దేశవ్యాప్తంగా కరోనా పై జనాలంతా కంగారు పడుతుంటే ఏపీ లో మాత్రం కరోనా ని మించి కరోడా పాలిటిక్స్ ఎన్నో జరిగిపోతున్నాయి. అసలు దేశానికీ వచ్చిన విపత్తు సంగతి మాకెందుకు మాకు కావాల్సింది రాజకీయమే అన్నట్టుగా ఇక్కడి రాజకీయాలు హీటెక్కిపోతున్నాయి. రాజకీయం అంటే రాజకీయమే.. ఇంకేమి మాకు అనవసరం అన్నట్టుగా ఏపీ రాజకీయాలు తయారయ్యాయి. ముఖ్యంగా కరోనాను కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. కిందపడ్డా... పై చేయి నాదే అన్నట్టుగా కరోనా పాలిటిక్స్ ఏపీలో చోటుచేసుకుంటున్నాయి. అసలు ఇప్పుడు కరోనాకి కాదు ఏపీ రాజకీయాలకు ట్రీట్ అవసరం అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు కానీ ప్రయత్నించడమే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. 

 


తెలుగుదేశం అధినేత చంద్రబాబు కరోనా సంగతి.. ప్రజల సంగతి పూర్తిగా మర్చిపోయాడు. తమకు కావాల్సింది నికార్సైన రాజకీయమే తప్ప... ఇంకేమి అక్కర్లేదు అన్నట్టుగా చెలరేగిపోతున్నారు. చంద్రబాబు ప్రధాని మోదికి ఫోన్ చేసాడో ... మోదీనే చంద్రబాబు సలహాలు అడిగేందుకు ఫోన్ చేసాడో తెలియదు .. అసలు వీరి మధ్య ఫోన్ సంభాషణ జరిగిందో లేదో తెలియదు కానీ చంద్రబాబు మాత్రం మోదీనే తనకు ఫోన్ చేసి కరోనా పై సలహాలు అడగ్గా తాను ఏం చేయాలో... ఎలా చేయాలో చెప్పేసాని చాలా ఆనందంగా చెప్పుకున్నాడు. అసలు ఎప్పుడో ఫోన్ వస్తే టీడీపీ అనుకూల మీడియాలో ఎప్పుడో ఆ వార్త ప్రచారం అవ్వడం అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అదంతా పక్కన పెడితే ... మొన్నటివరకు మోదీ వ్యవహారాలు అ నుంచి అం ఆహా వరకు చెప్పి తిట్ల పురాణం వినిపించిన బాబు ఇప్పుడు ఒక్క ఫోన్ కాల్ కే కేరింతలు కొట్టేస్తున్నాడు

 


ఇది ఇలా ఉంటే ఈ వ్యవహారంలోకి వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఎంట్రీ ఇచ్చాడు. బాబు గారి ఫోన్ కాల్ బండారాన్ని మొత్తం బయటపెట్టాడు. అంతేనా అంటే... ? బాబు గారు ఎంత గొప్ప మనిషో... ఎంత మేధావో ఉదాహారణలతో సహా చెప్పేసి బాబు గారి గొప్పతనం ప్రపంచానికి తెలియజేశాడు. బాబు ప్రపంచ స్థాయి వ్యక్తి అని చెప్పకనే చెప్పాడు. కొద్ది రోజుల క్రితం అమెరికా హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబెట్లు పంపించాల్సిందిగా కోరితే ససేమేరా అంటూ మారం చేసిన మోదీకి నచ్చ చెప్పి ఆ మాత్రలు అమెరికాకు పంపింది బాబేనని, ఆర్మీని రంగంలోకి దించకపోతే కరోనాతో చనిపోతారని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ను కూడా భయపెట్టింది బాబు గారేనని, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు వైరస్ సోకిన విషయాన్ని డాక్టర్లకు చెప్పింది కూడా  బాబు గారేనని విజయసాయి సెటైర్లు వేశారు. 

IHG


బాబు గారిలో ఇప్పుడప్పుడే మార్పు రాదని, ఆయన ప్రధాని ఫోన్ కాల్ విషయాన్ని కూడా వాడేసుకుంటున్నాడని మండిపడ్డారు. బాబు కి గొప్పలు చెప్పుకోవడం కొత్తేమి కాదని, గతంలో నోట్ల రద్దు అమాశాన్ని కూడా బాబు ఇలాగే వాడుకున్నాడని, ఇప్పుడు ఫోన్ కాల్ విషయంలోనూ బాబు అలాగే ప్రవర్తిస్తున్న మోదీ హుందాగా నడుచుకుంటున్నారని ఆయన అన్నారు. అయినా చంద్రబాబు లో మార్పు రాలేదని, మూడు జోన్ల పద్ధతి ప్రవేశ పెట్టాలని తానే మోదీకి లేఖ రాసినట్లు బాబు చెప్పుకోవడం సిగ్గుచేటని విజయసాయి విమర్శించారు. మోదీ మాట్లాడేవరకు వదిలిపెట్టకుండా ఓ ‘‘పాతికసార్లు ప్రాధేయపడి ఉంటే ఫోన్ చేసి ఉండొచ్చేమోనని విజయసాయి అన్నారు.అలాగే ఎప్పుడో మోదికి లేఖ రాస్తే ఆ విషయాన్ని ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదని, అదంతా బోగస్ అనే విషయం అర్ధం అవుతోంది అంటూ విజయసాయి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

IHG's Comments


అసలు బాబు కి మోదీ ఫోన్ విషయం పెద్దగా పట్టించుకొనవసరంలేదని, మోదీ ఎంతోమందికి ఫోన్ లు చేస్తున్నారని, కరోనా వ్యాప్తి చెందిన తరువాత ప్రధాని ఏదో ఒక సందర్భంలో పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, నర్సులతో పాటు, వైరస్ నుంచి కోలుకున్నవాళ్లందరికీ ఫోన్లు చేసి మాట్లాడుతున్నారని, అదంతా మోదీ గొప్పతనం అని విజయసాయి చెప్పుకొచ్చారు. ఈ విషయంలో టీడీపీ నేతలు సైతం ఎక్కడా తగ్గడం లేదు. మా బాబు గొప్ప వ్యక్తి కాబట్టే మోదీ ఫోన్ చేశారని, ఈ విషయంలో ఎందుకు వైసీపీ బాధపడిపోతుందో తెలియడం లేదు అంటూ ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా ఫోన్ కాల్ రాద్ధాంతం ఏపీలో రచ్చ రచ్చగా మారింది. ఇప్పుడు కరోనా విషయాన్ని కూడా మర్చిపోయి టీడీపీ ఫోన్ కాల్ గొప్పతనం చెప్పుకునే పనిలో నిమగ్నం అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: