క‌ష్ట స‌మ‌యంలో భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఒడిసి ప‌ట్టుకోవాల‌ని చూసిన చైనాకు భార‌త ప్ర‌భుత్వం చెక్ పెట్టింది. చైనాతో పాటు ఆసియా దేశాల‌న్నింటికి భార‌త్‌లో విదేవీ పెట్టుబ‌డ‌లపై ప‌రిమితులు విధించింది. ముంద‌స్తు స‌మాచారం లేకుండా దేశీయ కంపెనీలు వాటాల విక్ర‌యం చేప‌ట్ట‌కూడ‌ద‌ని స్టిక్ట్‌గా ఆదేశించ‌డంతో డ్రాగ‌న్ కంట్రీకి ఇప్పుడు మింగుడుప‌డ‌టం లేదు. వాస్త‌వానికి చైనా దేశానికి చెందిన కంపెనీలు దేశీయంగా ఫార్మా, ఐటీ, బ్యాంకింగ్‌, ఐటీ, రిటైల్‌, వ‌స్త్ర వ్యాపారా రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబ‌డులు పెడుతూ వ‌స్తున్నాయి. అయితే క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో చాలా కంపెనీలు క‌ష్టాల‌ను ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. 

 

ఈక్ర‌మంలోనే చైనా ప్ర‌భుత్వం ఆదేశ ప్ర‌భుత్వం దేశీయంగా కొన‌సాగుతున్న వాటాదారుల‌కు పెద్ద మొత్తంలో పెట్టుబ‌డిని స‌మ‌కూర్చి వాటాను పెంచుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు నిఘా వ‌ర్గాల ద్వారా అందిన స‌మాచారం మేర‌కు భార‌త ప్ర‌భుత్వం ఇప్పుడు అల‌ర్ట్ అయింది. దేశీయ రంగ సంస్థ‌ల్లో విదేశీ పెట్టుబ‌డుల‌పై ప‌రిమితులు విధించింది. అంతేకాకుండా భార‌త ప్ర‌భుత్వం నుంచి  అనుమ‌తి పొంద‌కుండా వాటాల విక్ర‌యం చేప‌ట్ట‌కూడ‌ద‌ని సంస్థ‌ల‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈమేర‌కు అధికారికంగా సోమ‌వారం ఉత్త‌ర్వులు కూడా జారీ చేసింది. భార‌త్ తాజా నిర్ణ‌యంతో చైనా పాచిక పార‌లేదు. ఎఫ్‌డీఐ క‌ట్ట‌డితో చైనా వ్యాపార సామ్రాజ్యానికి అడ్డుక‌ట్ట వేసింది. 

 


వాస్త‌వానికి భార‌త్ తెలివిగా వ్య‌వ‌హ‌రించ‌డంతో ముందు వ‌చ్చే అనేక ఆర్థిక స‌మ‌స్య‌ల‌కు, చైనా ఆగ‌డాల‌కు అడ్డుప‌డిన‌ట్లేన‌ని చెప్పాలి. ఎఫ్​డీఐలో కొత్తగా తెచ్చిన మార్పుల ప్రకారం పొరుగు దేశాలైన పాకిస్థాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. చైనా వ్యాపారాల‌కు ఇక భార‌త్‌లో చెక్ ప‌డుతున్న‌ట్లుగానే అర్థం చేసుకోవ‌చ్చు. వాస్త‌వానికి భార‌తదేశమే కాదు..ఇంకా చాలా దేశాలు ఇక చైనాను ఓ కంట క‌నిపెడుతూనే ఉంటాయి. ఐరోపా దేశాల్లో కూడా చైనా వ్యాపారుల‌ను సాగ‌నంపే చ‌ర్య‌లుంటాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే పొమ్మ‌న‌లేక పొగ‌బెట్ట‌డం ఖాయ‌మ‌నే చెప్పాలి.పెట్టుబ‌డుల‌కు అవ‌కాశాలు స‌న్న‌గిల్లితే చైనా ప‌రిస్థితి అదోగ‌తే అవుతుంది. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: