నీతులు చెప్పిన నోళ్లే...చేతల్లో త‌ప్పిన‌ట్లుగా ఉంది వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధుల వ్య‌వ‌హ‌ర శైలి. సామాజిక దూరం పాటించాల‌ని ప్ర‌సంగాలిస్తున్న నేత‌లు త‌మ కార్య‌క్ర‌మం దాకా వ‌చ్చేస‌రికి మాత్రం ఆ నినాదాన్ని గాలికి వ‌దిలేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు వినిప‌స్తున్నాయి. ఇందుకు వీడియోలు...ఫొటోలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఇంటి నుంచి కాలు బ‌య‌ట‌పెట్ట‌వ‌ద్దు మ‌హాప్ర‌భో అంటూ నిపుణులు, వైద్యులు పేర్కొంటున్నా..ప్ర‌జాప్ర‌తినిధులు వింటేనే..గుంపులు గుంపులుగా..పెద్ద మంది మ‌ర్బాలాన్ని కార్య‌క్ర‌మాలు...ప్రారంభోత్స‌వాల‌కు త‌ర‌లివెళ్తుండ‌టం వారికే చెల్లుబాటు అవుతోంది. ఓ వైపు రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నా నేత‌లు త‌మ తీరును మార్చుకోవ‌డం లేదు. 


త‌మ హంగు ఆర్భాటాల‌కే పెద్ద‌పీట వేస్తుండ‌టం దేనికి సంకేతం. నోరు ఒక‌టి ప‌లికితే నొస‌లొక‌టి ప‌లికిన‌ట్లుగా ఉంది నేత‌ల తీరు. ఎంతో బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌వుల్లో ఉండి కూడా ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం ఏంట‌ని సామాన్య‌జనం నుంచి ఈస‌డింపులు మొద‌లవుతున్నాయి. వాస్త‌వానికి రాష్ట్రంలో క‌రోనా క‌ట్ట‌డికి ముఖ్య‌మంత్రి ఎంతో వేగ‌వంతంగా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. వైద్య సదుపాయాల క‌ల్ప‌న‌కు కృషి చేస్తున్నారు. ర్యాపిడ్ టెస్టుల ద్వారా విస్తృతంగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించి అనుమానితుల‌ను వెంట‌నే క్వారంటైన్‌కు త‌ర‌లించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ముఖ్య‌మంత్రి ఇలా క‌ష్డ‌ప‌డుతున్నా...ఎమ్మెల్యేలు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు తీసుకువ‌స్తోంద‌ని సొంత పార్టీ నేత‌ల నుంచి విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.


  మొన్న కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ రాయలసీమ వర్సిటీలో తిరిగిన వివాదం సద్దుమణగకముందే, నగరి ఎమ్మెల్యే రోజా బోరు ప్రారంభోత్సవం పేరుతో హంగామా చేశారు. దీనిపై రచ్చ నడుస్తుండగానే పలాస ఎమ్మెల్యే అప్పలరాజు అయితే  ఏకంగా విజయవాడ వచ్చి వెళ్లారు. ఇక వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు, పార్టీలో నెంబ‌ర్ -2గా పిలువ‌బ‌డుతున్న  విజయసాయిరెడ్డి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు.  విశాఖ జిల్లాలో సాధారణ పరిస్ధితుల్లో లాగానే తిరిగేస్తుండ‌టంపై తీవ్ర విమ‌ర్శ‌లు విన‌బ‌డు తున్నాయి. ఇదిలా ఉండ‌గా  సీఎం జగన్ మాత్రం..  తాడేపల్లిలోని తన క్యాంపు ఆఫీసు దాటి బయటకు రావడం లేదు. అధికారులతో నిత్యం స‌మీక్ష‌ల‌తో బిజీబిజీగా  గ‌డుపుతున్నారు. ప్రజలు కరోనా వైరస్ ప్రభావం తగ్గేవరకూ బయటికి రావద్దంటూ సీఎం హిత‌వు ప‌లుకుతున్నారు.  కానీ సొంత పార్టీ నేతలను మాత్రం ఆయన నియంత్రించలేకపోతున్నార‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: