వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌తీమ‌ణిగా విజ‌య‌మ్మ జీవితంలో కీల‌క పాత్ర‌.. త‌మ‌కంటూ.. సొంతంగా ఏర్పాటు చేసుకున్న పార్టీ నుంచే మొద‌లైందే ఆశ్చ‌ర్యం లేదు. నిజానికి అప్ప‌టి వ‌ర‌కు ఇంటికే ప‌రిమిత‌మైన ఇల్లాలుగా ఆమె త‌న పాత్ర‌ను నిర్విరామంగా నిర్వ‌ర్తించిన విజ‌య‌మ్మ‌.. త‌ర్వాత అనూహ్య‌రీతిలో పార్టీకి గౌర‌వ అధ్య‌క్షు రాలుగా మారారు. నిజానికి గౌర‌వ అధ్య‌క్షురాలు.. అంటే.. పేదో పేప‌ర్ మీద రాసుకునేందుకు ప‌నికి వ‌చ్చే ప‌ద‌వి అనుకునే వారు అప్ప‌ట్లో చాలా మంది. అయితే, వారి అంచ‌నాల‌ను భిన్నంగా మారుస్తూ.. విజ‌య‌మ్మ త‌న‌దైన శైలిని అవ‌లంబించారు.



పార్టీలో లుక‌లుక‌లు వినిపించినా.. త‌న కుమారుడు జ‌గ‌న్‌ను విధిలేని ప‌రిస్థితిలో జైలు జీవితం గ‌డ‌పాల్సి వ‌చ్చినా.. గౌర‌వ అధ్య‌క్షురాలిగా ముందుండి పార్టీని న‌డిపించారు. ఇక‌, ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఆమె పాత్ర గ‌ణ‌నీయంగా క‌నిపించింది. వ‌య‌సుతో సంబంధం లేకుండా ఆమె ప్ర‌జా క్షేత్రంలో క‌లియ‌దిరిగారు. బ‌స్సు యాత్ర‌లు చేశారు. ప్ర‌జా స‌మ‌క్షంలో ప్ర‌సంగాల ద్వారా ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకున్నారు. 2014 నుంచి 2019 వ‌ర‌కు త‌న పాత్ర‌ను ద్విగుకృతం చేసుకున్నారు. ఎక్క‌డ త‌న అవ‌స‌రం ఉన్నా.. వెంట‌నే వాలిపోయారు. పార్టీ ప్లీన‌రీలోను, జ‌గ‌న్ చేసిన అనేక నిరాహార దీక్ష‌ల్లోనూ ఆమె పాలు పంచుకున్నారు. త‌న‌దైన శైలిలో ప్ర‌సంగించి పార్టీ లైన్‌ను ఆవిష్క‌రించారు.



ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డ‌మే వైఎస్ కుటుంబానికి ప‌ర‌మావ‌ధి ఉన్న సూత్రాన్ని కీల‌కంగా ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డంలో స‌క్సెస్ అయ్యారు. ఎక్క‌డా నిరాశ చెంద‌లేదు. అలాగ‌ని ఎవ‌రితోనూ వ్య‌క్తిగ‌తంగా విభేదించ‌లేదు. ఏది చెప్పాలన్నా.. ప్ర‌జాక్షేత్రాన్నే న్యాయ‌స్థానంగా ఎంచుకున్నారు., త‌న మ‌న‌సులో ఏమున్నా.. ప్ర‌జ‌ల‌కే చెప్పుకొన్నారు. అదే స‌మయంలో పార్టీలో భిన్న‌మైన కోణాల్లో ఉన్న నాయ‌కుల‌ను కూడా ఒకే తాటిపైకి తీసుకువ‌చ్చారు. ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌, ముందు కూడా త‌న పాత్ర‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించా రు విజ‌య‌మ్మ‌. ఒక విజ‌యం సాధించేందుకు ఎంత క‌ష్ట‌ప‌డాలో అంత‌కు మించి క‌ష్ట‌ప‌డ్డారు. త‌న కుమా ర్తె, జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల‌ను వెంట‌బెట్టుకుని రోజుల త‌ర‌బ‌డి ప్ర‌జాక్షేత్రంలో నిలిచి పోరాడారు.



రాజ‌కీయాల ‌కు తాను కొత్తే అయినా.. ప్ర‌జ‌ల‌కు మాత్రం కొత్త‌కాద‌ని నిరూపించుకున్నారు. ఆ విశ్వాస‌మే ఆమెను పార్టీలోనూ ఉన్న‌త‌స్థానానికి చేర్చింది. నేటికీ అనేక మంది నాయ‌కులు త‌మ‌కు ఏదైనా క‌ష్టం వ‌స్తే .. అమ్మా! అంటూ విజ‌య‌మ్మ‌ను ఆశ్ర‌యించి ఉప‌శ‌మ‌నం పొందుతున్నారంటే.. ఆమె రాజ‌కీయంగా ఎన్ని మెట్లు ఎదిగారో అర్ధ‌మ‌వుతుంది. ఆమెను న‌మ్ముకున్న వారికి ప్ర‌భుత్వంలోనూ పార్టీలోనూ ఏలోటూ లేకుం డా చూసుకుంటూ.. గౌర‌వ అధ్య‌క్షురాలు.. అన్న ప‌దానికి నిర్వ‌చనంగా మారిన విజ‌య‌మ్మ పుట్టిన రోజున ఆమెకు శుభాకాంక్ష‌లు చెప్ప‌డం విధి..!  

మరింత సమాచారం తెలుసుకోండి: