’ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయమన్నాడట వెనకటికి ఎవడో’ అనేది తెలుగులో చాలా పాపులర్ సామెత. ప్రస్తుతం ఏపిలో ప్రతిపక్షాల వ్యవహారం కూడా అచ్చం ఇలాగే ఉంది. కరోనా వైరస్ పరీక్షలకు సంబంధించి ర్యాపిడ్ టెస్టింగ్  కిట్లను ధక్షిణ కొరియా నుండి తెప్పించిన విషయం తెలిసిందే. లక్ష కిట్లను తెప్పించటంలో భారీగా అవినీతి జరిగిందని టిడిపి+బిజెపి నేతలు ఒకటే రచ్చ చేస్తున్నారు. ఇంతకీ వాళ్ళు చేస్తున్న రచ్చకు ఆధారం ఏమిటయ్యా అంటే ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం 337 రూపాయలకే కొన్న కిట్లను ఏపి ప్రభుత్వం మాత్రం 730 రూపాయలకు కొన్నది కాబట్టి అవినీతి జరిగిందట.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కిట్ల కొనుగోలుకు ఆర్డర్ పెట్టేటపుడే మరెవరికైనా తక్కువ ధరకే ఇస్తే తాము కూడా అదే ధర చెల్లిస్తామని పర్చేస్ ఆర్డర్ పెట్టేటపుడే ఏపి ప్రభుత్వం షరతులు పెట్టింది. అలాగే ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం తెప్పించుకున్న కిట్లకు ఏపికి వచ్చిన కిట్ల స్పెసిఫికేషన్ కు తేడా ఉంది. ఛత్తీస్ ఘడ్ కు వచ్చిన కిట్లతో పరీక్షల రీజల్టు రావటానికి 30 నిముషాలు పడుతుంది. ఏపికి తెప్పించుకున్న కిట్లతో 10 నిముషాల్లోనే రిజల్టు వచ్చేస్తుంది. అంటే స్పెసిఫికేషన్ మారింది కాబట్టి ధరల్లో కూడా తేడాలుంటాయన్న కనీసం ఇంగితం కూడా ప్రతిపక్షాల్లో కనబడలేదు.

 

సరే  ఈ విషయాన్ని పక్కన పెట్టేసినా ఏపి లక్ష కిట్లను కొనుగోలు చేసిన మరుసటి రోజే కేంద్రప్రభుత్వం కూడా 2 లక్షల కిట్లకు ఆర్డర్ పెట్టింది. ఒక్కో కిట్టుకు కేంద్రం ఎంత చెల్లిస్తోందంటే 795 రూపాయలు. అంటే ఏపి చెల్లిస్తున్న ధరకన్నా ఒక్కో కిట్ కు 60 రూపాయలు ఎక్కువగా  చెల్లిస్తోంది. ఏపి చెల్లించిన ధరలోనే అవినీతి జరిగిందని అనుకుంటే మరి కేంద్రం చెల్లించిన ధరలో ఇంకెంత అవినీతి జరిగుండాలి ?

 

ఏపి అవినీతి గురించి నానా రచ్చ చేస్తున్న టిడిపి, బిజెపి నేతలు కేంద్రం చేసిన అవినీతి గురించి మాత్రం ఎందుకు మాట్లాడటం లేదు ? ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టిడిపి నేతలు జగన్మోహన్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ముందు వెనకా ఆరోపణలు చేసేశాడు. కన్నా ఆరోపణల ప్రకారం కేంద్రప్రభుత్వం కూడా భారీ అవినీతికి పాల్పడినట్లే లెక్క.

 

ఇక్కడ బయటపడిన విషయం ఏమిటంటే చంద్రబాబునాయుడు కానీ లేకపోతే బిజెపిలోని చంద్రబాబు మద్దతుదారులు కానీ ఏమి చెబితే కన్నా గుడ్డిగా ఫాలో అయిపోతున్నారని. అంటే టిడిపితో  పాటు కన్నాకు కూడా ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయమనే సామెత సరిగ్గా సరిపోతుంది. లేకపోతే చంద్రబాబు లేకపోతే టిడిపి నేతలకు జగన్ పై బురద చల్లటమే పనిగా పెట్టుకున్నారు. మరి వాళ్ళతో కన్నా కూడా చేతులు కలిపి బురద చల్లేద్దామంటే ఎలా కుదురుతుంది ? ఎందుకంటే ఏపిలో జగన్ పై ఆరోపణలు చేసేముందు కేంద్రంలో తమ ప్రభుత్వం ఏమి చేస్తోందో ఒకసారి చూసుకోవద్దా ?  బేస్ లెస్ ఆరోపణలు ఎన్ని చేసినా చంద్రబాబుకు కొత్తగా పోయేదేమీ లేదు. చంద్రబాబును గుడ్డిగా ఫాలో అయితే కన్నాకు ఉన్న పోస్టు ఊడిపోవటం ఖాయం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: