బ‌తికుంటే బ‌లుసాకైనా తిని బ‌త‌క‌వ‌చ్చు...అన్న సూత్రాన్ని జీవితానికి అన్వ‌యించుకుంటున్న చాలామంది ఎన్ ఆర్ ఐలు ఇప్పుడు ధ‌నిక దేశాల‌ను వ‌దిలి భార‌త్‌కు వ‌చ్చేందుకు సిద్ధ‌ప‌డుతున్నారు. భార‌త్‌లో లాక్‌డౌన్ ఎత్తివేయ‌డ‌మే త‌రువాయి రెక్క‌లు క‌ట్టుకుని మ‌రీ స్వ‌దేశానికి వ‌చ్చేందుకు రెడీగా ఉన్నారు. క‌రోనా దెబ్బ‌కు అమెరికాతోపాటు మిగ‌తా యూర‌ప్ దేశాలు అల్ల‌క‌ల్లొలం అవుతున్న విష‌యం తెలిసిందే. ఈనేప‌థ్యంలో అక్క‌డా ఇప్పుడు తిండి దొర‌క‌డ‌మే క‌ష్టంగా మారుతోందంట. ప‌రిస్థితి రోజురోజుకు భ‌యాన‌కంగా త‌యార‌వుతోంది. భార‌తీయ యువ‌త క‌ల‌లుగ‌న్న డాల‌ర్‌డ్రీమ్స్ చెదిరిపోతున్నాయి..క‌రోనా ప్ర‌మాద ఘంటిక‌ల‌కు త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌ను స‌మీప‌ భ‌విష్య‌త్‌లో విదేశాల‌కు పంపే ఆలోచ‌న చేయ‌డానికి సాహ‌సించ‌ర‌న్న‌ది నిజం.


గ‌తంలో  ‘మా వాడు అమెరికాలో గొప్ప‌ ఉద్యోగం చేస్తున్నాడు.. మా వాడు యూరప్ లో ప్ర‌పంచంలోనే అతిపెద్ద కంపెనీలో టీం లీడ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు..? మ మా వాడు అమెరికాలో విల్లా తీసుకున్నాడంటూ.?’  ఇన్నాళ్లు తెలుగువారు గొప్పగా చెప్పుకునేవారు.. అమెరికా సహా విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేసేవారిని కూడా ఇక్క‌డి సమాజం  గొప్పగా చూసేది. తెలుగురాష్ట్రాల నుంచి వేలాది కుటుంబాలు తమ పిల్లలను అమెరికా యూకేఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్లి చదివిస్తున్నారు. విదేశీ వ్యాపారం ఇప్పుడు ఎంతో లాభదాయకంగా ఉంది. 


కానీ ఇప్పుడు కరోనా దెబ్బకు మాత్రం వాయిస్ మారుతోంది. విదేశాల్లోనే కాదు..హైద‌రాబాద్‌కు పంప‌డానికి కూడా త‌ల్లిదండ్రులు ఆలోచించేలా క‌రోనా త‌ల్లిదండ్రుల్లో మార్పు తెచ్చింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.   ఒకప్పుడు ఎంతో సురక్షితమైన అమెరికా యూరప్ వంటి దేశాలు ఇప్పుడు ఎంత‌మాత్ర క్షేమ‌క‌రం కాద‌న్న అభిప్రాయానికి త‌ల్లిదండ్రులు వ‌చ్చేశారు. ఉన్న‌ప‌ళంగా పెట్టే బేడ స‌ర్దేసుకుని విమానాలు మొద‌లైన వెంట‌నే ఇక్క‌డికి వ‌చ్చేయాలంటూ ఇప్ప‌టికే కొంత‌మంది త‌ల్లిదండ్రులను పిల్ల‌ల‌కు సూచించ‌డం గ‌మ‌నార్హం. ప్రాణాల‌కు ర‌క్ష‌ణ లేన‌ప్పుడు ఎంత మంచి ఉద్యోగం, డ‌బ్బు వ‌స్తే ఏం లాభం అంటూ జీవిత స‌త్యాల‌ను చెబుతున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: