అందితే జుట్టు...అంద‌కుంటే కాళ్లు ప‌ట్టుకోవ‌డం అన్న‌ది పాకిస్థాన్‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. భార‌త్‌తో ఏ రంగంలోనూ పోటీ ప‌డ‌లేని పాకిస్థాన్ మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తూ వ‌స్తోంది. తిన‌డానికి తిండిలేకున్నా..అప్పులు చేసి మ‌రీ ఆయుధాల‌ను కొనుగోలు చేస్తూ ఉంటుంది. ఇందులో అక్క‌డి సైన్యాధికారుల క‌మీష‌న్ల క‌క్కుర్తి కూడా ఉంద‌న్న‌ది వాస్త‌వం.  ఈ విష‌యం అలా ఉంచితే..ఇప్పుడు ప్రాణాలు పోతున్నాయ్ మ‌హాప్ర‌భో..కాస్త మందుబిళ్ల‌లు ఇవ్వండి అంటూ భార‌త్‌ను పాకిస్థాన్ అర్జిస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా భార‌త్ 57 దేశాలకు హైడ్రాక్సి క్లోరిఫిన్ టాబ్లెట్ల‌ను ఎగుమ‌తి చేస్తున్న విష‌యం తెలిసిందే. 

 

ఇందులో అమెరికా, బ్రిట‌న్‌, ఫ్రాన్స్‌, ఇట‌లీ, స్పెయిన్‌ స‌హా అనేక గ‌ల్ఫ్ దేశాలు కూడా ఉన్నాయి. అయితే విచిత్రంగా పాకిస్థాన్ కూడా ఇప్పుడు కాళ్లవేళ్ల ప‌డ‌టం...భార‌త్‌ను మెత్త‌ప‌డేలా చేసేందుకు రాయ‌బారాలు మొద‌లుపెట్టింది. ఇందులో ఓ చిత్ర‌మైన అంశం దాగుంది. అదేంటంటే..పాకిస్థాన్‌లో కూడా మ‌లేరియా నివార‌ణ‌కు ఉప‌యోగించే హైడ్రాక్సిక్లోరిఫిన్ త‌యారీ సంస్థ‌లు ఉన్నాయి. స్వాతంత్ర్యానికి పూర్వం  భార‌త్‌లో అంత‌ర్భాగంగా ఉన్న‌ప్ప‌టి నుంచి కొన్ని సంస్థ‌లు మందుల త‌యారీని అక్క‌డ కొన‌సాగిస్తున్నాయి. ఇప్పుడు పాకిస్థాన్‌లో కూడా ఈ మందుల నిల్వ‌లు బాగానే ఉన్నాయి.

 

 గ‌తంలో ఇరాన్‌, ట‌ర్కీతో పాటు కొన్ని దేశాలు పాకిస్థాన్కు ఆర్డ‌ర్లు ఇచ్చేవి. అయితే ప్ర‌స్తుతం క‌రోనాతో నెల‌కొన్న ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో పాకిస్తాన్ త‌యారు చేసిన మందుల‌పై ట‌ర్కీ, ఇరాన్ దేశాలు అనుమానం వ్య‌క్తం చేస్తూ ఆర్డ‌ర్ల‌ను నిలిపివేయ‌డం గ‌మ‌నార్హం. అంత‌కంటే ఘోర‌మైన విష‌యం ఏంటంటే పాకిస్థాన్ ప్ర‌జానీకం కూడా అక్క‌డ త‌యారైన మందుల్లో నాణ్య‌త ఉండ‌ద‌ని బ‌లంగా విశ్వసిస్తూ త‌మ‌కు భార‌త్ నుంచి బిళ్ల‌లు తెప్పించాల‌ని కోరుతుండ‌టం. మాకు అనుబాంబులు వ‌ద్దు...ప్రాణాలు కాపాడే మందు బిళ్ల‌లు ఇవ్వండి అంటూ  ప్ల‌కార్డులు ప‌ట్టుకుని మ‌రీ నిన‌దిస్తున్నారు. దీంతో చేసేదేమీలేక పాకిస్థాన్ భార‌త్‌ను బ‌తిమాల‌డం మొద‌లుపెడుతోంది. మరీ శ‌త్రు దేశానికి బిళ్ల‌లు ఇస్తుందా భార‌త్ అంటే..? క‌చ్చితంగా ఇస్తుంది...ఎందుకంటే..ఇది క‌ర్మ‌భూమి..ధ‌ర్మ‌భూమి..శ‌త్రువైన స‌రే..ఆప‌ద‌లో ఉన్నాం..ఆదుకోమ‌ని అర్థిస్తే త‌ప్ప‌క చేయాలి...ఇప్పుడు భార‌త్ అదే చేస్తోంది..!

 


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: