ఇప్ప‌టి  మ‌నుషులు ఇప్ప‌టి క‌విత్వం నుంచి పొందిన విముఖత ఒక‌టి ఇవాళ్టి రాగాకు ఫ‌స్ట్ కాజ్

 

పాట ఇలా రాశాను
ఒక్కొక్క‌రున్న దేశాన
అంద‌రొక్క‌టై ఉంటారా
భావి భార‌తం మార్చెద‌మంటూ
ప్ర‌తిజ్ఞ ఏదో చేస్తారా?
దేశాల‌కు ప్రాంతాల‌కూ ఈ మ‌నుషుల‌కూ
కొత్త నినాదాల‌ను అందించే క్ర‌మాన
నిరంత‌ర నిర్వాణ గ‌తి ఒక‌టి వెన్నాడున‌పుడు మాత్ర‌మే
ఓ ప్రాయోగిక శ‌క్తి అచంచ‌ల న‌మ్మ‌కాన్ని ఇవ్వ‌గ‌ల‌దు
అలాంటి శ‌క్తుల‌ను అలాంటి గొప్ప  విశ్వాసాల కూడ‌ళ్ల‌ను
ఇప్పుడు నిర్మించ‌డం విస్త‌రించ‌డం అన్న‌ది చేయ‌క త‌ప్ప‌ని ప‌ని కానీ దేశాన అలా లేదు దేశ‌మే అలా లేదు
క‌నుక మీరూ నేనూ ఆక‌లి చావుల లెక్కింపుల్లోనే ఉండాలి త‌ప్ప‌క‌!


 
విఘ‌ట‌న శ‌క్తి ఒకింత మేలు చేస్తుంద‌ని విన్నాను..చ‌దివేను సంఘ‌టితం కానివ‌న్నీ విఘ‌ట‌నాల‌ను మోసుకువ‌స్తాయా? మ‌ళ్లీ చా వు లాంటి ప్ర‌శ్న.. హాయిగా ఎక్క‌డో ద‌గ్గ‌ర ఈ గాలుల‌కు..ఏమ‌యినా వ్యాక‌ర‌ణం నేర్పి పంపితే స‌మాన‌త అన్న‌ది ఒక‌టి తీసుకు వ‌స్తాయి..అని ఎలా అనుకోగ‌లం కానీ మ‌నం  ఓడిన మ‌నం నైరాశ్య‌ప‌డిన మ‌నుషులే చుట్టూ కొంత కొత్త ఊపిరికి కార‌ణం  కాగ‌ల రు.. దేశాన్ని ఆక‌లితో గుణించి ఆక‌లితోనే భాగించి ఒక చోట తీసి వేసిన లెక్క‌ల్లో కూడికల్లో వేద‌న‌ల్లో ఉంచి అప్పుడు మీ ఉమ్మి వేత‌ల  ధోర‌ణుల‌ను అర్థం చేసుకుంటూ పోతాను.. దేశాన్ని ప్రేమించ‌డం చాత‌గాక చాలా కాలం అయింద‌ని మీ మీ వూహా వ్యుత్ప త్తుల నుంచి  నేర్చుకుంటాను..దేశాన్ని నేను ఎలా చూస్తాను హ‌లంత శ‌బ్దంలా చూశానా.. అకారంతా స్త్రీలింగం గా చూశానా తెలి యదు కానీ ఈ జన‌ని నాకో కొత్త వేడుక‌ల‌ను ప‌రిచ‌యం చేయాల‌న్న నిబ‌ద్ధ‌త‌తో ఉన్నాను..లేదా క‌న్నీటి రాత‌ల‌ను చెరిపి పో యిన గంగా తీరాల‌ను నేను చూడాల‌నుకున్నాను కానీ ఇవ‌న్నీ సాధ్యం కాని చోట  మీరు ప్ర‌క‌టించే ప్రేమ‌లు అబ‌ద్ధాలే !

 

దేశాల‌ను ఎలా చూడాలి లేదా సైన్యాన్ని ఎలా చూడాలి నాలుగు అడుగులు ఉంటే చాలు అనుకున్న నేల‌ల‌ను ఎలా ప‌దిలం చే యాలి..విష‌తుల్య‌పు గాల‌ల నుంచి మాలిన్యాల‌ను తీసి ఆత్మ‌ను శుభ్ర‌ప‌రిచిన చోట ఎలా ఒక‌రిని తోడుకుని ఉండ‌క ఉండాలి ఇ లాంటివి కొన్ని వీటితో కొన్ని నేను నాతో ఇంకొంంద‌రు..ఆక‌లి ఉన్న చోట నింద‌లు ఉన్నాయి..ఆక‌లి లేని చోట నిరాధారం అనుకోని ఆరోప‌ణ‌లు ఉన్నాయి..ఒక కొన దగ్గ‌ర ఆగిపోయిన ప్ర‌పంచాల‌ను నేను నిర్మించ‌డం సాధ్యం కాని పని..విస్తృతిలో ఉన్న విముఖత ప‌రిధిలో లేనందుకు బాధ‌ప‌డ‌డం త‌ప్ప  మ‌నం  చేయ‌ద‌గింది ఏమీ లేదు.

 

కాలం కాని కాలంలో ఏవేవో వ‌చ్చిపోతుంటాయి..నేను న‌వ్వుకుంటాను ట్రంప్ లాంటి మోడీలాంటి నేత‌లున్న‌చోట..నేను మాత్రం ఇలాంటివారికి భిన్నంగా ఈ ప్ర‌జ‌లే లేనందుకు బాధ‌ప‌డ్తాను..దేశాన్ని ఎలా చూడాలి.. ఆక‌లి చావు నుంచి చూడాలి జీవ‌చ్ఛ‌వ దా రుల నుంచి చూడాలి..గ‌మ్య ర‌హిత ప్ర‌యాణం నుంచి చూడాలి.. ఇలాంటి దేశాల‌ను మ‌నం ఎలా చూడాలి..ఉష్ణ మండ‌ల దేశాల‌కు ఉష్ణ మండ‌ల గాలుల‌కూ సోక‌నివి సోలిన‌వి ఏమ‌యినా ఉన్నాయో లేదో కూడా చూడాలి..ఇప్పుడు మ‌తం మ‌నిషి అను రెండు  వి భిన్న ధోర‌ణులలో పాటు ఇంకొన్ని క‌విత్వీక‌ర‌ణ‌కు నోచుకోవ‌డం ఒకింత బాధ‌గా ఉంది..అయినా కూడా మ‌న దారుల్లో మ‌నుషులు మ‌న‌కు చెంద‌ని వారిగా ఉండ‌డం కూడా ఒక విధం అయిన విఘ‌ట‌నే అని చ‌దివేను..అవును ఇది కూడా ప్ర‌తిఘ‌ట‌నే! వెళ్లి పోయి న మ‌నుషులు ఇక్క‌డి నేల‌ల‌ను ప్రేమిస్తారు.. దేశం వీడిపోయిన మ‌నుషులు అవ‌కాశాల వెల్లువ‌లో ఉన్న మ‌నుషులు ఇప్పుడొక స్థిర చిత్తం వైపు అడుగులు వేస్తారు.. ప్ర‌వాసీయులు మంచి వారు భార‌తీయులు మంచి వారు  ఆంధ్రులు మంచి వారు ఇలాంటి ని ర్థార‌ణ‌ల్లో నేను ఉండ‌ను ఎందుకంటే మంచి నుంచి చెడు దాకా విస్తృతిలో ఉన్న‌వి విస్తృతి నుంచి ప‌లాయ‌నం అందుకున్న‌వి నా ద గ్గ‌ర కోకొల్ల‌లు.. 

 

ఇలాంటి వ‌డ‌పోత‌ను న‌మ్మ‌ను.. ఈ ద‌రిద్ర‌గొట్టు మ‌నుషులు లేకుండా ఉంటే బాగుంటుందండి అంటున్నాడో డైరెక్ట‌ర్ .. అలానే ఓషో కూడా! ఏమంటాడు మీకు దేవుడు క‌నిపించ‌కూడ‌దనే చెబుతాడు.. జీవాంత‌ర్థానాన మ‌నం ఓడిపోయి ఎవ్వ‌డినీ గె లిపించ‌న‌వ‌స‌రం లేదు.. ఒకింత కొత్త వైర‌స్సులు వ‌స్తాయి.. మీకు ఆసక్తి ఉంటే వాటి కార‌ణాల‌ను వాటి రాక పోక‌ల పోక‌డ‌ల‌ను గు ర్తించ‌డం బాధ్య‌త.. దేశాల‌ను తిట్టిపోయ‌డం కుద‌ర‌ని ప‌ని నా వ‌రకూ! ఇప్పుడు మీకు కొన్ని వ‌స్తువుల నుంచి కొంద‌రి దేహాల వ ర‌కూ ఉన్న విముఖ‌త కొద్దికాలం త‌రువాత పోతుంద‌ని నిర్థార‌ణ‌. క‌నుక అంబానీల దేశ‌భ‌క్తికి నేను ప్ర‌ణ‌మిల్ల‌ను అమిత్ షా దేశ భ‌క్తికి ప్ర‌ణ‌మిల్ల‌ను క‌రువును జ‌యించిన నేల‌ల‌కు  వాటి గాలుల‌కు ల‌క్ష‌ణ‌ల‌క్షితాల‌కు మాత్రమే మోక‌రిల్లుతాను..

 

- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

 

రేఖా చిత్ర ఛాయ : బాబు దుండ్ర‌పెల్లి 

 

మరింత సమాచారం తెలుసుకోండి: