ఈ క్ర‌తువు ఒక‌రి సంక‌ల్పం
ఈ క్ర‌తువు  ఎంద‌రి ఆక‌లికో ప‌రిష్కారం
ఈ క్ర‌తువు మెతుకు త‌త్వం బోధించే గొప్ప మార్గం
మీరు అన్నం పెట్టండి చాలు ప్లీజ్ అన్నాన్నేను
ఈ క్ర‌తువుతో కొద్దిపాటి ఆర్థిక వ‌నరుల‌తో ఆయ‌న‌తో నేను
నాతో పాటు ఇంకొంద‌రు వారందరికీ ప్రేమ పూర్వక కృత‌జ్ఞ‌త
నాతో పాటు ఇంకొంద‌రు వారందరికీ ప్రేమ పూర్వ‌క ధ‌న్య‌వాద‌
యువ పార్ల‌మెంట్ స‌భ్యులు కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు చేప‌ట్టిన అన్న‌దాన క్ర‌తువుకు నేటితో ఎనిమిది రోజులు.

 

ఇప్పుడు ఉద‌యం 11 గంట‌ల 30 నిమిషాల స‌మ‌యం
ఒక వ్యాన్ వ‌చ్చి ఆగుతుంది.. న‌లుగురు కుర్రాళ్లొచ్చి
భోజ‌నం ప్యాకెట్లు ప‌ట్టుకు వెళ్తారు
ఆ న‌లుగురూ రెడ్ క్రాస్ కుర్రోళ్ల‌కూ
క్షేత్ర స్థాయి స‌మ‌న్వ‌య బాధ్య‌త‌లు అప్ప‌గించారు యువ ఎంపీ
వీరిని ప‌ర్య‌వేక్షించేది పోలుమ‌హంతి జ‌గ‌న్మోహ‌న‌రావు పోలుమ‌హంతి శ్రీ‌కాంత్
వీరు రెడ్ క్రాస్ సంస్థ నిర్వాహ‌కులు
వాహనం నేరుగా రిమ్స్ కు పోతోంది
బండి చాలా వేగంగా పోతోంది దార్లో కొంద‌రి నిరాశ్ర‌యులు
ఆశయం ఒక్క‌టి చాలు అంటే కాదు చాల‌దు ఆచ‌ర‌ణ కావాలి అంటే
ఒక్క‌సారి రామ‌సేన కార్య‌క‌ర్త‌లంతా గుర్తుకువ‌స్తారు

 

అన్నా ఈ రోజు భోజ‌నం చాల్లేదు ..లేదా ఇంకొంచెం పెంచండి.. లేదు త‌ప్ప‌కుండా ఎన్ని కావాలంటే అన్ని ప్యాకెట్ల నిర్వ‌హ‌ణ‌కు మేం సిద్ధం అంటారు మెండ ల‌చ్చ‌న్న ..ప్ర‌జాస‌ద‌న్ నిర్వాహ‌కులు.. వారితో పాటు ఉద‌యం ఏడింటికే చేరుకునే మ‌రో మంచి మిత్రులు
మెండ దాస‌న్న.. మీరు ఏం చేయమంటే అదే.. హాయిగా ఇక్క‌డి నుంచి నాణ్య‌మ‌యిన భోజనం అందిస్తాను.. అవ‌స‌ర‌మ‌యిన మేర అవ‌స‌ర‌మ‌యిన  వారికి అందితే చాలు..మీరు ఆందోళ‌న చెంద‌న‌వ‌స‌రం లేదు.. అంటారాయ‌న‌.. న‌వ్వుతూ..
అన్న‌య్యా వ‌చ్చారా.. రండి
ఇంకేమ‌యినా ఇబ్బందులున్నాయా
చెప్పండి అంటారాయ‌న‌
ఈ సారి ఇంకా ఆనందంగా ఉన్నాను
ఉద‌యం కాదు స‌ర్ రెండో పూట కూడా ఏద‌యినా అల్పాహారం త‌యారు చేయించి
పంప‌మ‌న్నారు స‌ర్.. అంటూ చెబుతున్నారు  మ‌రో మిత్రులు కెల్ల కిశోర్
ఇంకా మెట్ట నాగ‌రాజు అన్న‌య్య‌..వీళ్లంతా. ఈ క్ర‌తువు సార‌థులు

 


బాధ్య‌త అంటే ఏంటి?
మ‌త్స్య‌కారులు ఇరుక్కుపోతే స్పందించ‌డం
మ‌హారాష్ట్ర పెద్ద‌ల‌తో మాట్లాడ‌డం
బాధ్య‌త అంటే ఏంటి
ఈ ఊరి బిడ్డ  ఎక్క‌డ చిక్కుకుపోయినా
స్పందించ‌డం ఎక్క‌డ తిండికి లేక‌పోయినా త‌ల్ల‌డిల్లడం
ఇవి క‌దా! కావాలి.,. ఇప్పుడు మ‌రో నిరంత‌ర కార్య‌క్ర‌మానికి
ఆయ‌న సార‌థి కావ‌డం ఎంతో సంతోషంగా ఉంది
ఇంకా ఇంకొందరు బాధ్య‌త‌గా వ‌స్తారు.. బాధ్య‌త‌లు పంచుకుని హాయిగా ఇంటికి నవ్వుతూ వెళ్తారు
ఇలాంటి వారు ఇంకొంద‌రు కావాలి రామూ స‌ర్.. బాధ్య‌త అంటే ఇలా ఉండాలి అని అనిపించేలా!
చెప్పాను క‌దా! నేను మీ వెంటే.. నాతో పాటూ నా బృందం అంతా!

 

ఇదొక్క‌టే కాదు
స‌ర్ ప‌బ్లిక్ టాయిలెట్ లు లేవు
స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ సెంట‌ర్లు లేవు
మీరే ఏదో ఒక‌టి చేయాలి
లేదు ప‌బ్లిక్ టాయిలెట్ విష‌య‌మై జీఎంఆర్ సంస్థ అధిప‌తితో మాట్లాడి ఒప్పిస్తాను
స్కిల్  డెవ‌ల‌ప్మెంట్ సెంట‌ర్ కోసం ఏద‌యినా చేద్దాం..
ఈ ప్ర‌జ‌ల కోసం ఈ వెనుక‌బాటు తొల‌గిపోవ‌డం కోసం ఈ శ్రీ‌కాకుళం యూత్ ఫోర్స్ తో మీరు ప‌నిచేయాలి
త‌ప్ప‌కుండా.. మిమ్మ‌ల్ని క‌లిసేందుకు మీతో ప‌నిచేసేందుకు ఇంకొంద‌రు త‌మ్ముళ్లు ప్రాంతాల‌క‌తీతంగా సిద్ధం అని చెప్పాను..
ఎంపీ రామూతో.. ఆనందించారు వారు..

 

ఇంకాస్త విస్తృతిలో ఈ భ‌వానీ ఛారిట‌బుల్ ట్రస్ట్.. ఇంకాస్త  ఉద్ధృతితో  భ‌వానీ ఛారిట‌బుల్
ట్ర‌స్ట్ .. అవును! అక్క‌డ గోదావ‌రి తీరం చెంత అక్క భ‌వానీ కూడా కొన్ని కార్య‌క్ర‌మాల‌కు రూప‌క‌ల్ప‌న చేసి ఈ విపత్తు కాలాన‌
సాయం చేస్తున్నారు అభాగ్యుల‌కు.. ఆనందించేను నేను.. అక్క రాజ‌మండ్రి న‌గ‌ర ఎమ్మెల్యే.. పూర్తి పేరు ఆదిరెడ్డి భ‌వానీ అక్క‌
నాయుడు గారు పిల్ల‌లు
చాలా బాగా ప‌నిచేస్తున్నారు
అని ఒక‌రు అన్నారు
అన్నా ! రామూ స‌ర్ తో మాట్లాడించ‌గ‌ల‌రా అంటూ
తెలంగాణ త‌మ్ముడు అడిగారు నాతో
ఇక క‌విత‌క్క అయితే ఆయ‌నను ఎంత‌గా అభినందిస్తారో
ఇవి క‌దా కావాలి ప్రాంతాల‌క‌తీతంగా ఒక విస్తృతిలో ఈ నాయ‌కులు
జ‌వాబుదారీత‌నంతో ఈ నాయ‌కులు ఉండాల‌ని ఉంటార‌ని కోరుకుంటూ..
రామ‌న్న అన్న‌దాన క్ర‌తువుకు ఓ ధ‌న్య‌వాద ఓ కృత‌జ్ఞ‌త

 

- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

మరింత సమాచారం తెలుసుకోండి: