తెలుగునాట డిజిట‌ల్ మీడియాపై ప్రింట్ మీడియా విషం చిమ్ముతోంది. త‌న‌కు ఆద‌ర‌ణ ద‌క్క‌డం లేద‌న్న అసూయ, ద్వేషం, ఈర్శ‌ల‌తో డిజిట‌ల్ మీడియాకు వ్య‌తిరేకంగా పుంకానుపుంఖాలుగా క‌థ‌నాల‌ను రాసేస్తోంది. డిజిట‌ల్ మీడియాను కూడా సోష‌ల్ మీడియాలో విలీనం చేసేసి మ‌రీ త‌న పాతివ్ర‌త్యాన్ని చాటుకునేందుకు తెగ ఆరాట‌ప‌డిపోతోంది. సోష‌ల్ మీడియాకు డిజిట‌ల్ మీడియాకు కూడా హ‌ద్దులు చెరిపేసి..మ‌రి క‌థ‌నాలు రాయ‌డం గ‌మ‌నార్హం. ఉరుములేని పిడుగులా వ‌చ్చి ప‌డినా క‌రోనా సంక్షోభంతో ప‌త్రికాధిపతులు ఉక్కిరిబిక్కిర‌వుతున్నారు. ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌వుతున్నారు. 

 

త‌మ కాళ్ల కింద భూమి క‌దిలుతున్న భావ‌న...త‌మ జ‌ర్న‌లిజం ఆధిప‌త్యానికి కంటికి క‌నిపించ‌ని శ‌త్రువు దెబ్బ‌కొడితే..డిజిట‌ల్ మీడియా త‌మ  స్థానాన్ని ఆక్ర‌మించుకుంటోంద‌న్న‌ భ‌యం వారిలో ప్ర‌స్పుటంగా క‌నిపిస్తోంది. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో తాము నిల‌దొక్కుకోవాలంటే డిజిట‌ల్ మీడియాపై బుర‌ద జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  అందుకే డిజిట‌ల్ మీడియాపై ప‌నిగ‌ట్టుకుని మ‌రి విషం కక్కుతున్నారు. క‌రోనా..లాక్‌డౌన్ ప్ర‌భావంతో వార్త‌ప‌త్రిక‌లు స్వ‌త‌హాగా చ‌ద‌వ‌డానికి భ‌య‌ప‌డి వ‌ద్ద‌నుకున్న‌వారు కొంద‌రైతే...ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో పేప‌ర్‌ను బ‌య‌ట‌కు తీసుకురాలేక‌..తెచ్చిన అమ్ముకోవ‌డం క‌ష్ట‌మైపోయిన ద‌రిమిలా ప‌త్రిక‌లు అన్నీ మూసుకున్నాయి. 

 

తిమ్మిని బొమ్మి..బొమ్మిని చేసి తిమ్మిగా చేసి చూపిస్తూ రాజకీయ పార్టీల‌కు క‌ర‌ప‌త్రాల్లా మారిన కొన్ని ప‌త్రిక‌లు..డిజిట‌ల్ మీడియాలోని వార్త‌ల‌ను స‌మీక్షించ‌డం అంటే గురివింద గింజ త‌న కింద ఉన్న న‌లుపును మ‌రిచిన‌ట్లే అవుతుంది. ఎదుటివాళ్ల‌ను వేలెత్తిచూపే ముందు త‌మ త‌ప్పులెన్ని ఉన్నాయో..ప‌త్రిక‌లు, వాటి యాజ‌మాన్యాలు కాస్త గుర్తు చేసుకోవాల‌ని పాఠ‌కులే గుర్తు చేస్తున్నారు. అయినా పాఠ‌కులు, నెటిజ‌న్లు అన్నీ గ‌మ‌నిస్తున్నారు.. చెబుతున్న‌ది మంచివాడో..చెడ్డ‌వాడో తెలుసుకోలేక‌పోవ‌డానికి పాఠ‌కులైనా, ప్ర‌జ‌లైనా వెనక‌టి రోజుల‌కు మ‌ల్లే నోట్లో వేలేసుకునేం లేర‌న్న విష‌యం ప‌త్రికాధిప‌తులే గ్ర‌హించాల‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు గుర్తుచేస్తున్నారు. 

 

ఎవ‌రేం మొత్తుకున్నా..గ‌గ్గోలు పెట్టినా..ఈర్శ‌,అసూయ‌,ద్వేషాలు ప్ర‌ద‌ర్శించినా డిజిట‌ల్ మీడియా టైం వ‌చ్చేసింది. కొంత‌మంది సిండికేటు జ‌ర్న‌లిజానికి బీట‌లు వారిన‌ట్లే. నిఖార్స‌యిన వార్త‌ల‌కు..నిజ‌మైన జ‌ర్న‌లిస్టుల‌కు వేదిక‌లు ఖ‌రారైన‌ట్లే...తెలుగు జ‌ర్న‌లిజాన్ని గుప్పిట ప‌ట్టి రాజ‌కీయాలు చేయాల‌నుకుంటున్న వారి ఆట‌లు ఇక‌పై సాగ‌వ‌ని చెప్పే రోజులు..నిరూపించే కాలం తొంద‌ర‌లోనే ఉంద‌ని కొంత‌మంది సీనియ‌ర్  జ‌ర్న‌లిస్టులు కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: