నెగ‌టివ్ పాజిటివ్ అన్న‌ట్లుగా క‌రోనా మ‌హ‌మ్మారితో అంత‌ర్జాతీయంగా భార‌తదేశం యొక్క స‌త్తా ఏంటో తెలుస్తోంది. క‌రోనాను తేలిక‌గ్గా తీసుకున్నా దేశాలు ఇప్పుడు ల‌బోదిబోమంటున్నాయి.భార‌త్ మాత్రం చాలా వ‌ర‌కు సేఫ్‌గా ఉంద‌నే చెప్పాలి. మ‌ర‌ణాల రేటు ఇత‌ర దేశాల‌తో పొల్చుకున్న‌ప్పుడు చాలాచాలా త‌క్కువ‌. అందుకు ముందుగా ప్ర‌ధానిమోదీని దేశ ప్ర‌జ‌లంద‌రూ ఇప్పుడు అభినందిస్తున్నారు. వాస్త‌వానికి ఈ అభినంద‌న‌లకు క‌చ్చితంగా ఆయ‌న అర్హుడే. అయితే ఇంకాస్త ముందుగా..అంటే ఫిబ్ర‌వ‌రి మాసంలోనే విదేశీ విమాన స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేసిన‌ట్ల‌యితే అస‌లు ఇండియాలోకి క‌రోనాను అడుగుపెట్టేదే కాదు అంటూ వాదిస్తున్నారు. అలాంటి వారంద‌రు తెలుసుకోవాల్సింది ఒక్క‌టే. 

 

మోదీకి త్రినేత్రం లేదని, ఆయ‌న పొతులూరి వీర‌బ్ర‌హ్మేంద్ర‌స్వామి కాద‌ని తెలుసుకోవాలి. భార‌త ప్ర‌ధాని మోదీ తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణ‌యాన్ని ఇప్పుడు ప్ర‌తీదేశాధినేత స‌మ‌ర్థించ‌డ‌మే కాదు..కొనియాడుతున్నారు కూడా. మ‌రి ప్ర‌పంచం దేశాల ప‌రిస్థితి ఒక‌సారి ప‌రిశీలిస్తే అమెరికా, స్పెయి్‌, ఫ్రాన్స్‌, బ్రిట‌న్‌, ఇట‌లీ వంటి దేశాలు సాంకేతిక‌, వైద్య పరిజ్ఞానంలో భార‌త‌దేశం కంటే చాలా ముందున్నాయ‌నే చెప్పాలి. అయితే క‌రోనా దెబ్బ‌కు క‌కావిక‌ల‌మ‌వుతున్నాయి. అడుగుమోప‌డ‌మే త‌రువాయి... వైర‌స్ ఆయా దేశాల్లో వెయ్యిరెట్ల వేగంతో విస్త‌రిస్తూ వేలాదిమంది ప్రాణాల‌ను బ‌లిగొంటోంది. బ్రిట‌న్‌, అమెరికా, ఇట‌లీ, స్పెయిన్ వంటి దేశాల‌ను క‌కావిక‌లం చేస్తోంది. అగ్ర‌రాజ్యం అమెరికా అయితే ప్రాణాల‌ను కాపాడ‌టానికి నానా అగ‌చాట్లు ప‌డుతోంది. 

 

వైర‌స్ వ్యాప్తిలో చాలా దేశాల‌ది స్వ‌యం కృత‌ప‌రాద‌మే క‌నిపిస్తోంది. చైనాను గుడ్డిగా నిందిస్తున్న దేశాలు..వైర‌స్ విష‌యం తెలిశాక కూడా..అది ఎంత ప్ర‌మాద‌కారో వైద్య నిపుణులు సూచించాకా కూడా నిర్ల‌క్ష్యం వ‌హించారంటే వారిని ఏమ‌నాలి. అమెరికా, ఫ్రాన్స్‌లో అయితే క‌రోనా మ‌ర‌ణాలు మొద‌లైనా ప‌బ్బులు, జ‌ల్సాల‌తో అక్క‌డి యువ‌త పార్టీల్లో మునిగిపోవ‌డం దేనికి సంకేతం.. ఇందులో అక్క‌డి ప్ర‌భుత్వాల త‌ప్పులేదా..? చ ఇప్పుడు వేలాది మంది ప్రాణాలు కోల్పోవ‌డానికి..ల‌క్ష‌ల కోట్ల సంప‌ద ఆవిరై పోవ‌డానికి కార‌ణం ఆయా దేశాలు వైర‌స్ క‌ట్ట‌డిపై ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించ‌డం ఫ‌లితం కాద‌న‌లేని నిజం. ఆర్థికంగా న‌ష్ట‌పోతున్నామ‌ని వాదించే భార‌తీయుల‌కు ప‌క్క దేశాల వారి మ‌ర‌ణాల లెక్క‌లు చూపండి...మోదీ తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణ‌యం ఎంత క‌రెక్టో తెలిసిపోతుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: