క‌రోనా వైర‌స్ వ్యాప్తి గురించి  ప్ర‌పంచానికి ముంద‌స్తుగా చైనా వెల్ల‌డించ‌క‌పోవ‌డానికి గ‌ల కార‌ణాల‌పై ఇంకా అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతూనే ఉన్నాయి. క‌రోనాతో త‌ల్ల‌డిల్లుతున్న ప్ర‌తీ దేశం కూడా ఏదో ఒక సంద‌ర్భంలో చైనాను తిట్టిపోస్తునే ఉన్నాయి. ఇక అమెరికా అయితే చైనా పేరెత్తితే చాలు ఒంటి కాలు మీద లేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ చైనాపై విచార‌ణ కొన‌సాగుతుంద‌ని, అంత‌ర్జాతీయ స‌మాజంలో చైనాను దోషిగా నిల‌బెడ‌తామ‌ని చెప్పారు. ఇదిలా ఉండ‌గా అమెరికా ప్ర‌భుత్వ స‌ల‌హాదారు పీట‌ర్ నెవారో కూడా చైనా తీరుపై మండిప‌డ్డారు. చైనా ప్ర‌పంచానికి ఎంతో ద్రోహం చేసింద‌ని వ్యాఖ్య‌నించారు.

 

ఆయ‌న లేవ‌నెత్తిన కొత్త అనుమానం మిగ‌తా ప్ర‌పంచ దేశాల‌ను కూడా ఆవైపు ఆలోచించేలా చేస్తోంది. కోవిడ్ -19కు వ్యాక్సిన్ క‌నుగోని మిగ‌తా దేశాల‌కు అమ్మేలా కుట్ర చేసి ఉంటుంద‌న్న‌ది ఆయ‌న అనుమానం.  వ్యాక్సిన్ త‌యారు చేసి మిగ‌తా దేశాలకు అత్యంత భారీ ధ‌ర‌ల‌కు దాన్ని విక్రయించి ఆర్థికంగా ఎంతో లాభప‌డాల‌ని చూసింద‌ని ఆరోపించారు. అందుకు ఆయ‌న కొన్ని లాజిక‌ల్‌గా చైనా  వ్య‌వ‌హ‌రించిన తీరును ఎత్తిచూపుతున్నారు.   చైనాలో వింత వ్యాధి వూహాన్ న‌గ‌రంలో దాదాపు 2019 డిసెంబ‌ర్ మొద‌టి వారంలో క‌నుగొన్నారు. డ‌బ్ల్యూహెచ్‌వో అనుమానంతో అడిగిన చైనా ఎందుకనో దేశంలో ఎలాంటి వ్యాధులు ప్ర‌బ‌ల‌డం లేద‌ని బుకాయించింది. 

 

అయితే ప‌రిస్థితి శ్రుతిమించ‌డం, మృతుల సంఖ్య కూడా అధికంగా ఉండ‌టం వేలాది కొత్త కేసుల న‌మోదుతో చైనా ప్ర‌పంచానికి చెప్ప‌క త‌ప్ప లేదు. జ‌న‌వ‌రి 13న చైనా అధికారికంగా వింత వ్యాధి ప్ర‌బ‌లుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇదిలా ఉండ‌గా ప్ర‌పంచంలోని చాలా రెండున్న‌ర మిలియ‌న్న ప్ర‌జ‌లు ఇప్పుడు చైనా నిర్ల‌క్ష్యం కార‌ణంగా ప్రాణాల‌తో పోరాడుతున్నార‌ని అన్నారు. వారిలో ఎంత‌మంది బ‌తుకుతార‌న్న‌ది కూడా అనుమాన‌మే. చాలా దేశాల్లో రోగుల రిక‌వ‌రీ త‌క్కువ‌గానే ఉంటోంది. మ‌ర‌ణాల శాతం కొన్ని దేశాల్లో త‌క్కువ‌గా ఉంటున్న‌...వ్యాధి బారిన ప‌డిన వారి సంఖ్య‌తో చూసిన‌ట్ల‌యితే ఎక్కువ‌నే చెప్పాలి. ఇక అమెరికాలో అయితే ఈరోజు నాటికి 792,938ల‌క్ష‌మంది క‌రోనాతో బాధ‌ప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: