తెలుగుదేశంపార్టీ గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ మరో సంచలనానికి రెడీ అవుతున్నాడా ? ఇపుడిదే అంశంపై రాజకీయవర్గాల్లో చర్చ జోరుగా జరుగుతోంది. కొందరు ఏమి మాట్లాడినా సంచలనమే అవుతుంది. అటువంటి వారిలో వల్లభనేని వంశీ కూడా ఒకడు. తన ఫేస్ బుక్ వాల్ పై వంశీ పెట్టిన పోస్టుతోనే రకరకాల ఊహాగానాలు మొదలైపోయాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ’తన 14 ఏళ్ళ రాజకీయ ప్రస్ధానంలో  తన వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు’ అనే పోస్టు పెట్టాడు.

 

ఎప్పుడైతే నెటిజన్లు, అభిమానులు పోస్టును చూశారో వెంటనే అదే పోస్టును  వైరల్ గా మార్చేయటంతో అసలు విషయం బయటపడింది. అసలు ఇంత హఠాత్తుగా వంశీ ఇటువంటి పోస్టు ఎందుకు పెట్టాడనే విషయం ఎవరికీ అర్ధం కావటం లేదు. 2019 ఎన్నికల్లో టిడిపి తరపున గెలిచిన తర్వాత పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో విభేదలు మొదలయ్యాయి. వీళ్ళద్దరి మధ్య విభేదాలకు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావే కారణమని పార్టీలోనే ప్రచరం జరుగుతోంది. టిడిపి అధికారంలో ఉన్నపుడు దేవినేని-వల్లభనేని మధ్య చాలా విషయాల్లో గొడవలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే.

 

సరే మొత్తానికి పార్టీ ఓడిపోవటంతో వీళ్ళ మధ్య వివాదాలు సమసిపోతాయనే అనుకున్నారు. కానీ ఆశ్చర్యంగా గొడవలు మరింత పెరిగాయి. దాంతో టిడిపిలో ఇమడలేని పరిస్ధితిలు తలెత్తాయి. అదే సమయంలో చంద్రబాబు కూడా దేవినేని కారణంగా  వంశీని దూరంగా పెట్టడం మొదలుపెట్టాడు. పార్టీలో తన పరిస్ధితిపై    చంద్రబాబును టార్గెట్ చేస్తు ఆరోపణలు మొదలుపెట్టాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డిని కూడా కలవటంతో వంశీని పార్టీ నుండి సస్పెండ్ చేశారు.

 

తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టిడిపితో కలిసి కూర్చోలేనని చెప్పిన వంశీ తనకు ప్రత్యేకంగా సీటు కేటాయించమని అడిగాడు. ఎంఎల్ఏ కోరికమేరకు స్పీకర్ కూడా ప్రత్యేకంగా ఓ సీటు కేటాయించిన విషయం అందరూ చూసిందే. అప్పటి నుండి  టిడిపి ఎంఎల్ఏలు, నేతలు వంశీని టార్గెట్ చేసుకున్నారు. అయితే ఎంఎల్ఏ వైసిపిలో కూడా చేరలేదు.  అంటే ఇటు వైసిపిలో చేరక అటు టిడిపి నుండి సస్పెండ్ అయిన వంశీ ఒంటరిగానే కంటిన్యు అవుతున్నాడు.

 

మరి ఇలాంటి సమయంలో ఫేస్ బుక్ ద్వారా  వంశీ అందరికీ ధన్యవాదాలు చెప్పటంతో అందరు ఆశ్చర్యపోయారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఫేస్ బుక్ లో వంశీ సదరు పోస్టును తొలగించాడు. మరి వంశీ ఆ పోస్టును ఎందుకు పెట్టాడు ? ఎందుకు తొలగించాడు ? అనే విషయం అర్ధంకాక జనాల్లో కన్ఫ్యూజన్ పెరిగిపోతోంది. వంశీ విషయంలో అసలు ఏమి జరుగుతోందో కూడా ఎవరికీ అర్ధం కావటం లేదు. మరి ఈ అయోమయానికి వంశీనే తెరదించాల్సుంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: