భార‌తీయ జ‌న‌తా పార్టీకి వైఎస్సార్ సీపీ పార్టీలు జాతీయ స్థాయిలో స‌ఖ్య‌త‌తో ముందుకు సాగుతున్న ద‌రిమిలా తాజాగా రాష్ట్రంలో రెండు పార్టీల మ‌ధ్య చెల‌రేగుతున్న ఆరోప‌ణ‌ల మంట‌లు దూరం పెంచేలా క‌న‌బ‌డుతున్నాయి. వాస్త‌వానికి జాతీయ‌స్థాయిలో కొద్దికాలంగా..ఆ మాట‌కొస్తే వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి బీజేపీ అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం బ‌హిరంగ ర‌హ‌స్యం. వైసీపీని బీజేపీకి ద‌గ్గ‌ర చేయ‌డంలో ఆ పార్టీ రాజ్య స‌భ‌ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డిది ఎంతో కీల‌క‌మైన పాత్ర అని చెప్పాలి. ఆయ‌న రాజ‌కీయ‌ప‌ర‌మైన విష‌యాల్లో నేరుగా ప్ర‌ధాని మోదీతో స‌త్సంబంధాలు క‌లిగి ఉండ‌టం గ‌మ‌నార్హం. 

 

ఇక వైసీపీ ఢిల్లీ రాజ‌కీయ నిర్ణ‌యాల్లోనూ ఆయ‌న‌దే కీల‌క పాత్ర‌. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పూర్తి బాధ్య‌త‌లను ఎంతో న‌మ్మ‌కంగా..చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రిస్తార‌నే విజ‌య‌సాయిరెడ్డికి అప్ప‌గించిన మాట వాస్త‌వం. ఇందుకు ఆయ‌న స‌మ‌ర్థ‌త‌ను కూడా నిరూపించుకుంటూ వ‌స్తూనే ఉన్నారు. అయితే ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వైసీపీ ప్ర‌భుత్వంపై కిట్ల కొనుగోళ్ల విష‌యంలో కుంభ‌కోణం జ‌రిగింద‌న్న కోణంలో ఆరోప‌ణ‌లు చేశారు. అయితే దీనికి విజ‌య‌సాయిరెడ్డి కూడా వివ‌ర‌ణ ఇచ్చారు. ఇదేప‌ని చంద్ర‌బాబు, ఆ పార్టీ ముఖ్య‌నేత‌లు కూడా చేశారు. అయితే క‌న్నాకు వివ‌ర‌ణ ఇచ్చాక కూడా మ‌ళ్లీ విమ‌ర్శ‌లు మొద‌లుపెట్ట‌డం, చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌ను కూడా క‌న్నా నోటి వెంట‌ వినిపించ‌డంతో విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర‌స్థాయిలో ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేశారు.

 

 ఏకంగా రూ. 20కోట్లు పుచ్చుకుని ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విజ‌య‌సాయిరెడ్డి వ్యాఖ్య‌లు ఇప్పుడు బీజేపీ ఢిల్లీ అధిష్ఠానానికి చేరిన‌ట్లు తెలుస్తోంది. ఆ పార్టీ కూడా చాలా సీరియ‌స్‌గా తీసుకునే అవ‌కాశాలు న్న‌ట్లు స‌మాచారం. ఢిల్లీలో దోస్తీ క‌డుతూనే...రాష్ట్రంలో వైసీపీ కుస్తీప‌డుతోంద‌ని ఫిర్యాదులు చేసిన‌ట్లుగా స‌మాచారం. క‌న్నా కూడా విజ‌య‌సాయిరెడ్డి వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకున్నారు. త‌న‌పై చేసిన ఆరోప‌ణ‌లు నిరూపించ‌కుంటే ప‌రువు న‌ష్టం దావా వేస్తాన‌ని స్పష్టం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు పార్టీల మ‌ధ్య ఉప్పునిప్పులా ఉంటున్న వ్య‌వ‌హారం ప్ర‌త్య‌క్ష యుద్దానికి దారితీసేట్లుగా క‌న‌బ‌డుతోంది. అదే జ‌రిగితే ఈ ఇద్ద‌రి నేత‌ల ఆరోప‌ణ‌ల నుంచి ఆ యుద్ధం ఆరంభ‌మైన‌ట్లుగా లెక్కేసుకోవాలి.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: