కరోనా వచ్చిన వారి కంటే ఆ వైరస్ తమకు వస్తుందన్న భయం, ఆందోళన చెందుతున్న జనాలే ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ ప్రభావం ఎంత స్పీడ్ గా   ప్రభావం చూపిస్తుందో, అంతకంటే వేగంగా ఈ వైరస్  సంబంధించిన అసత్య వార్తలు ఎక్కువగా గా ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. అసలే కరోనా కంగారులో ఉన్న జనాలను మరింత కంగారు పెట్టేలా ఈ ఫేక్ న్యూస్ లు వైరల్ అవుతున్నాయి. జనాలంతా ఇంటిపట్టునే ఉండడంతో సోషల్ మీడియాలో ఎక్కువగా కాలం గడుపుతున్నారు. దీంతో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు తమ అరకొర జ్ఞానంతో కరోనా వైరస్ కు సంబంధించి అందర్నీ భయపెట్టే విధంగా ఇష్టమొచ్చినట్లుగా పోస్ట్లు పెడుతున్నారు. అక్కడ, ఇక్కడ అనే తేడా ఏమీ లేదు, ప్రపంచవ్యాప్తంగా ఈ ఫేక్ న్యూస్ లు బాగా వైరల్ అవుతున్నాయి. దీంతో ఏది నిజమో, ఏది అబద్దమో తెలియక జనాలు కంగారు పడిపోతున్నారు. 


సోషల్ మీడియాలో దీనికి సంబంధించి వస్తున్న వార్తల్లో 90 శాతం పైగా కట్టు కథలు ఉంటున్నాయి. ఆవు మూత్రం దగ్గర నుంచి అల్లం పేస్ట్ వరకు కరొనను అడ్డుకునే మార్గాలు ఇవే అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక హాలీవుడ్ సినిమాల్లో కొన్ని సీన్లను తీసుకుని మనుషుల్ని సామూహికంగా ఖననం చేసే దృశ్యాలను సోషల్ మీడియాలో పెట్టి కరోనా వైరస్ బారిన పడిన దేశాలకు చెందిన ప్రజలను ఇలా చేస్తున్నారు అంటూ హడావిడి చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా సెలెబ్రెటీలను కూడా ఇందులోకి  లాగేస్తున్నారు. ఫలానా హీరో అన్ని కోట్లు కరోనా ను అరికట్టేందుకు సహాయం చేసారని, ఫలానా వ్యక్తి  వందల కోట్లు దానం చేశాడు అని, ఇటలీలో గుట్టలు గుట్టలుగా శవాలు రోడ్లపై పడి ఉన్నాయని, వాటిని తీసే వారు కూడా లేరని పోస్టింగ్స్ పెడుతున్నారు.

 

IHG


 రష్యాలో సింహాలను వీధుల్లోకి వదిలి జనాలు రోడ్ల పైకి రాకుండా చేశారని, స్పెయిన్ లో కరోనా మృతులను గుట్టలుగా పోసి తగలబెడుతున్నారని, హాలీవుడ్ సినిమాలోని వీడియో క్లిప్ లను తీసుకువచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా రకరకాల అసత్య కథనాలను వైరల్ చేస్తూ, ఫెకర్లు ఆనందం పొందుతున్నారు. అపోలో హాస్పిటల్ డాక్టర్- రిపోర్టర్ కు మధ్య జరిగిన సంభాషణ ఇదేనని, జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడిన ఆడియో ఇలా ఎన్నో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ ఫేక్ న్యూస్ కారణంగా జనాల్లో టెన్షన్ పెరిగిపోతుండడంతో ప్రభుత్వాలు కూడా ఈ ఫేక్ న్యూస్ ను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. 

 

IHG

తెలంగాణలో ఈ విధమైన ప్రచారం ఎక్కువగా జరుగుతుండడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఘాటుగానే స్పందించారు. ఇటువంటి ప్రచారం చేసే వారిని ఎంత భయంకరంగా శిక్షిస్తానో మీరే చూస్తారు అంటూ గట్టిగా హెచ్చరికలు చేశారు. అయినా సోషల్ మీడియాలో ఇటువంటి ప్రచారాలు ఇంకా పెద్ద ఎత్తున వస్తూనే ఉన్నాయి... జనాలను భయపెడుతూనే ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: