న‌దుల‌న్నీ జీవిత సారాల‌ను వ‌ల్లెవేస్తాయి
న‌దుల‌న్నీ బాల్య ప్రావ‌స్థ‌ల‌ను అందిస్తాయి
ముగువ‌లంతా వాటి కొన‌సాగింపులుగా ఉంటారు
అమ్మ‌లంతా దీవెన‌లు రూపంలో బిడ్డ‌ల‌కు తార‌సిల్లి
భ‌రోసా ఇచ్చిపోతారు.. అందుకే ఆ తుని పోలీసు అన్నారేమో
రోజూ వ‌చ్చి పోండి అమ్మా మీలాంటి వారు క‌నిపిస్తే మాకో ధైర్యం అని
ఇలాంటి చోట ఇలాంటి ప్రేమ ఇలాంటి వాత్స‌ల్యం న‌ది మాత్రం ఇస్తుంది
జీవితం అను న‌దిని జీవ‌న‌దిని మ‌నం ప్రేమించ‌క కాలుష్య కాసారాల‌కు
బ‌లి ఇచ్చిన సంద‌ర్భాల‌కు ఈ వైర‌స్ కాస్త విరుగుడు ..లేదా ఇదే స‌రైన జ‌వాబు
ప్ర‌శ్న‌ల్లాంటివి ఎన్ని ఉంటే అంత మేలు.. ఏమ‌యినా మీ గుండెల్లో ఓ వేదం

 

చుట్టూ ఉన్న లోకానికి ప‌రిశుద్ధతను నేర్పిందా చాలు.. స్వ‌చ్ఛ‌త అంటే లోప‌లి మాలిన్యంకు విరుగుడు అని! అవి న‌వ్వులు తీసుకువ‌స్తాయి.. జీవితం కొన‌సాగిస్తుంది.. మీ త‌ల్లీ తండ్రీ వీటిని చూసి ఆనందిస్తారు..సంపాద‌న లేదు సంసార సాగ‌రాలూ లేవు..ఏమీ లేవు ఇప్పుడున్న‌దంతా మీరు అనుకునే గొప్ప భ‌రోసా.. నాలో మీ మాట మీ న‌వ్వు నింపిన భ‌రోసాల‌నే
ఇవాళ ఇష్టంగా చేసుకుంటూ ప్ర‌యాణిస్తున్నాను అంటారే.. అది చాలు.. మీరు ఏమీ కోరుకోవొద్దు ప్లీజ్!
ఎండ‌లో ఉండే పోలీసు
నాలుగు గోడ‌ల న‌డుమ వైద్యుడు
వేళ‌కు ఇంత సేవలు చేసే వ‌లంటీరు
మీ పిల్ల‌ల‌కు త‌ప్ప‌ని స‌రి అయి పాఠం చెబుతున్న టీచ‌రు
మీ ఇంటిని మీ ఆలోచ‌న‌ల‌ను మ‌ళ్లీ మ‌ళ్లీ సంస్క‌రిస్తున్న ఈ వైర‌స్సూ
ఇవి క‌దా కావాలి.. వీరు క‌దా మీకు ముఖ్యం
నేన‌యితే ఈ కాలాన్ని ఇష్ట‌ప‌డుతూ రంగుల‌ను ఇష్ట‌ప‌డుతూ
ఈ క్లిష్ట‌త‌లో ఏమ‌యినా చేస్తే బాగుండు అని ప‌రుగులు తీస్తే ఎంతో సంతోషిస్తాను
అమ్మానాన్న‌ల‌కు స్మ‌ర‌ణ చేస్తూ పోతే ఎంతో ఆనందం.. వారి చెప్పిన మాటే ఇది ఇప్ప‌టి చ‌దువు ఇప్ప‌టి జ్ఞానం అంతా తోటి వారి కోసం వినియోగిస్తే చాలు..మీకూ ఇలాంటి త‌ల్లులే ఎండ పొడ గిట్ట‌ని వేళ తారసిల్లుతారు.. మీకూ ఇలాంటి పోలీసే సాయం అందించి ఇంటికి పంపుతాడు,.. మీకూ ఇలాంటి డీజీపీనే సెల్యూట్ చేస్తారు ముందు ఇవ్వ‌డం ఒక‌టి మీ నుంచీ నా వ‌ర‌కూ మొద‌ల‌యితే అవ‌న్నీ సంక‌ల్ప ప్ర‌ధానాలే..

 

గోదావ‌రి తీరాల్లో నేనున్నాను
అప్ప‌టి నుంచి ఇప్ప‌టిదాకా న‌ది పాట పాడుతూనే ఉన్నాను
తీరానికి ఇంత విశ్వాసం ఇవ్వ‌డం తీరం చెంత ఉన్న‌వారికే చెల్లు
తీరం న‌ది విష‌య‌మై చూపే న‌ది చుట్టూ ఉంటే రాత‌ల‌కు ఉన్నాయో లేదో
ఈ విష‌య‌మై మ‌ళ్లీ వివాదం పెట్టుకుని మ‌ళ్లీ ఎక్క‌డో ఆగిపోవ‌డం ఇష్టంగా చేసుకుంటాను ఈ త‌ల్లికి వంద‌నాలు చెల్లిస్తూ రాస్తున్నానొక మార్నింగ్ రాగా..

 

ఎండ‌ల‌ను నీడ‌లుగా అనువదించిన కాలాల గురించి భ‌ర‌ద్వాజ చెప్పిపోయాడు..నీడ‌ల‌ను నిలువ‌రించిన నీడ‌ల‌ను వేరు చేసి చూడ‌డం మాత్రం నేర్ప‌కుండా పోయాడా?? ఏమో! ఎండ‌లు ఎలా ఉన్నా కొన్ని గాలుల తీవ్ర‌త‌లు హాయిని ఇవ్వ‌డం అల‌వాటు చేసుకున్నాయి..భ‌గ‌వంతుడు ఎలా ఉన్నా ఆ రాళ్లూ ఈ కొమ్మ‌లూ ఆ న‌వ్వులూ న‌వ్వుతా ఉంటే నువ్విట్టా న‌వ్వుతా ఉంటే వెన్నెల జ‌ల‌పాతం అని చెప్పిపోతున్నాయి.. మీరేమ‌యినా జీవితం నుంచి ఆశించారా?? తెలియ‌దు స‌ర్ ..ఐతే వెళ్లిపోండి.. ఇక్క‌డి నుంచి మీరు అనుకున్న ప్ర‌తి ప‌నీ అయితీరుతుంది.. మ‌రి! జీవితం నుంచి ఏమ‌యినా నేర్చుకున్నారా అని అంటే ఇదిగో ఇలాంటి మాన‌వ‌తకు జేజేలు ప‌ల‌క‌డం ఒక్క‌టే నేర్చుకున్నాను.. మ‌న‌లో ఏమీ లేదు స‌ర్ అంటే విన‌రేం

 

కొన్ని మాత్ర‌మే ఆనంద ఇస్తాయి
సిస‌లు ఆనందం అందులోనే ఉంది
వేళ‌కు ఇంత తిన‌డంలో ఆనందం ఉంద‌ని అనుకోవ‌డం లేదిప్పుడు
నా వాళ్ల‌కే ఆ పై వాళ్ల‌కే సాంత్వ‌న దొరికాక పొందిన ఆనందంలో ఎవ్వ‌ర‌యినా ఉన్నారా స‌ర్.. వీరికి అన్నం పెట్టండి స‌ర్..వీరికి నీడ‌నివ్వ‌డం మ‌రువ‌కండి.. ఆ తెలంగాణ దారుల్లో నేను నేర్చుకున్న‌ది ఇదే అంటూ యువ ఎంపీ(రామూ)తో చెప్పిపోతున్నాను.. ఇవాళ మళ్లీ చెబుతాను,,స‌ర్.. ఇంకాస్త ఈ మ‌నుషుల‌కు మ‌నం చేరువ కావాలి అని..ఎండ‌లు పెరిగితే ఏమ‌వుతాం.. అస‌లు వేసంగి కాలాలు ఎలా ఉన్నాయి..అన్న ఆరాలోనో క‌బురులోనో క‌బురు అంద‌ని కాలంలోనో ఉన్నాం అని విస్తుబోతాం.. ఎండ‌లు పెరిగితే అడవులు ఏమౌతాయి..అడ‌వులు స‌రే మ‌నుషులు ఏమ‌యిపోతారు..లోక‌మ‌ణి మాత్రం ఇవేవీ ప‌ట్ట‌క నెల‌కు వ‌చ్చే ఆ మూడు వేలకుపైగా రూపాయల‌ను న‌వ్వుల‌లో అనువ‌దిస్తుంది.. ఏమీ లేక‌పోవ‌డం అన్న‌ది ఎప్ప‌టికీ ఓ స‌మ‌స్య కాద్సార్ స‌రియైన ప‌రిష్కారం అదొక్క‌టే..మీరేమ‌యినా ఆశించారా అంటూ ఆ పాయ‌క‌రావు పేట ఎమ్మెల్యే గొల్ల‌పల్లి బాబు రావు స‌ర్ అంటున్నారు.. ఆమెను స‌న్మానిస్తూ.. ఇదిగోండి మీకు నేను సెల్యూట్ చేస్తున్నాను అంటూ ఆనందంగా
ఆ త‌ల్లికి వంద‌నాలు చెల్లిస్తున్నారు ఈ రాష్ట్ర డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ స‌ర్ ..

 

మీరంతా ఇలానే ఇవ్వ‌డం నేర్చుకోవాలి.. తుని పోలీసులకూ ఆ ఎండ‌న ప‌డ్డ బిడ్డ‌ల‌కు త‌న వంతుగా తీసుకునిపోయిన రెండు శీత‌ల పానీయాలే ఇవ్వ‌డం అయితే అంత‌కుమించి వారి క‌ష్టం గుర్తించ‌డ‌మే గొప్ప ప‌ని..పోలీసులూ డాక్ట‌ర్లూ పారిశుద్ధ్య కార్మికులు మా క‌ష్టం గుర్తిస్తే ఆనందిస్తాం అంటారు.. అవును!
ఎవ్వ‌రి క‌ష్టం అయినా ఈ మాన‌వ మ‌నుగడ‌కు కొన‌సాగింపు ఇవ్వ‌డం అన్న‌దే ముఖ్యం క‌దూ! అలాంటిచోటు నేనున్నాను..అమ్మానాన్న ఉన్నారు.. నాతో పాటు నా బృందం ఉంది.. ఇంకాస్త న‌వ్వులూ ఉన్నాయి.. ధైర్య వ‌చ‌నం అంటే నాకు నేను కాదు మీకు నేను మీతో నేను అని అర్థం.. అలాంటి వ‌చ‌నం ఒక్క‌టి నాలో క‌ల‌దు.. అలాంటి వ‌ర్ఛ‌స్సు ఒక‌టి నాలో కల‌దు.. గోదావ‌రి క‌ల‌దు .. గంగమ్మ ఉరుకులు క‌ల‌వు.. ఇలాంటి చోట ఇలాంటి త‌ల్లుల‌కు వంద‌నాలు చెల్లించాలి.. అది బాధ్య‌త..ఏమీ ఆశించ‌క‌పోవ‌డం బాధ్య‌త.. నేర్చుకోవాలి మీరు.. నేర్చుకుంటున్నాన్నేను.. #ఏక‌మ్ #పురుషః

 

- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

మరింత సమాచారం తెలుసుకోండి: