కరోనా వైరస్ ప్రపంచంలోకి అడుగు పట్టి వంద రోజులు దాటింది. భారత్‌లోకి కరోనా వైరస్ అడుగుపెట్టిన చాలా రోజులకు కానీ తెలుగు రాష్ట్రాల్లోకి అడుగు పెట్టలేదు. మొదట తెలంగాణలో తొలికేసు నమోదైంది. ఢిల్లీలోని మర్కజ్‌ కు హాజరైన ఇండోనేషియా దేశస్తులు తొలి బాధితులయ్యారు. ఆ తర్వాత మరికొన్ని కేసులు విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా తెలంగాణకు వచ్చాయి.

 

 

కరోనా కట్టడిలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ క్రియాశీలకపాత్ర పోషించారు. ప్రధాని మోడీ కంటే ముందుగానే కేసీఆర్ లాక్‌డౌన్‌ ప్రకటించారు. కరోనాను ఎదిరించేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. ఈ క్రమంలో రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయినా సరే.. ప్రాణాలకే విలువ ఇస్తామంటూ కేసీఆర్ ప్రజల మన్నన అందుకున్నారు. ఎప్పటికప్పుడు రాష్ట్రంలో కరోనా పరిస్థితిని సమీక్షిస్తూ వైరస్‌ వ్యాప్తి కోసం శ్రమించారు.

 

 

అయితే మర్కజ్‌కు హాజరై తెలంగాణకు వచ్చిన వారి ద్వారా కరోనా తెలంగాణలో విస్తరించింది. మొత్తానికి తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 500వరకూ చేరుకుంది. తెలంగాణతో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఏపీలో కాస్త తక్కువే. ఇక ఏపీలో నెల్లూరులో మొదటి పాజిటివ్ కేసు నమోదైంది. ఇక్కడ 400వరకూ కేసులు నమోదయ్యాయి. కరోనాపై పోరాటంలో కాస్త అన్యమనస్కంగా దిగిన జగన్.. ఆ తర్వాత క్రియాశీలమయ్యారు. వాలంటీర్ల వంటి వ్యవస్థలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా కరోనాపై పోరాటం చేస్తున్నారు.

 

 

ఆంధ్రప్రదేశ్‌ లోనూ మర్కజ్ నుంచి వచ్చిన వారి ద్వారానే కరోనా వ్యాపించింది. అయితే కరోనాపై పోరులో తెలంగాణ సీఎం కేసీఆర్ ఫస్ట్ క్లాస్‌ మార్కులు తెచ్చుకుంటే.. జగన్ ఎబౌ ఏవరేజ్ రేటింగ్ దక్కించుకున్నారు. అయితే ప్రస్తుతానికి కరోనా ను అదుపు చేయగలుగుతున్నా.. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయి. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాయి. మరి ఈ కరోనా ను ఎలా కట్టడి చేస్తాయో.. ఆర్థికంగా ఎలా నిలదొక్కుకుంటాయో చూడాలి. నిజంగా ఇది అగ్ని పరీక్షే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: