క‌రోనా దెబ్బ‌కు భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ ఛిన్నాభిన్న‌మైంది. రిటైల్ నుంచి రియ‌ల్ రంగం వ‌ర‌కు సంక్షోంభంలోకి జారుకున్నాయి. దాదాపు నెల‌రోజులుగా 137కోట్ల భార‌త ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమితం కావ‌డంతో వ్య‌వ‌స్థ‌ల‌న్నీ స్తంభించిపోయాయి. ఆ మాటాకొస్తే ప్ర‌పంంచ‌మే స్తంభించింది. అనేక అభివృద్ధి చెందిన‌ దేశాలు భార‌త్‌క‌న్నా చాలా ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నాయి. భార‌త వ్యాపారం, సేవ రంగాల ప‌నితీరుపై తీవ్ర ప్ర‌భావం ప‌డింది. ఫ్యాక్టరీలకు వచ్చే ఆర్డర్లు ఆగిపోయి, కార్మికులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. త‌యారీ రంగం బాగా దెబ్బ‌తింది. లాక్‌డౌన్ త‌ర్వాత ఈ రంగం సాధార‌ణ స్థాయికి చేరుకోవాలంటే చాలా స‌మ‌య‌మే ప‌డుతుంద‌న్న‌ది కాద‌న‌లేని నిజం. 

 

తయారీ రంగానికి ఎగుమతులకు ఊతం లభిస్తే సాధ్య‌మైనంత త్వ‌రగా కోలుకోవ‌డానికి అవ‌కాశం ఉంది. అయితే కేంద్ర ప్ర‌భుత్వం ఏమేర‌కు చ‌ర్య‌లు తీసుకుంటుంది..అంత‌ర్జాతీయ పరిస్థితులు ఎంత‌వ‌ర‌కు స‌హ‌క‌రిస్తాయి..ఈ క‌రోనా ఎప్ప‌టిలోగా క‌ట్ట‌డిలోకి వ‌స్తుంది...ముఖ్యంగా లాక్‌డౌన్ ఎప్పుడు తొల‌గిపోతుంద‌న్న అనేక ప్ర‌శ్న‌ల‌కు ముందు స‌మాధానం దొర‌కాల్సి ఉంది. ఎగుమ‌తులు పెర‌గాలంటే.. దానికి తగ్గట్టుగా దేశీయ పెట్టుబడులు పెరగాలి. విదేశీ ఇన్వెస్టర్లు కూడా దేశంపై మళ్లీ దృష్టి సారించాలి. ఇక్క‌డ ప‌రిస్థితుల‌న్నీ చ‌క్క‌బ‌డ్డ‌యాన్న న‌మ్మ‌కం వారిలో క‌ల‌గాల్సి ఉంటుంది. అలాగే  ఫ్యాక్టరీలు కూడా నిరంతరాయంగా పనిచేయాల్సి ఉంటుంది.

 

అంతకంటే ముందు విమానాల రాకపోకలు మునుపటిలాగే సాగాల్సి ఉంటుంది. విదేశీయులు ఇండియాలో కాలు పెట్టాలి, పర్యాటక, హోటల్ రంగం గాడిలో పడాలి. జనం హాయిగా తిరుగుతూ రోడ్లన్నీ కళకళలాడాల్సి ఉంటుంది. ఇదంతా జ‌రిగిన‌ప్పుడే భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ కుదుటప‌డే అవ‌కాశం ఉంటుంది. తయారీ రంగం పుంజుకోకపోతే మాత్రం వృద్ధి రేటు 1.5 శాతానికి పడిపోయే ప్రమాదం కూడా ఉందని ప్రపంప బ్యాంక్ విశ్లేషిస్తోంది. అదే జరిగితే… దేశంలో నిరుద్యోగం తాండవిస్తుంది.భారత వృద్ధి రేటు 2021 నాటికి కూడా 2.8 శాతం దాటడం కష్టమని ప్రపంచ బ్యాంక్ తేల్చేసింది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా వెంటనే వ్యవస్థను దారిలోకి తేవడం కుదరద‌న్న‌ది ఎవ‌రు కాద‌న‌లేని స‌త్యం.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: