రాజకీయం అంటే అన్నీ రాజకీయాలే ఉంటాయి. అందులో ఏ సందేహం లేదు. అధికార పార్టీ మీద ప్రతిపక్షాలు, ప్రతిపక్ష పార్టీపై అధికార పార్టీ ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఒకరి తప్పులను ఎత్తిచూపుతూ రాజకీయంగా పైచేయి సాధించేందుకు నిరంతరం జరిగే యుద్ధమే ప్రస్తుత రాజకీయాలకు పరమార్ధం. ప్రజలకు మనం ఏం చేశామన్నది కాకుండా మనకు ప్రజలు ఏం చేశారు అన్నట్టుగా ప్రస్తుత రాజకీయాలు తయారయ్యాయి. అయితే ఇందులో మొత్తం రాజకీయ నాయకులందరినీ తప్పు పట్టడానికి లేకపోయినా ఎక్కువ మంది మాత్రం ఈ విధంగానే వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రపంచమంతా ఈ వైరస్ ప్రభావానికి అల్లాడుతోంది. ఈ వైరస్ కారణంగా మరణించిన వారు ప్రపంచ వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నారు. అసలు ఈ పెను విపత్తు ప్రపంచ మానవాళి మనుగడకే సరికొత్త సవాల్ విసిరే విధంగా తయారయింది. ఇప్పటి వరకు దీనికి మందుని కనిపెట్టకపోవడంతో సామాజిక దూరం పాటించడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. ప్రపంచమంతా దీనినే ఫాలో అవుతోంది. 

 

IHG


మిగతా దేశాలు, రాష్ట్రాల సంగతి పక్కన పెడితే ఏపీలో మాత్రం ఈ వైరస్ పేరు చెప్పి ముసుగు రాజకీయాలు మాత్రం తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏదో ఒక రకంగా కరోనా వైరస్ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే విధంగా టిడిపి అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేయడం, ప్రజలకు, ప్రభుత్వాలకు, రాజకీయాలకు అతీతంగా మద్దతు పలకాల్సిన ఆయన కరోనా సమయంలోనూ ఈ విధంగా ముసుగు రాజకీయాలకు పాల్పడుతూ... తన నలభై ఏళ్ల రాజకీయ అనుభవానికి అర్థం లేకుండా చేసుకుంటున్నారనే  విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ  పరిస్థితి ఏపీలో అంతంతమాత్రంగానే ఉంది. అలాగే ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందనే ఆశ చంద్రబాబుకు సైతం లేదు. అలాగే తెలుగుదేశం పార్టీ రాజకీయ వారసుడిగా కీర్తించబడుతున్న లోకేష్ కు టిడిపిని నడిపించే అంత శక్తి సామర్థ్యాలు కూడా లేవు. ఈ విషయం చంద్రబాబు సైతం బాగా తెలుసు. అయినా తెలుగుదేశం పార్టీకి మైలేజ్ వచ్చేలా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండడం, కరోనా సమయంలోనూ చంద్రబాబు రాజకీయాలకు పాల్పడుతున్న తీరు బాధాకరమే. 

 

ఒకవైపు ప్రజలు తమ ఆరోగ్యం గురించి, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక సతమతమవుతున్నారు. ఇక మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ఈ కరోనా వైరస్ కు సంబంధించిన వార్తలు ప్రజలను మరింత గందరగోళానికి గురి చేస్తూ భయపెడుతున్నాయి. ఈ సమయంలో ప్రజలకు తగిన సూచనలు చేయాల్సిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పై ఉన్న ఆగ్రహంతో తన స్థాయిని కూడా మరిచిపోయి వ్యవహరిస్తున్న తీరు తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయాలకు అర్థం పడుతోంది అంటూ ఇప్పటికే వైసిపి విమర్శలు చేస్తోంది. తాజాగా విశాఖ జిల్లా నర్సీపట్నం లో ప్రభుత్వ డాక్టర్ వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేయడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 

 

IHG's tweet -

ఆ ప్రభుత్వ ఆస్పత్రిలో మాస్కులు ఏవి అందుబాటులో లేవు అని చెబుతూనే, తాను ప్రభుత్వ ఉద్యోగిని అనే విషయాన్ని మరిచి, ప్రస్తుత పరిస్థితిని పట్టించుకోకుండా ఆ వైద్యుడు వైసిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ వ్యవహారం కాస్త బాగా వైరల్ అయింది. దీంతో ప్రభుత్వం కూడా రంగంలోకి దిగి వాస్తవ పరిస్థితి ఏంటి అనేది తెలుసుకోగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. సదరు డాక్టర్ టిడిపి మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కనుసన్నల్లో  నడిచే వ్యక్తిని, అసలు ఈ  ఆరోపణలు చేసే ముందు ఆ డాక్టర్ అయ్యన్న ఇంటికి వెళ్లి వచ్చినట్టుగా కూడా ప్రభుత్వానికి సమాచారం అందింది. దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజిలు కూడా అందాయి. అలాగే సదరు డాక్టర్ విమర్శలు చేస్తున్న సమయంలో కొంతమంది టీడీపీ అనుకూల మీడియా అక్కడ ఉండడాన్ని కూడా వైసిపి తప్పు పడుతోంది. దీంట్లో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించడంతో వాస్తవాలు ఏమిటో జనాలకు అర్థం అయింది.

 

 సదరు డాక్టర్ ఆరోపిస్తున్నట్లు గా అక్కడ పరిస్థితులు కనిపించలేదని, మాస్క్ లు అన్ని అందుబాటులో ఉన్నాయనే విషయం తేలింది. దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం సదరు డాక్టర్ ను సస్పెండ్ చేయడమే కాకుండా ఆయనపై 144 సెక్షన్, విపత్తు సమయంలో ప్రభుత్వాన్ని దూషించిన కేసు, ఉన్నతాధికారుల పై విమర్శలు చేసినందుకు ఇలా మొత్తం మూడు కేసులు నమోదు చేసింది. అయితే ఈ వ్యవహారంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు హస్తం ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వంటి మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఈ విధంగా ముసుగు రాజకీయానికి తెర తీయడం చంద్రబాబు స్థాయిని మరింత పలుచన చేస్తోంది. ఈ విషయంలో మిగతా రాష్ట్రాల నాయకులను చూసి అయినా చంద్రబాబు లో మార్పు రాకపోవడం నిజంగా బాధాకరమే.

మరింత సమాచారం తెలుసుకోండి: