ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసుల‌కు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ విడుద‌ల చేస్తున్న హెల్త్‌బులిటెన్ల‌లో గంద‌ర‌గోళం నెల‌కొంటోంది. డ్యాష్‌బోర్డుల్లోని వెల్ల‌డిస్తున్న కేసుల‌కు వివ‌రాల‌కు...హెల్త్‌బులిటెన్ల‌లో పేర్కొంటున్న కేసుల సంఖ్య‌కు దాదాపు 8000 కేసులు తేడా క‌నిపించ‌డంతో ఈ విష‌యంపై పెద్ద దుమారమే రేగుతోంది. ప్ర‌భుత్వం కావాల‌నే కేసుల సంఖ్య‌ను దాస్తోంద‌న్న విమర్శ‌లను ప్ర‌తిప‌క్ష టీడీపీ నాయ‌కులు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కూడా ప్ర‌భుత్వం ఎందుకు ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్ట‌త ఇవ్వ‌డం లేద‌ని నిల‌దీశారు.

 

 అయితే ఈ గంద‌రగోళానికి చెక్‌పెట్టాల్సిన వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి ఆళ్ల‌నాని మీడియాకు కూడా బ్రీఫింగ్‌తో స‌రిపెడుతుండ‌టంపై విమ‌ర్శ‌లు మ‌రింత ఎక్కువ‌వుతున్నాయి. వాస్త‌వానికి క‌రోనా అనేది ఇప్పుడు అతిసున్నితమైన అంశం. అది రాష్ట్ర ప్ర‌భుత్వానికి తెలియ‌నిది కాదు. అయితే ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న భ‌యాల‌ను తొల‌గించాల్సిన బాధ్య‌త ఖ‌చ్చితంగా ప్ర‌భుత్వంపై ఉంటుంది. ప్ర‌తిప‌క్ష హోదాలో ఉన్న టీడీపీ ప్ర‌శ్నించిన అంశాల‌పై పిన్ టుపిన్‌గా స‌మాధానం ఇచ్చి ప్ర‌జ‌ల అనుమానాల‌ను నివృత్తి చేయాల్సి ఉంది. అలా చేయ‌ని ప‌క్షంలోనే నిజంగానే ప్ర‌భుత్వం ఏదో దాస్తోంద‌న్న అనుమానాల‌కు బ‌లం చేకూర్చిన‌ట్ల‌వుతుంది. 

 

వాస్త‌వానికి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ప‌నిచేస్తున్న ఈటెల రాజేంద‌ర్ ఎంతో స్ఫూర్తిదాయ‌కమైన ప‌నితీరును క‌న‌బ‌రుస్తున్నారు.ఒక‌టికి రెండు సార్లు వివ‌రాల‌ను చెక్ చేసుకున్నాక అధికారికంగా వివ‌రాల‌ను మీడియాకు వెల్ల‌డించి ఎలాంటి గంద‌ర‌గోళం నెల‌కొన‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతున్నారు. ప్ర‌భుత్వం లెక్క‌లు దాస్తోంద‌ని ఒక‌టి రెండు సంద‌ర్భాల్లో ఆరోప‌ణ‌లు వ‌చ్చిన వెంట‌నే ఆయ‌న మ‌రునాడు విలేఖ‌రుల స‌మావేశాల్లో వివ‌ర‌ణ ఇచ్చారు. దీంతో గంద‌ర‌గోళానికి తెర‌ప‌డిన‌ట్ల‌యింది. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అది జ‌ర‌గ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వ ధోర‌ణిలో మార్పు క‌నిపిస్తుందో లేదో చూడాలి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: