ప్ర‌పంచానికి నీతి ప‌లుకులు చెప్పే.. ద‌మ్మున్న చానెల ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ‌.. ఉర‌ఫ్ ఆర్కే.. లాక్ డౌన్ పేరుతో ఉద్యోగుల ఉసురు తీస్తున్నార‌నే వాద‌న ఆ సంస్థ‌ల ఉద్యోగుల నుంచి బ‌లంగా వినిపిస్తోంది. నిజానికి లాక్ డౌన్ అనేది మార్చి 21 త‌ర్వాత నుంచి దేశ‌వ్యాప్తంగా అమ‌లు అవుతోంది. దీంతో ప‌నులు ఆగిపోయాయి. కానీ, మీడియా మాత్రం ఆగిపోలేదు. మీడియాలో ప‌నిచేస్తున్న  ప్ర‌తి ఒక్క‌రూ క‌రోనా కాటుకు భ‌య‌ప‌డుతున్నా.. ఉద్యోగ ధర్మాన్ని మాత్రం నిర్వ‌ర్తిస్తున్నారు. అలాంటి వారికి ఇప్పుడు కొత్త ప‌లుకు ఆర్కే వేత‌నాల్లో కోత‌లు పెట్టి.. మ‌రిన్ని కోట్లు వెనుకేసుకుంటున్నాడ‌నే వాద‌న బ‌లంగా ఉంది.

 

తాజాగా ఆంధ్ర‌జ్యోతి ఉద్యోగుల‌కు ఇచ్చిన వేత‌నాల్లో 25శాతం కోత పెట్టారు. ఇప్ప‌టికే రెండు వేల మంది ఉద్యోగుల‌ను  ఇంటికి పంపేసిన సంస్థ‌.. ఉన్న‌వారితోనే ప‌నిచేయించుకుంటున్నా.. వారికి ఇవ్వాల్సిన వేత‌నాల‌ను కూడా ఇవ్వ‌క‌పోవ‌డంపై ప్ర‌తి ఒక్క‌రూ విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. నిజానికి వేత‌నాల్లో కోత అంటే.. ముందుగానే ఉద్యోగుల‌ను అలెర్ట్ చేయాల్సి ఉంది. ఎప్పుడైతే.. నిర్ణ‌యం తీసుకున్నారో.. అప్పుడే చెప్పి ఉంటే ఉద్యోగులు జాగ్ర‌త్త‌లు ప‌డేవారు. కానీ, అలా చెప్ప‌కుండా సెడ‌న్‌గా వేత‌నాల్లో కోత పెట్ట‌డం నీతులు చెప్పే ఆర్కేకే చెల్లింద‌నే వాద‌న ఆ సంస్థ‌ల ఉద్యోగుల నుంచి వినిపిస్తోంది.

 

వాస్త‌వానికి 20 రోజుల లాక్‌డౌన్‌కే ఆంధ్ర‌జ్యోతికి న‌ష్టాలు వ‌చ్చాయా?   అంత బ‌ల‌హీనంగా ఈ సంస్థ ఉందా? ..అనేది ఆర్కే చెప్పాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఇది త‌న సంస్త ఉద్యోగులకు సంబంధించిన విష‌య‌మే అయినా.. స‌మాజం గురించి క‌న్నీరు కార్చే క‌లం సార‌ధిగా ఆయ‌న బాధ్య‌త‌. ఈ సంద‌ర్భంగా సాక్షిలో ఉద్యోగుల‌ను తొల‌గించిన‌ప్పుడు(అప్పుడు కూడా వారికి రూ.50 వేల నుంచి రూ.80 వేల‌వ‌ర‌కు ప‌రిహారంగా ఇచ్చి పంపించారు) ఇదే ఆర్కే..త‌న కొత్త ప‌లుకులో సాక్షిని న‌డిపిస్తోంది..ఫ‌క్తు వ్యాపార వేత్త అని, ఆయ‌న‌కు ఉద్యోగుల సాధ‌క బాధ‌లు ఏం తెలుస్తాయ‌ని ప్ర‌శ్నించాడు.

 

అంతేకాదు, అలాంటి సంస్థ‌లో ఉద్యోగంలోకి చేరేముందు.. ఉద్యోగులే స‌రైన నిర్ణ‌యం తీసుకున్నామా? అని ఆలోచించుకుని ఉంటే.. ఈ ప‌రిస్థితి వ‌చ్చేదికాద‌ని పుంఖాను పుంఖాలుగా నీతులు వ‌ల్లించారు. మ‌రి ఇప్పుడు స్ట్రింగ‌ర్‌గా, రిపోర్ట‌ర్‌గా అనుభ‌వంతో వ‌చ్చి సంస్థ‌ను న‌డిపిస్తున్నాన‌ని, ఉద్యోగుల బాధ‌లు, ఫీల్డ్ క‌ష్టాలు త‌న‌కు తెలిసినంత‌గా ఎవ‌రికీ తెలియ‌ద‌ని వారం వారం విల‌పించే ఆర్కే.. మ‌రి ఇప్పుడు చేసింది ఫ‌క్తు వ్యాపారం కాదా?  ఉద్యోగుల‌ను న‌డివీధిలో నిల‌బెట్ట‌లేదా?  వారికి క‌నీస స‌మాచారం కూడా ఇవ్వ‌కుండా వేత‌నాల్లో కోత పెట్ట‌లేదా? అందుకే ఆర్కే చేసింది అరాచ‌కం కాక మ‌రేమ‌నాలి!! అంటున్నారు మీడియా విశ్లేష‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: