కొవిడ్-29 ప్రభావంతో అంతర్జాతీయంగా చమురు ధరలు ప‌త‌న‌మ‌వుతూ వ‌స్తున్నాయి. సోమవారం డబ్ల్యూటీఐ ముడిచమురు బ్యారెల్‌కు ఒకేసారి 15 డాలర్ల క‌న్నా ప‌డిపోవ‌డం గ‌మ‌నార్హం.  ఇది ఏకంగా 21 ఏళ్ల కనిష్ఠమని నిపుణులు చెబుతున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతుండ‌టంతో చ‌మురు  వినియోగం గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయింది. వాస్త‌వానికి ఇప్ప‌ట్లో లాక్‌డౌన్ ఎత్తివేసే అవ‌కాశాలు మెజార్టీ దేశాల్లో అయితే క‌నిపించే అవ‌కాశం క‌న‌బ‌డ‌టం లేదు. చైనా లాక్‌డౌన్ ముందు స‌డ‌లింపు ఇచ్చినా వైర‌స్ ప్ర‌భావం మ‌ళ్లీ చాలాచోట్ల క‌న‌బ‌డుతుండ‌టంతో ఆంక్ష‌లు విధించేందుకు చ‌ర్య‌లు ఆరంభించింది. 

 

ఇక చ‌మురు వినియోగం ఎక్కువ‌గా ఉండే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ప‌రిస్థితి దారుణంగా ఉంది. మిగ‌తా ఐరోపా దేశాలైన బ్రిట‌న్‌, ఫ్రాన్స్‌, ఇట‌లీ, జ‌ర్మ‌నీ, జపాన్ స‌హా ఆసియా దేశాలు ఎన్నో క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని విల‌విలాడుతున్నాయి. కరోనా కారణంగా రవాణా, సరఫరా లేకపోవడంతో ఈ దేశాల్లో చమురుకు భారీగా డిమాండ్ తగ్గింది. అదనపు ఆయిల్ నిల్వలకు సంబంధించి పెరిగిన ఆందోళనల కారణంగానే చమురు ధరలు తగ్గడానికి కారణమని క్రూడాయిల్ వ్యాపారులు పేర్కొంటున్నారు. గల్ఫ్ దేశాల‌కు ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా ఉన్న క్రూడాయిల్ వ్యాపారం దెబ్బ‌తింటే ఆదేశాల ఆర్థిక వ్య‌వస్థ‌లు పేక‌మేడాలు కూలిపోవ‌డం ఖాయ‌మే. దీంతో ఆ దేశాలు వ‌ణికిపోతున్నాయ‌నే చెప్పాలి. 

 

మ‌రో సంక్షోభం సుదీర్ఘ‌కాలం పాటు కంటిన్యూ అవుతుంద‌న్న అనుమానాలు వ్య‌క్తమ‌వుతున్న నేప‌థ్యంలో చ‌మురు వ్యాపార సంస్థ‌లకు ఏం చేయాలో అర్థంకాక సంక‌ట స్థితిలో ఉండిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో చ‌మురుకు డిమాండ్ లేక‌పోయిన ధ‌ర‌లు త‌గ్గ‌కుండా ఉంచేందుకు గాను చమురు కంపెనీలు చర్చించాయి. చమురు ధరలు తగ్గకుండా స్థిరంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల గురించి చ‌ర్చించుకున్నాయి.  ఒపెక్ దేశాలు, అనుబంధ సంస్థల మధ్య చమురు ఉత్పత్తిని తగ్గించేందుకు ఒప్పందం కుదిరింది. అయితే చమురు ధరలు తగ్గడం మాత్రం ఆగ‌క‌పోవ‌డం గమనార్హం. బ్రెంట్ క్రూడాయిల్ ధరలు కూడా తగ్గి 26 డాలర్లకు క్షీణించింది. అంతర్జాతీయంగా ధరలు తగ్గుతున్నప్పటికీ భార‌త్‌లో మాత్రం  పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. దేశంలో గడిచిన 34 రోజులుగా ధరలు స్థిరంగా ఉండ‌టం ఇందుకు నిద‌ర్శ‌నం. 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: