చంద్రబాబునాయుడును ఉద్దేశించి ఇపుడిదే ప్రశ్న తాజాగా రాష్ట్రా రాజకీయాల్లో చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే కరోనా వైరస్ సంక్షోభం నేపధ్యంలో జగన్మోహన్ రెడ్డి వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలంటూ విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నాని డిమాండ్ చేస్తున్నాడు.  నిజంగా చంద్రబాబు కానీ లేకపోతే టిడిపి నేతల వ్యవహారశైలి కానీ చాలా విచిత్రంగా ఉంటుంది. కిందపడ్డా తమదే పై చెయ్యి అనే పద్దతిలో వ్యవహరిస్తుంటారు.

 

ఇపుడు  జరుగుతోంది కూడా అదే కాబట్టే వాళ్ళ వైఖరిపై చర్చలు జరుగుతోంది. తాము అధికారంలో ఉన్నపుడు ఎప్పుడూ చంద్రబాబు ప్రతిపక్షాలను లెక్క చేయలేదన్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో జరిగిన విషయాలను పక్కనపెట్టేసినా మొన్నటి ఐదేళ్ళలో ఏమి జరిగిందో అందరు చూసిందే.  ప్రత్యేకహోదా, విశాఖపట్నం రైల్వేజోన్, రాజధాని అమరావతి ఎంపిక, అమరావతి నిర్మాణం లాంటి ఏ ఒక్క విషయంలో కూడా  ప్రతిపక్షాలతో మాట్లాడలేదు. పైగా ప్రతిపక్షాలు అఖిలపక్ష సమావేశం పెట్టమని అడిగినా పట్టించుకోలేదు.

 

అలాంటి చంద్రబాబు ప్రతిపక్షంలోకి రాగానే అఖిలపక్ష సమావేశాల గురించి పదే పదే డిమాండ్ చేస్తుండటం చాలా విచిత్రంగా ఉంది. పైగా తాను చెప్పినట్లే ప్రభుత్వం నడవాలని కోరుకుంటుండటమే ఆశ్చర్యంగా ఉంది. జనాలు అధికారం అప్పగించారన్న  కారణంతోనే చంద్రబాబు తనిష్ట ప్రకారం నిర్ణయాలు తీసుకుని అమలు చేశాడు. మరి అదే జనాలు జగన్ కూడా అధికారం ఇచ్చారన్న విషయాన్ని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మరచిపోయాడు. అలాగే తాను చెప్పినట్లు జగన్ ఎందుకు వింటాడన్న కనీస ఇంగితాన్ని కూడా మరచిపోయాడు.

 

అంటే కిందపడ్డా పై చెయ్యి తనదే అని ఎలాగైనా నిరూపించుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నాడా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. సిఎం స్ధానంలో కూర్చున్న జగన్ దగ్గర తన ఆటలు సాగవన్న విషయాన్ని మరచిపోయి పదే పదే ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకనే తాను మాత్రమే కాకుండా అఖిలపక్ష సమావేశాల కోసం వివిధ పార్టీల నేతలతో పాటు  తమ నేతలతో కూడా డిమాండ్లు చేయిస్తున్నాడు. ఎంపి కేశినేని, యనమల, దేవినేని, బుచ్చయ్య, గద్దె లాంటి వాళ్ళు చేస్తున్న డిమాండ్లే చంద్రబాబు వైఖరికి నిదర్శనం.

మరింత సమాచారం తెలుసుకోండి: