మొన్నటి ఎన్నికల్లో జనాలు తెలుగుదేశంపార్టీని ఘోరంగా ఓడించారు. అదే సమయంలో వైసిపికి బంపర్ మెజారిటి ఇచ్చారు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. అయితే చాలామందికి తెలీని విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా  ఓట్లేసిన జనాలపై ఏబిఎన్-ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఇంకా ఏడుస్తునే ఉన్నాడని. ప్రతి ఆదివారం  రాసే కొ(చె)త్తపలుకులో కేసియార్-జగన్ పై చాలా విషయాలే రాశాడు. కేసియార్ మీద రాసిన విషయాల్లో పరోక్షంగా తెలంగాణా సిఎం కూడా సన్యాసనే కాకుండా ఇంకా చాలా చాలా అన్నాడు. సరే వాళ్ళిద్దరి మధ్య వ్యవహారాలను పక్కన పెట్టేద్దాం.

 

ఏపి విషయానికి వస్తే కరోనా వైరస్ తీవ్రతను గుర్తించటానికి జగన్ ఇష్టపడటం లేదని రాశాడు. వైరస్ తీవ్రతను గుర్తించబట్టే 24 గంటలూ వైరస్ వ్యాప్తి నిరోధానికి సమీక్షలు నిర్వహిస్తున్నాడు. వైరస్ తీవ్రతను జగన్ గుర్తించినా గుర్తించకపోయినా ఆగదుకదా ? క్వారంటైన్, ఐసొలేషన్ వార్డులు ఎందుకు పెట్టినట్లు ? ఒకటికి మూడుసార్లు ఇంటింటి సర్వే ఎందుకు జరిపిస్తున్నట్లు ?  ఇక్కడ సమస్య ఏమిటంటే జగన్ పడుతున్న కష్టాన్ని గుర్తించటానికి వేమూరి ఇష్టపడలేదు. పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపించినట్లుగా జగన్ తప్పులుమాత్రమే చేస్తాడు అన్నది ఫిక్సయ్యాడు కాబట్టే అన్నీ తప్పులే కనబడుతున్నాయి.

 

అవినీతి పరుడు, నేరమనస్తుడైన జగన్ అధికారంలోకి రాబట్టే పరిస్ధితులు ఈ విధంగా ఉన్నాయని చెప్పటమే విచిత్రంగా ఉంది. సరే జగన్ విషయంలో వేమూరి చెప్పిందే నిజమని అనుకున్నా తన కులగురువు  చంద్రబాబునాయుడు వ్యవహారం ఏమిటి ?  చంద్రబాబు ఏమన్నా కడిగిన ముత్యం లాంటోడా ? సర్వ వ్యవస్ధలను భ్రష్టుపట్టించిన ఘన చరిత్ర ఉన్నవాడు  చంద్రబాబన్న విషయం అందరికీ తెలిసిందే. అవినీతిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్ళిన క్రెడిట్ చంద్రబాబుకే దక్కింది. అందుకనే అవినీతిని, అరాచకాలను భరించ లేకే టిడిపికి జనాలు గూబగుయ్యిమనిపించారు.

 

ఎన్నికలు జరిపి పది మాసాలైనా జనాల తీర్పును రాధాకృష్ణ ఇప్పటికీ భరించలేకపోతున్నట్లున్నాడు. అందుకనే పదే పదే వైసిపికి ఓట్లేసిన జనాలను తప్పు పడుతూ పిచ్చిరాతలు రాస్తున్నాడు. 2014 ఎన్నికల్లో రాష్ట్రాన్ని సింగపూర్ మాదిరిగా చేస్తానని చెప్పిన చంద్రబాబు మాటలు ఏమయ్యాయి ? వివిధ వర్గాలకు రుణమాఫీ చేస్తానని మోసం చేసిన  చంద్రబాబును ఏనాడైనా నిప్పు రాధాకృష్ణ ప్రశ్నించాడా ?

 

పైగా జగన్ పాలన నుండి ఆంధ్రప్రదేశ్ ను దేవుడే కాపాడలట. నియమ, నిబంధనలను గాలికొదిలేసి చంద్రబాబు చెప్పినట్లు ఆడుతున్న ఎన్నకల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తీసేయటాన్ని వేమూరి కూడా తట్టుకోలేకపోతున్నాడు. తప్పు చేస్తున్నట్లు ప్రకటించి మరీ తప్పు చేసిన ఛైర్మన్ ఎంఏ షరీఫ్ లాంటి వాళ్ళ వల్లే శాసనమండలి భ్రష్టుపట్టింది.  అందుకనే అసలు శాసనమండలే అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయించి రద్దుకు సిఫారసు చేసింది. 

 

మండలి రద్దుకు జగన్ నిర్ణయం తీసుకోవటానికి షరీఫ్ తో తప్పు చేయించిన చంద్రబాబే ప్రధాన కారణం.  పైగా అర్ధరాత్రి వరకూ క్యూలో నిలబడి ఓట్లేసిన జనాలే మంచి-చెడుకు బాధ్యులంటూ పిచ్చి రాతొకటి. 2014లో కూడా ఓట్లేసి తప్పు చేశామని అనుకోబట్టే చేసిన తప్పును జనాలు 2019లో కరెక్టు చేసుకోవటాన్ని వేమూరి  తట్టుకోలేకపోతున్న విషయం అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: