అధికారంలో ఉన్నా లేకపోయినా తన ప్రజలకు అండగా నిలిచేవాడే నాయకుడు.. అందులోనూ జనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ నాయకుడు తన ప్రజలకు అండగా నిలవాలి. ముందుండి ధైర్యం చెప్పాలి.. నేనున్నా మీకేం కాదని భరోసా ఇవ్వాలి.. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తర్వాత తెలుగుదేశం నాదే అని భావించే నారా లోకేశ్ ఇద్దరూ అదే మిస్సవుతున్నారు.

 

 

రాష్ట్రమంతా వైసీపీ గాలి వీస్తున్నా చంద్రబాబును మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కుప్పం ప్రజలు గెలిపించుకున్నారు. ఇక నారా లోకేశ్ మంగళగిరిలో గెలవకపోయినా తక్కువ మెజారిటీతోనే ఓడిపోయారు. అంతే కాదు.. గెలిచినా ఓడినా తాను మంగళగిరిలోనే ఉంటానని నారా లోకేశ్ ఎన్నికల సభల్లో చెప్పారు. మరి ఇప్పుడు రాష్ట్రం కరోనాతో కిందామీదా అవుతుంటే ఈ నేతలు ఎక్కడున్నారు.. ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు..?

 

 

సాధారణంగా అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబు ఇలాంటి విపత్తలు సమయంలో ఎక్కువగా జనం మధ్యే ఉంటారు. కానీ ఈసారి ఎందుకో ఆయన హైదరాబాద్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. తన ప్రజలు కరోనాతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా ఆయన హైదరాబాద్‌లోనే కూర్చుని ప్రెస్ మీట్లు పెడుతూ జగన్ తీరును విమర్శిస్తున్నారు.

 

 

ఈ ఇద్దరు నాయకుల తీరు చూస్తుంటే.. జనంలోకి వెళ్లే ఓ గొప్ప అవకాశాన్ని మిస్ అవుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. చివరకు చంద్రబాబు నాయుడు గెలిచిన కుప్పం, ఆయన కుమారుడు లోకేష్‌ ఓడిన మంగళగిరి నియోజకవర్గాల ప్రజలకు వైసీపీ నేతలే అండగా ఉంటున్నారు. మరి చంద్రబాబు ఈ విషయాన్ని ఎందుకు లైట్ గా తీసుకున్నారో.. బహుశా ఇప్పడే ఎన్నికలు లేవు కదా అనుకున్నారో ఏమో..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: