జ‌నహృద‌య నేత వైఎస్సార్ అకాల మ‌ర‌ణం ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను దుఃఖ‌సాగ‌రంలోకి నెట్టింది. ఆయ‌న మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక ఎన్నో గుండెలు ఆగిపోయాయి. ఆయ‌న రాజ‌కీయ వార‌సుడిగా జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని ప్ర‌క‌టించాల‌ని జ‌నం నుంచి వ‌చ్చిన నినాదాన్ని అప్ప‌టి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప‌ట్టించుకోలేదు. ఇక కిర‌ణ్‌కుమార్‌రెడ్డి, రోశ‌య్య‌తోపాటు తెలంగాణ‌కు చెందిన కొంత‌మంది కాంగ్రెస్ నేత‌లు సోనియాగాంధీకి రాంగ్ ఫీడ్ ఇచ్చార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అప్ప‌టికే క్రియాశీల‌క రాజ‌కీయాల్లో దూసుకుపోతున్న వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి సీఎం ప‌ద‌వికి అన్నివిధాలుగా యోగ్యుడ‌న్న అభిప్రాయం కాంగ్రెస్‌లోని చాలామంది నేత‌లు అంగీక‌రించార‌ట‌. 

 

నిజానికి ఆరోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని సీఎం చేస్తే తెలుగు రాష్ట్రాల చ‌రిత్ర మ‌రోలా ఉండేదేమో..! అయినా జ‌ర‌గాల్సింది ముందే రాసిపెట్టిన‌ప్పుడు అలా ఎందుకు జ‌రుగుతుంది. పొమ్మ‌న‌లేక పొగ‌బెట్టినట్లు..పార్టీలో ఉంటూనే జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని అణిచివేయాల‌ని అధిష్ఠానం ఎన్నో కుట్ర‌లు చేసింద‌న్న‌ది నిజ‌మ‌ని అప్ప‌టి కాంగ్రెస్‌,,,ఇప్ప‌టి వైసీపీ నేత‌లు చెబుతుంటారు. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లోనే జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావాల్సి వ‌చ్చింద‌ని చెబుతున్నారు. వైసీపీ ఆరంభించాక‌...ఒక్కొక్క‌రుగా నేత‌లు వ‌చ్చి చేరారు. వంద‌ల్లో మొద‌లైన అభిమానం..వేల‌ల్లోకి మారింది. కొద్దిరోజుల్లోనే ల‌క్ష‌ల మంది అభిమానం సొంత‌మంది...ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో అయితే కోట్ల మంది ఓట్ల రూపంలో జ‌గన్మోహ‌న్‌రెడ్డిపై, వైఎస్సార్ కుటుంబంపై త‌మ అభిమానాన్ని చాటుకున్నారు.


జ‌గ‌న్ పార్టీ పెట్టాక అనేక ఆరోప‌ణ‌లు చేశాయి. ఎక్వ‌యిరీల పేరుతో నెల‌ల త‌ర‌బ‌డి పోలీస్ క‌స్ట‌డీలో కూడా కొన‌సాగాల్సి వ‌చ్చింది. కోర్టు మెట్లు ఎక్కాల్సి వ‌చ్చింది. జైలుకు కూడా పంపారు. మ‌రొక‌రైతే మ‌నోధైర్యం కోల్పోయి..బిక్క‌చచ్చి కాళ్లావేళ్లాప‌డి..కేసులు మాఫీ చేయించుకుని అణిగిమ‌ణిగి ఉంటాన‌ని నాటి ప్ర‌భుత్వాల‌కు చెప్పేవారేమో. కాని జ‌న‌హృద‌య‌నేత జ‌గన్మోహ‌న్‌రెడ్డి ర‌క్తం మాత్రం మ‌రిగిపోయింది. అణిచివేసిన కొద్దీ జ‌నం అభిమానంతో పైకి లేచాడు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు...అయితే జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి విజ‌యం వెనుక కుటుంబం మొత్తం అండ‌గా నిల‌బ‌డింది. అందులో త‌ల్లి విజ‌య‌మ్మ‌ది అనిర్వ‌చ‌నీయం. కొడుకును జైలుకు పంపిన దుఃఖాన్ని దిగ‌మింగుకుంటూనే జ‌గ‌న్‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లింది. అవ‌స‌ర‌మైన ప్ర‌తీసారి విజ‌య‌మ్మ జ‌గ‌న్‌కు అండ‌గా నిల‌బ‌డింది. విజ‌యోస్తు అంటూ దీవించింది.

 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: