ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో అన్ని రంగాలు కుదేలు అయ్యాయి. ఈ క్ర‌మంలోనే ఈ ఎఫెక్ట్ మీడియా రంగంపై సైతం తీవ్రంగా ప‌డింది. ఇక ఆర్ధిక భారాన్ని ఎలా తగ్గించుకోవాలో అని గత ఎన్నికల తర్వాత నుంచీ సీరియస్ గా ఆలోచిస్తున్న ద‌మ్మున్న (అని వాళ్లు చెప్పుకుంటారు) మీడియా ప‌త్రిక‌, ఛానెల్ ఇప్పుడు క‌రోనాను బూచీగా చూపించి నిర్దాక్షిణ్యంగా ఉద్యోగుల‌ను ఇంటికి పంపించి వేస్తోంది.

 

ఇప్ప‌టికే ఏపీలో జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబుకు ఇష్ట‌మొచ్చిన‌ట్టు డ‌ప్పు కొట్టిన స‌ద‌రు మీడియా అడ్డ‌గోలుగా కోట్లాది రూపాయ‌లు వెన‌కేసుకుంది. ఇక ఇప్పుడు జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే స‌ద‌రు మీడియాకు అస‌లు ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు, వైసీపీ ప్ర‌క‌ట‌న‌లు వెళ్ల‌డం మానేశాయి.

 

ఇక టీడీపీ సైతం ఓడిపోవ‌డంతో ఆ పార్టీ నేత‌లు కూడా ఎవ్వ‌రూ ఆ ద‌మ్నున్న ఛానెల్‌కు ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌డం లేదు. పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు కోట్లాది రూపాయ‌లు వెన‌కేసున్న స‌ద‌రు ఎండీ త‌న ఆదివారం చిల‌క ప‌లుకుల‌తో బోల్లెడు నీతి వాక్యాలు చెపుతున్నా ఇప్పుడు క‌రోనా బూచీని చూపి త‌న సంస్థ‌ల్లో ప‌నిచేసే ఉద్యోగుల్లో చాలా మందిని నిర్దాక్షిణ్యంగా తీసేస్తున్నారు.

 

క‌రోనా దెబ్బకు ఒక్కసారిగా 80 శాతం యాడ్ రెవెన్యూ పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదంటూ ఇప్పటికే ఉద్యోగులకు చెప్పేసారు. కరోనా సంక్షోభానికి అతలాకుతలమవుతున్న పత్రిక రంగంలో ఉద్యోగుల తొలగింపు అనివార్యమైన పరిస్టులలో.. మేనేజ్మెంట్ కాస్త మానవతా దృక్పధంతో ఆలోచించాలి.

 

కానీ ఈ ప‌త్రిక అధినేత రాజ‌కీయ నాయ‌కుల విష‌యంలో నీతి వాక్యాలు చెపుతున్నా త‌న వ‌ర‌కు వ‌చ్చేసరికి మాత్రం అవ‌న్నీ ప‌ట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌ద‌రు ప‌త్రిక‌లో జిల్లాల్లో ప‌నిచేస్తోన్న స‌బ్ ఎడిట‌ర్ల‌లో ఇప్ప‌టికే 50 శాతం మందిని ఇంటికి పంపేశారు. రెండు నెల‌ల పాటు కేవ‌లం 25 శాతం జీతాలు మాత్ర‌మే ఇస్తామ‌ని ఇక స‌ర్దుకోమ‌ని చెప్పి పంపేస్తున్నార‌ట‌. దీనిపై ఉద్యోగ వ‌ర్గాల్లో తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 


అనివార్య పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగించినా 3, 4 నెలల జీతం అయినా ఇవ్వండి. మరో ఉద్యోగమో, ఉపాదో దొరికే వరకు ఉద్యోగం కోల్పోయిన వారు ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించడానికి ఆస్కారం ఉంటుంద‌ని వేడుకుంటున్నా క‌బుర్లు చెప్పే ద‌మ్మున్న ప‌త్రిక మేనేజ్‌మెంట్ చాలా ఘోర‌మైన రీతిలో వ్య‌వ‌హ‌రిస్తోంది. ఏదేమైనా ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో స‌ద‌రు ఛానెల్‌కు కూడా రోజు భారీ న‌ష్టాలు రావ‌డంతో ఆ మీడియాలో సంక్షోభం ఖాయంగా క‌నిపిస్తోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: