కరోనా వైరస్ మహమ్మారి ప్రభావానికి బాగా బలైపోయిన దేశాల్లో అగ్రరాజ్యం అమెరికానే ముందుంది. వైరస్ బారినపడి మరణించిన వారిలో అమెరికా ప్రపంచ రికార్డును బీట్ చేసింది. మరణాలను కూడా రికార్డని చెప్పటం నిజంగా చాలా బాధాకరమనే  చెప్పాలి. కరోనా వైరస్ దెబ్బకు 24 గంటల్లో అమెరికా మొత్తం మీద  2671 మంది మరణించటం సంచలనంగా మారింది. నాలుగు రోజుల క్రితం మరణించిన 2500 మంది మరణించటమే రికార్డనుకున్నారు. కానీ మంగళవారం రాత్రి నుండి బుధవారం రాత్రి వరకు రికార్డయిన  2671 మరణాలతో తన రికార్డును అమెరికా తానే తిరగరాసినట్లయ్యింది.

 

ఏ ముహూర్తాన కరోనా వైరస్ చైనాలో పుట్టిందో కానీ అప్పటి నుండి ప్రపంచదేశాలు అల్లాడిపోతున్నాయి. ముందుగా చైనా నుండి యూరోపు దేశాలైన ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలతో పాటు ఇరాన్ కూడా పాకింది. అప్పటికి మిగిలిన ప్రపంచ దేశాల్లో కానీ అమెరికాలో కానీ వైరస్ ప్రభావం పెద్దగా లేదనే చెప్పాలి. అందుకనే మిగిలిన ప్రపంచం నిర్లక్ష్యం వహించాయి. అసలు ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు కూడా నిర్లక్ష్యం  చేయటంతోనే వైరస్ మొత్తం కమ్ముకునేసింది.

 

పై దేశాల్లో ఓ వారం రోజుల క్రితం వరకూ రోజుకు వెయ్యిమంది చొప్పున చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. వైరస్ తీవ్రతకు తట్టుకోలేక పై దేశాలు చేతులెత్తేశాయనే చెప్పాలి. అందుకనే బాధితులు, మృతుల సంఖ్య చాలా స్పీడుగా పెరిగిపోయింది. ఎప్పుడైతే పై దేశాల్లో వైరస్ తీవ్రతను గమనించిందో మన ప్రభుత్వం కాస్త ముందుగానే మేల్కొంది. అయితే అమెరికా మాత్రం అప్పటికి కూడా పట్టించుకోలేదు. ఆ నిర్లక్ష్యమే ఇపుడు అమెరికా కొంప ముంచేస్తోంది. చైనాతో పాటు పై దేశాల నుండి జనాలు అమెరికాకు వచ్చేసినా ఎవరు అడ్డు పెట్టలేదు.

 

దాంతో అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, వాషింగ్టన్, డల్లాస్ లాంటి రాష్ట్రాల్లో వైరస్ ఎక్కువైపోయింది. ఇక్కడే ఎందుకు ఎక్కువైపోయిందంటే పై రాష్ట్రాల్లో చైనా వాళ్ళు ఎక్కువుంటున్నారు కాబట్టే. పై రాష్ట్రాల్లో కూడా న్యూయార్క్, న్యూజెర్సీలో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. అందుకనే పై రెండు రాష్ట్రాల్లో బాధితులు, మృతులు ఎక్కువగా ఉన్నారు. అమెరికా మొత్తం మీద 7 లక్షల మంది బాధితులు, సుమారు 30 వేలమంది చనిపోయిన విషయం తెలిసిందే.

 

మిగిలిన రాష్ట్రాల సంగతి పక్కన పెట్టేస్తే ఒక్క  న్యూయార్క్ లో నే బాధితులు సుమారు 2 లక్షలు, మరణించిన వారు దాదాపు 16 వేలమందున్నారు. అమెరికాలో వైరస్ విపరీతంగా విజృంభిస్తోంది కాబట్టే బాధితులు, మరణాలు కూడా రికార్డుల మీద రికార్డులు నమోదవుతున్నాయి. బుధవారం 2671 మంది చనిపోవటమే రికార్డనుకుంటే ఈ రికార్డు ఇంతటితో ఆగేట్లు కూడా కనబడటం లేదు. అంటే ప్రపంచం మొత్తం మీద ఒక్క రోజులు ఇంతమంది చనిపోయినట్లు  ఏ దేశంలోను రికార్డు కాలేదంటేనే బాధగా ఉంది.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: