తెలంగాణ‌లో ఇప్ప‌టికే క‌రోనా విష‌యంలో అభూత క‌ల్ప‌న‌లు.. అపోహ‌లు గాలికి పోగేసి రాస్తోన్న ఓ ప్ర‌ధాన దిన‌ప‌త్రిక‌కు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల్లోనూ.. ప్ర‌తి ఒక్క‌రిలోనూ ధైర్యాన్ని క‌ల్పించే రాత‌లు రాయాల‌ని అయితే కొంద‌రు దిన‌ప‌త్రిక‌ల విలేక‌ర్లు... కొన్ని మీడియా సంస్థ‌లు ఏకంగా మకిలి రాత‌లు రాస్తున్నార‌ని.. ఈ మ‌కిలీ రాత‌ల‌ను రాసేవారికి క‌రోనా సోకాల‌ని కూడా కేసీఆర్ శాపం పెట్టారు. దీనికి తోడు ఇక్క‌డ కేసీఆర్ వార్నింగ్ ఇస్తున్నారు.. ఈ వార్నింగ్‌తో భ‌విష్య‌త్తులో వాళ్ల అంతు చూస్తాన‌ని కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

 

ఇక దేశంలోనే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగానే తెలంగాణ ప్ర‌భుత్వం క‌రోనాపై పైట్ చేసే విష‌యంలో ఎంతో ప‌గ‌డ్బందీగా ప‌ని చేస్తోంద‌ని.. లాక్ డౌన్ విష‌యంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటోంద‌ని మెచ్చుకుంటున్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ సైతం ఈ విష‌యంలో కేసీఆర్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. కేసీఆర్ ఎప్ప‌టిక‌ప్పుడు ప్రెస్‌మీట్లు పెడుతూ ప్ర‌జ‌ల‌ను అలెర్ట్ చేస్తున్నారు. అయినా కేసీఆర్‌పై ఎప్ప‌టిక‌ప్పుడు విషం చిమ్మే ఓ ప‌త్రిక మాత్రం ఏ చిన్న లోపం క‌నిపించినా దానిని భూత‌ద్దంలో పెట్టి చూపిస్తోంది.

 

ఇక తెలంగాణ‌లో వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ సైతం ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉంటున్నారు. అయితే ఎక్క‌డో ఒక‌టి రెండు చోట్ల మాత్రం చిన్న చిన్న లోపాలు ఉండ‌డంతో జూడాలు కాస్త అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. దీనిని స‌ద‌రు మీడియా భూత‌ద్దంలో పెట్టి చూపిస్తోంది. జుడాల సంఘంలో ఒక‌రిద్ద‌రు ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో డాక్ట‌ర్ల‌ను కాపాడుకోవాలంటే డాక్ట‌ర్ల‌కు వెంట‌నే ర‌క్ష‌ణ ప‌రికరాలు భారీగా కావాల‌ని ఇందుకు ప్ర‌జ‌ల నుంచి విరాళాలు సేక‌రిస్తున్నామంటూ ప్ర‌క‌ట‌న‌లు జారీ చేశారు.

 

దీనిని స‌ద‌రు మీడియా సంస్థ టీవీల్లో బ్రేకింగులు వేస్తూ జుడాల అభిప్రాయాల‌ను ఫోన్లో వివ‌ర‌ణ తీసుకుంటూ నానా హ‌డావిడి చేస్తూ ప్ర‌భుత్వంపై బుర‌ద జ‌ల్లేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. క‌రోనా ర‌క్ష‌ణ ప‌రిక‌రాలు కావాలంటూ జుడాల విరాళాలు సేక‌రించే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని ప్ర‌చారం చేస్తోంది. ఈ ప్ర‌చారంపై ప్ర‌జ‌ల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. లేనిపోని అపోహ‌లు క‌ల్పించ‌డం మంచిది కాద‌ని ప్ర‌తి ఒక్క‌రు సూచిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: