దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ . రాజ‌శేఖ‌ర్ రెడ్డిని న‌మ్ముకుంటే వాళ్ల జీవితాలు ఎంతో ఉన్న‌త స్థానాల‌కు వెళ్లిపోతాయ‌న‌డంలో సందేహం లేదు. న‌మ్ముకున్న వాళ్ల‌కు ఎప్ప‌ట‌కి అన్యాయం చేయ‌ని చరిత్ర వైఎస్ ఫ్యామిలీది. కొన్ని సంవ‌త్స‌రాల పాటు వైఎస్‌ను న‌మ్ముకుని ఆయ‌న వెంట ఉన్న‌వాళ్ల‌కు... ఆయ‌న్ను న‌మ్ముకుని రాజ‌కీయం చేసిన వాళ్ల‌కు ఎంతో మందికి భ‌విష్య‌త్తు ల‌భించింది. సామాన్యులు సైతం కీల‌క ప‌ద‌వులు అధిరోహించారు. అలాగే ఇప్పుడు ఏపీలో మంత్రులుగా ఉన్న వాళ్లు, ఎమ్మెల్యేలు సైతం చాలా మంది వైఎస్‌ను, ఆయ‌న కుటుంబాన్ని న‌మ్ముకుని వ‌చ్చిన వాళ్లే... ఎదిగిన వాళ్లే.

 

వైఎస్ కుటుంబాన్ని న‌మ్ముకున్నోళ్ల‌కు ఎంత న్యాయం జ‌రుగుతుందో ?  వాళ్ల‌ను ఆ ఫ్యామిలీ ఎప్ప‌ట‌కి మ‌రువ‌దు అనేందుకు ప్ర‌స్తుత మంత్రి పిల్లి సుభాష్ చంద్ర‌బోసే సాక్ష్యం. వైఎస్‌ను న‌మ్ముకున్న ఆయ‌న‌కు వైఎస్ మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. అయితే బోస్ త‌న మంత్రి ప‌ద‌వి వ‌దులుకుని వైఎస్ మ‌ర‌ణాంత‌రం జ‌గ‌న్ వెంట న‌డిచారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న ఎమ్మెల్యే ప‌ద‌విని సైతం వ‌దులుకున్నారు. ఎమ్మెల్యే ప‌ద‌విని వ‌దులుకున్న బోస్ 2012 ఉప ఎన్నిక‌ల్లో అంద‌రూ గెలిచినా కూడా ఆమె మాత్రం ఓడిపోయారు. 

 

ఆ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ జైలులో ఉండ‌డంతో విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల ఇద్ద‌రే రాష్ట్రం అంత‌టా తిరిగి ప్ర‌చారం చేశారు. ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ ఘ‌న‌విజ‌యం సాధించింది. ఒక్క న‌ర‌సాపురం, రామచంద్రాపురంలో మాత్ర‌మే ఓడింది. తెలంగాణ‌లో ప‌ర‌కాల సీటు ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మ నేప‌థ్యంలో ఓడిపోయింది. ఆ త‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లోనూ బోస్ రామచంద్రాపురంలో ఓడిపోయారు. ఇక మొన్న ఎన్నిక‌ల్లో వైసీపీ ఘ‌న‌విజ‌యం సాధించింది. అయితే రామ‌చంద్రాపురం నుంచి మండ‌పేట‌కు మారిన బోస్ అక్క‌డ మూడోసారి ఓడిపోయారు.

 

అయితే త‌మ కుటుంబాన్ని న‌మ్ముకున్న నిజాయితీ ప‌రుడు అయిన బోస్‌ను విజ‌య‌మ్మ గుర్తు పెట్టుకుని... ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని సూచించారు. అయితే జగ‌న్‌కు బోస్ గుర్తులేర‌ని కాదు... విజ‌యమ్మ బోస్‌ను గుర్తు పెట్టుకుని మూడుసార్లు ఓడినా మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని సూచించ‌డ‌మే వైఎస్ ఫ్యామిలీని న‌మ్ముకున్నోళ్ల‌ను వాళ్లు ఎంత‌లా గుండెల్లో పెట్టుకుంటారు అనేందుకు చ‌క్క‌టి నిద‌ర్శ‌నం.

మరింత సమాచారం తెలుసుకోండి: