ప్ర‌భుత్వం క‌నీసం జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం లేదు.  రేయింబ‌వ‌ళ్లు క‌ష్టించి ప‌నిచేస్తున్న వైద్యులు, పారిశుద్ధ్య కార్మికుల‌కు క‌నీసం మాస్కులు కూడా పంచ‌డం లేదు. ఇలా అయితే, క‌రోనా వ్యాపించ‌దా?!- ఇదీ ద‌మ్మున్న మీడియాలో నిముషానికోసారి ఏపీ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తున్న తీరు. నిజ‌మే త‌ప్పులు ఉంటే చెప్పాల్సిం దే. అది మీడియా బాధ్య‌త కూడా దీనిని ఎవ‌రూ త‌ప్పుప‌ట్ట‌రు. అయితే, త‌ప్పులు ఎత్తి చూపుతున్న వారే త ప్పులు చేస్తే.. వారి నైతిక‌త ప్ర‌శ్నార్థ‌కం కాదా? అనేది ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

 

ఈ మాట ఎందుకు అనాల్సి వ‌స్తోందంటే..ప్రపంచానికి, ప్ర‌భుత్వాల‌కు నీతులు చెప్పే ద‌మ్మున్న మీడియా అధిప‌తి ఆర్కే.. త‌న విష‌యానికి వ‌చ్చే స‌రికి మాత్రం గురివింద గింజ‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నారట‌! ఇది సోష‌ల్ మీడియా అంటున్న మాట‌. ఎందుకంటే.. ఏపీ , తెలంగాణ రాష్ట్రాల్లో ప్ర‌తి జిల్లాకు ఒక యూనిట్ ఉంది. అదే స‌మ‌యంలో ఏబీఎన్ స్టూడియో కూడా ఉంది. వీటిలో నిత్యం అనేక మంది ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. క‌రోనా లాక్‌డౌన్ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్నా.. ఈ కార్యాలయాల్లో మాత్రం మీడియా ప‌నులు జ‌రుగుతున్నాయి.

 

ప్ర‌పంచానికి వార్త‌లు అందిస్తున్నారు. ఫీల్డ్ రిపోర్ట‌ర్లు, డెస్క్ రిపోర్ట‌ర్లు, ఫొటో గ్రాఫ‌ర్లు, ప్రింటింగ్ సెక్ష‌న్ ఉద్యో గులు ఇలా అనేక మంది నిత్యం ఆఫీసుల‌కు వ‌స్తున్నారు. మ‌రి ఆయా ప్రాంతాల్లో క‌రోనా వ్యాపించే ప్ర‌మాదం లేదా?  ఉద్యోగుల్లో ఒక్క‌రికి క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్నా.. మిగిలిన వేలాది మందికి వ్యాపించ‌దా ? అంటే ఖ‌చ్చితంగా వ‌స్తుంద‌నే చెప్పాలి. మ‌రి దీనిని దృష్టిలో పెట్టుకుని ఆ ఆఫీసుల్లో క‌నీస జాగ్ర‌త్త‌లు తీసుకున్నారా? అంటే.. తాజాగా అందిన‌స‌మాచారం ప్ర‌కారం ఒక్క‌టంటే ఒక్క ఆఫీసులోనూ మాస్కులు లేవు, శానిటైజ‌ర్లు లేవు. క‌నీసం.. ప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణం కూడా లేద‌ని తెలుస్తోంది. ఈ విష‌యం ఆ సంస్థ‌ల్లో ప‌నిచేస్తోన్న ఉద్యోగులే తోటి మీడియా మిత్రుల‌కు చెప్పుకుని వాపోతున్నార‌ట‌.

 

ఇక్క‌డ అత్యంత కీల‌క‌మైన విష‌యం ఏంటంటే.. తెలంగాణ‌లోని మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా ఆంధ్ర‌జ్యోతి ఎడిష‌న్ బీఎం కుటుంబ‌స‌భ్యుల్లో ఒక‌రికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. అంటే.. ఆయ‌న ద్వారా ఆఫీస్‌లోనూ ఇది వ్యాపించి ఉండాలి క‌దా?! ఈ విష‌యం వెలుగు చూసిన త‌ర్వాత కూడా ఆర్కే ఎక్క‌డా ముందు జాగ్ర‌త్త‌లు తీసుకోలేదు. ఉద్యోగులకు మాస్కులు ఇవ్వ‌డంలో కానీ, శానిటైజ‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌డంలో కానీ, మిగిలిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డంలో కానీ ఆయ‌న వ‌ల్ల‌మాలిన అల‌స‌త్వం వ‌హిస్తున్నారంటున్నారు.

 

డ‌బ్బులు అయిపోతాయ‌నే బెంగో .. లేక‌.. పోతే ఉద్యోగులే క‌దా పోయేది! అనుకుంటాడో ఆయ‌నకే తెలియాలి! ఏదేమైనా.. నీతులు చెప్ప‌డానికి మాత్ర‌మే ఉన్నాయ‌ని మాత్రం నిరూపిస్తున్నాడని అంటున్నారు విమ‌ర్శ‌కులు. చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు ఆయ‌న అండ‌తో వెన‌కేసుకున్న కోట్లు ఎక్క‌డ దాచావ్ ?  ఉద్యోగుల‌కు మాస్క్‌లు ఇవ్వ‌లేనంత బీదోడివా ?  అలాంట‌ప్పుడు ఆ నీతులు రాత‌లెందుకు ? అన్న విమ‌ర్శ‌లు ఇప్పుడు ఆర్కేపై తీవ్రంగా ఉన్నాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: