి  నిర్ణయాలను చంద్రబాబు ప్రశంసించారు. మీ ప్రభుత్వం మానవత్వం గల ప్రభుత్వం అనడంలో ఎటువంటి సందేహం లేదు అంటూ బిజెపి ప్రభుత్వాన్ని చంద్రబాబు అభినందించారు. అయితే బీజేపీని పనిగట్టుకుని ఈ విధంగా పొగడడం పై టీడీపీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు ఎప్పుడూ ఇంతేనని, అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అన్నట్టుగా వ్యవహరిస్తుంటారని ఆ పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి. చంద్రబాబు వైకిరి చూస్తుంటే కరోనా హడావుడి ముగియగానే బీజేపీ తో పొత్తు పెట్టుకునే అవకాశం లేకపోలేదు అనే వాదనలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు మనిషిగా గుర్తింపు పొందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ తో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో చంద్రబాబు కూడా ఆ విధంగా ప్రయత్నాలు చేసి వచ్చే ఎన్నికలనాటికి బీజేపీ పొత్తుతో ఏపీలో చక్రం తిప్పాలని చూస్తున్నట్టుగా కనిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: